మీకు తెలుసా.. ఈ కారు, బైక్ కంటే చాలా చీప్

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజు రోజుకి ఎక్కువవుతోంది. ఈ క్రమంలో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి చేస్తున్నారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు అందించే కొద్దిమంది తయారీదారులు ఉన్నప్పటికీ అవి ఎక్కువ ధరను కలిగి ఉంటాయి.

ఇటీవల కాలంలో విద్యావర్ధక కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (వివిసిఇ), మైసూర్ మెసానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు టాటా నానో ఆధారంగా ఒక ఎలక్ట్రిక్ కారును తయారుచేశారు. ఈ విద్యార్థులు తయారుచేసిన ఈ కారు కొత్త రాయల్ ఎన్‌ఫైల్డ్ క్లాసిక్ 350 కన్నా తక్కువ ధరను కలిగి ఉంది. ఈ తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ కారు గురించి పూర్తి సమకాహారం ఇక్కడ తెలుసుకుందాం.

మీకు తెలుసా.. ఈ కారు ధర బైక్ ధర కంటే చాలా చీప్

కారును నిర్మించిన మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులు తమ చివరి సంవత్సరం ప్రాజెక్టులో భాగంగా ఎలక్ట్రిక్ నానోను అభివృద్ధి చేశారు. టాటా నానో ఎలక్ట్రిక్ కారుకు అయినా మొత్తం ఖర్చు ఒక కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ధర కన్నా తక్కువ. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ధర రూ. 1.55 లక్షలు (ఎక్స్-షోరూమ్).

మీకు తెలుసా.. ఈ కారు ధర బైక్ ధర కంటే చాలా చీప్

దీనికి సంబంధించిన నివేదికల ప్రకారం మెకానికల్ విద్యార్థులు రూ. 41,500 విలువైన టాటా నానోను కొనుగోలు చేశారు. దీనిని మాడిఫై చేయడానికి అయిన మొత్తం ఖర్చు రూ. 96,658. ఈ కారులో ఎలక్ట్రిక్ మోటారు యూనిట్, బ్యాటరీలు వంటివి మాడిఫై చేయబడ్డాయి.

MOST READ:సివిక్ డీజిల్ ఎడిషన్ బుకింగ్స్ స్టార్ట్ చేసిన హోండా, డెలివరీస్ ఎప్పుడంటే?

మీకు తెలుసా.. ఈ కారు ధర బైక్ ధర కంటే చాలా చీప్

ఈ టాటా నానో కారు ఒక వ్యక్తి ప్రయాణించడానికి 40 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది. ఈ కారు ప్రయాణించడానికి కిలోమీటరుకు కేవలం 1.15 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారులో నలుగురు వ్యక్తులతో, ప్రయాణిస్తే ఇది ఒక పూర్తి ఛార్జీతో 35 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. దీని వల్ల కిలోమీటరుకు సుమారు రూ .1.32 వరకు ఖర్చు అవుతుంది.

మీకు తెలుసా.. ఈ కారు ధర బైక్ ధర కంటే చాలా చీప్

నానో ఎలక్ట్రిక్ కారు ఒక వ్యక్తి ప్రయాణించడానికి గంటకు 40 కి.మీ చేయగలదు. కానీ ఎక్కువ మందితో టాప్-స్పీడ్ గంటకు 35 నుండి 40 కి.మీ మధ్య మారుతుంది. కారు సున్నా నుండి పూర్తిగా ఛార్జ్ చేయడానికి 6 గంటల 36 నిమిషాలు పడుతుంది. ఛార్జ్ ని త్వరగా ఫుల్ చేయడానికి వేరే మార్గం లేదు. దీనిని మళ్ళీ అభివ్రుద్దు చేయడానికి మళ్లీ అభివృద్ధి చెందడానికి కొంత డబ్బు అవసరం అవుతుంది.

MOST READ:ఆలస్యంగా పట్టుబడ్డ ఘరానా దొంగ ; 13 బైకులు స్వాధీనం

మీకు తెలుసా.. ఈ కారు ధర బైక్ ధర కంటే చాలా చీప్

ప్రస్తుత రోజుల్లో, వాయు కాలుష్యం మానవ ఆరోగ్యానికి పెద్ద నష్టాలను కలిగిస్తుంది.వాయు కాలుష్యానికి ప్రధాన కారణం పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ల ద్వారా ఉత్పత్తి చేయబడిన పొగ. వాహనాల వల్ల కలిగే వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి భారత ప్రభుత్వం సాహసోపేతమైన చర్య తీసుకుంది. ఈ కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రస్తుతం మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేసి వాడుతున్నారు.

మీకు తెలుసా.. ఈ కారు ధర బైక్ ధర కంటే చాలా చీప్

భారతదేశంలో, ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజలకు ఇంకా సరైన అవగాహనా లేదు. అంతే కాకుండా ఈ ఎలెక్ట్రిక్ వాహనాలకు కావలసిన మౌలిక సదుపాయాలు కూడా మన దేశంలో అందుబాటులో లేదు. దేశం అభువృద్ది చెందుతున్న తరుణంలో కాలుష్యాన్ని తగ్గించడానికి రాబోయే రోజుల్లో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఎక్కువగా ఉంటుంది.

MOST READ:కూతుర్ని కారు షోరూమ్‌కు తీసుకెళ్తే 22 లక్షలు కట్టాల్సి వచ్చింది

Most Read Articles

English summary
This Tata Nano Electric Car costs less than a Royal Enfield Classic 350. Read in Telugu.
Story first published: Wednesday, June 17, 2020, 12:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X