బ్రేకింగ్: సియెర్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకొచ్చిన టాటా మోటార్స్

టాటా సియెర్రా ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ ఎస్‌యూవీని ఢిల్లీలో జరుగుతున్న indian auto expo ఆవిష్కరించింది. టాటా మోటార్స్ తమ ఐకానిక్ మోడల్ "సియెర్రా" ఎస్‌యూవీని మళ్లీ ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. 1990 కాలం నాటి సియెర్రా మోడల్‌కు గౌరవాన్నిస్తూ.. సియెర్రా ఎలక్ట్రిక్ వెర్షన్ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చింది.

బ్రేకింగ్: సియెర్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకొచ్చిన టాటా మోటార్స్

1990లో టాటా ప్రవేశపెట్టిన సియెర్రా ఒరిజనల్ ఎస్‌యూవీ నుండి సేకరించిన ఎన్నో లక్షణాలతో సరికొత్త సియెర్రా ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ ఎస్‌యూవీని డెవలప్ చేశారు. వాలుగా ఉన్నటువంటి రియర్ విండోలు, మూడు డోర్లు యధావిధిగా వచ్చాయి. అయితే, ఒరిజినల్‌తో సియెర్రా తరహాలో కాకుండా ఎడమవైపున స్లైడింగ్ డోర్ వచ్చింది.

బ్రేకింగ్: సియెర్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకొచ్చిన టాటా మోటార్స్

టాటా సియెర్రా ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ ఇంటీరియర్‌లో విశాలమైన క్యాబిన్, ప్రీమియం ఫీల్ కలిగించే అప్‌హోల్‌స్ట్రే మరియు సీట్లు వచ్చాయి. వెనుక వరుసలో అత్యంత సౌకర్యవంతమైన బెంచ్ సీటును అందించారు.

బ్రేకింగ్: సియెర్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకొచ్చిన టాటా మోటార్స్

టాటా మోటార్స్ సియెర్రా ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ ఎస్‌యూవీలో ఎన్నో అత్యాధునిక ఫీచర్లను అందిస్తోంది. ప్రత్యేకించి ఎక్ట్సీరియర్‌లో ఎల్ఈడీ లైటింగ్, ఫ్రంట్ డిజైన్‌లో పగటి పూట వెలిగే లైట్ కోసం మందమైన ఎల్ఈడీ లైట్ స్ట్రిప్, ఫాగ్ ల్యాంప్స్ వచ్చాయి. సియెర్రా ఎస్‌యూవీకి భారీ రూపాన్నిచ్చేందుకు స్టైలిష్ అల్లాయ్ వీల్స్ మరియు ధృడమైన టైర్లు ఉన్నాయి.

బ్రేకింగ్: సియెర్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకొచ్చిన టాటా మోటార్స్

టాటా సియెర్రా ఎలక్ట్రిక్ సైడ్ ప్రొఫైల్‌ పలు క్యారెక్టర్ లైన్స్‌తో ఎంతో సింపుల్‌గా ఉంది. రియర్ డిజైన్‌లో డిక్కీ డోర్ ఎంత వెడల్పు ఉంటే.. అంత వెడల్పుతో ఎల్ఈడీ లైటింగ్ స్ట్రిప్‌ను టెయిల్ లైట్‌గా అందించారు.

బ్రేకింగ్: సియెర్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకొచ్చిన టాటా మోటార్స్

వీటితో పాటు, టాటా సియెర్రా ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ ఎస్‌యూవీ టాటా వారి లేటెస్ట్ "ఇంపాక్ట్ 2.0" డిజైన్ లాంగ్వేజ్‌లో వచ్చింది. టాటా హెచ్‌బిఎక్స్ మినీ ఎస్‌యూవీ మరియు ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును అభివృద్ది చేసిన టాటా ఆల్ఫా ఆర్కిటెక్చర్ ఫ్లాట్‌ఫామ్ మీద దీనిని డెవలప్ చేశారు.

బ్రేకింగ్: సియెర్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకొచ్చిన టాటా మోటార్స్

టాటా సియెర్రా ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ గురించి ఎలాంటి సాంకేతిక వివరాలను వెల్లడించలేదు. సియెర్రా ఎలక్ట్రిక్ వెహికల్ ప్రొడక్షన్‌కు సంభందించి ఎలాంటి సమాచారం లేదు. మార్కెట్లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీనిని ఆవిష్కరించారు.

బ్రేకింగ్: సియెర్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకొచ్చిన టాటా మోటార్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మార్కెట్లోకి ఎన్ని కొత్త కార్లు వచ్చినా... ఓ ఇరవై, ముప్పై ఏళ్ల క్రితం వచ్చిన మోడళ్లను ఎప్పటికీ మరిచిపోలేం. కాల గర్భంలో కలిసిపోయిన పాత మోడళ్లను మళ్లీ మార్కెట్లోకి లాంచ్ చేయాలనే ఉద్దేశ్యంతో టాటా మోటార్స్ సియెర్రా ఎస్‌యూవీని మళ్లీ తీసుకొచ్చింది. అయితే, భవిష్యత్తులో పెట్రోల్ మరియు డీజల్‌తో నడిచే కార్లకు బదులుగా ఎలక్ట్రిక్ కార్లు వస్తుండటంతో, సియెర్రా ఎస్‌యూవీని ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ఆవిష్కరించారు. టాటా సియెర్రా ఎలక్ట్రిక్ మీకు నచ్చిందా...? దీని కోసం వెయిట్ చేస్తున్నారా..? అయితే మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ బాక్సులో మాతో పంచుకోండి. ఆటో ఎక్స్‌పోలో టాటా ఆవిష్కరిస్తున్న మరిన్ని కార్ల కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగు చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Auto Expo 2020: Tata Sierra EV Concept Unveiled - The Sierra Is Back In A New Avatar. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X