మారుతి స్విఫ్ట్ హైబ్రిడ్: లీటర్‌కు 32కిమీల మైలేజ్!

మారుతి సుజుకి 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌లో జిమ్మీ ఆఫ్-రోడ్ స్మాల్ ఎస్‌యూవీతో పాటు సరికొత్త ఇగ్నిస్ మరియు వితారా బ్రిజా ఎస్‌యూవీని ఆవిష్కరించింది. అయితే, వీటితో పాటు గ్లామరస్ స్విఫ్ట్ హైబ్రిడ్ ఎస్ఎల్ కారును కూడా ప్రదర్శించింది.

మారుతి స్విఫ్ట్ హైబ్రిడ్: లీటర్‌కు 32కిమీల మైలేజ్!

ఇంతకీ దీని ప్రత్యేకంతేంటో తెలుసా..? ఇది లీటర్ పెట్రోల్‌కు ఏకంగా 32కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఆశ్చర్యపోయారా..? మీరే కాదు మేము కూడా ఆశ్చర్యపోయాం.. పెట్రోల్ కారు ఇంత మైలేజ్ ఎలా ఇస్తుందో.. దీని సాధ్యాఅసధ్యాలేంటో చూద్దం రండి..

మారుతి స్విఫ్ట్ హైబ్రిడ్: లీటర్‌కు 32కిమీల మైలేజ్!

జపాన్ దిగ్గజం సుజుకి ఆవిష్కరించిన ఈ స్విఫ్ట్ ఇటు ఎలక్ట్రిక్ కాదు.. పూర్తిగా అటు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కూడా కాదు. బాలెనో మరియు ఎర్టిగా కార్ల తరహాలో కనీసం మైల్డ్-హైబ్రిడ్ కూడా కాదు. కానీ ఇది పూర్తి స్థాయి హైబ్రిడ్ కారు. జపాన్ పరీక్షల్లో ఇది ఏకంగా 32కిమీల మైలేజీనిచ్చింది.

మారుతి స్విఫ్ట్ హైబ్రిడ్: లీటర్‌కు 32కిమీల మైలేజ్!

ప్రస్తుతం మన మార్కెట్లో ఉన్న మారుతి స్విఫ్ట్ గురించి మాట్లాడుకుంటే.. పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు 21.21కిమీలు మరియు డీజల్ వేరియంట్ 28కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. కానీ సుజుకి స్విఫ్ట్ ఎస్ఎల్ హైబ్రిడ్ వేరియంట్ ఏకంగా 50శాతం ఎక్కువ మైలేజ్ ఇస్తుంది.

మారుతి స్విఫ్ట్ హైబ్రిడ్: లీటర్‌కు 32కిమీల మైలేజ్!

లీటర్ పెట్రోల్ 72 రూపాయలతో లెక్కించుకుంటే ఒక కిలోమీటర్‌కు అయ్యే రూ. 3.4 ఖర్చుని, కిమీకు 2.25 రూపాయలకు తగ్గిస్తుంది. దీంతో ఇండియన్ మార్కెట్లో ఉన్న 17 మోడళ్ల కంటే ఈ హైబ్రిడ్ స్విఫ్ట్ ఎస్ఎల్ వేరియంట్ అన్నింటికంటే విభిన్నంగా నిలిచింది.

మారుతి స్విఫ్ట్ హైబ్రిడ్: లీటర్‌కు 32కిమీల మైలేజ్!

పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానంతో వచ్చిన ఇంజన్ వ్యవస్థ నిజజీవితంలో రోడ్డు మీద నిజంగానే ఇంత మైలేజ్ ఇస్తుందా అంటే.. అందరికీ కాస్త అనుమానం కలుగుతుంది. ఇంత మైలేజ్ ఎలా సాధ్యమైందో క్లుప్తంగా క్రింది స్లైడర్లలో..

మారుతి స్విఫ్ట్ హైబ్రిడ్: లీటర్‌కు 32కిమీల మైలేజ్!

సుజుకి స్విఫ్ట్ హైబ్రిడ్ ఎస్ఎల్ వేరియంట్లో సాంకేతికంగా 1.2-లీటర్ కెపాసిటీ గల పెట్రోల్ ఇంజన్ కలదు, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇంజన్ గరిష్టంగా 92బిహెచ్‌పి పవర్ మరియు 118ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి అదనంగా, 13.6బిహెచ్‌పి పవర్ మరియు 30ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 48V ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానం కలదు.

మారుతి స్విఫ్ట్ హైబ్రిడ్: లీటర్‌కు 32కిమీల మైలేజ్!

గతంలో హైబ్రిడ్ వెర్షన్‌లో వచ్చిన కార్లలో 6V ఎలక్ట్రిక్ మోటార్ ఉండేది, ఇది ఉన్నా కూడా పెద్దగా తేడా ఉండేది కాదు. అయితే, బాలెనో మరియు ఎర్టిగా కార్లలోని హైబ్రిడ్ వేరియంట్లలో 12V కెపాసిటీ గల ఎలక్ట్రిక్ మోటార్ వచ్చింది. అయితే, మనం మాట్లాడుకుంటున్నా స్విఫ్ట్ హైబ్రిడ్ ఎల్ఎస్ వేరియంట్లో ఏకంగా 48V సామర్థ్యం గల ఎలక్ట్రిక్ మోటార్ ఉంది.

మారుతి స్విఫ్ట్ హైబ్రిడ్: లీటర్‌కు 32కిమీల మైలేజ్!

శక్తివంతమైన 48V ఎలక్ట్రిక్ మోటార్ ఉండటంతో పెట్రోల్ ఇంజన్ పని కాస్త తగ్గిపోతుంది. కాబట్టి, పెట్రోల్ వాడకం కూడా గణనీయంగా తగ్గిపోతుంది. దీని కోసం ప్రత్యేకమైన బ్యాటరీ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. కారులో శక్తివంతమై ఇంజన్ మరియు అంతే సామర్థ్యం గల బ్యాటరీ వ్యవస్థ ఉండటంతో పవర్‌కు పవర్ మైలేజ్‌కు మైలేజ్ సాధ్యమైంది.

మారుతి స్విఫ్ట్ హైబ్రిడ్: లీటర్‌కు 32కిమీల మైలేజ్!

మారుతి స్విఫ్ట్ హైబ్రిడ్ ఎస్ఎల్ కారులో యాక్సిలరేషన్ పెడల్ తొక్కిన వెంటనే తొలి 30 నుండి 40 సెకన్ల వ్యవధిలో ఎలక్ట్రిక్ మోటార్‌తో నడుస్తుంది. అదే విధంగా, కారును నిలపాలనుకున్నపుడు యాక్సిలరేషన్ పెడల్ మీద నుండి కాలు తీసేస్తే, ఆటోమేటిక్‌గా ఇంజన్ ఆఫ్ అయిపోయి, వెంటనే ఎలక్ట్రిక్ మోటార్ పనిచేస్తుంది. దీంతో పాటు కదులుతూ-ఆగుతూ ముందుకెళ్లే ట్రాఫిక్‌లో పూర్తిగా ఎలక్ట్రిక్ మోటార్‌తో నడుస్తుంది. ఇలా ఎన్నో సందర్భాల్లో ఎలక్ట్రిక్ మోటార్ పెట్రోల్ వాడకాన్ని దాదాపు తగ్గించేస్తుంది.

మారుతి స్విఫ్ట్ హైబ్రిడ్: లీటర్‌కు 32కిమీల మైలేజ్!

ధర మరియు విడుదల వివరాలు

మారుతి సుజుకి స్విఫ్ట్ హైబ్రిడ్ ఎస్ఎల్ వేరియంట్ విడుదల గురించి ఇంకా ఎలాంటి స్పష్టమైన సమాచారం రాలేదు. మారుతి-టయోటా లిథియం బ్యాటరీ తయారీ ప్లాంటు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మరియు మారుతి వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ విడుదలయ్యాక దీనిని దేశీయ మార్కెట్లోకి లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ సెగ్మెంట్లో ఉన్న ఇతర మోడళ్లకు ధీటైన పోటీనిచ్చే అత్యంత పోటీతత్వంతో కూడిన ధరతో 2021 చివరి నాటికల్లా విడుదలయ్యే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
The technology behind the 32kmpl Suzuki Swift Hybrid. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X