Just In
Don't Miss
- News
ఢిల్లీలో ఉద్రిక్తతలు: భారత్‌లోని రాయబార కార్యాలయాలకు అమెరికా భద్రతా హెచ్చరికలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Movies
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బిగ్ బ్రేకింగ్ న్యూస్: భారత్‌కు టెస్లా రాకను ఖరారు చేసిన ఎలన్ మస్క్!
ఎలక్ట్రిక్ కార్ల తయారీ రంగంలో విప్లవం సృష్టించిన ప్రముఖ అంతర్జాతీయ ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ తయారీ సంస్థ టెస్లా ఐఎన్‌సి వచ్చే ఏడాది భారత్‌లోకి అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని టెస్లా సంస్థ అధినేత ఎలన్ మస్క్ ధృవీకరించారు.

టెస్లా ఐఎన్‌సి సీఈఓ ఎలన్ మస్క్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా, వచ్చే ఏడాది భారత మార్కెట్లో టెస్లా కార్లను విడుదల చేస్తామని సమాధానమిచ్చారు. టెస్లా క్లబ్స్ ఇండియాలో ఓ టీ-షర్టు ఫొటోను పోస్టు చేశారు, ఆ టీ-షర్టుపై ‘ఇండియా వాంట్స్ టెస్లా' అని ప్రింట్ చేయబడి ఉంది.

దీనిని గుర్తించిన ఓ అభిమాని, అంటే దీనర్థం భారత్‌కు టెస్లా వస్తుందనా? అయితే ఎప్పుడు? అని ప్రశ్నించ ఎలోన్ మస్క్ ‘వచ్చే ఏడాది ఖచ్చితంగా' అంటూ సమాధానం ఇచ్చారు. ఎలన్ మస్క్ అదే ట్వీట్‌కు ‘వేచి ఉన్నందుకు ధన్యవాదాలు!' అని సమాధానం ఇచ్చారు. టెస్లా రాక కోసం దేశం చాలా కాలంగా ఎదురుచూస్తున్నందున ఇది గొప్ప వార్త అని టెస్లా అభిమానుల క్లబ్ సమాధానం ఇచ్చింది.
MOST READ:రోల్స్ రాయిస్ నుంచి రానున్న హైస్పీడ్ ఎలక్ట్రిక్ విమానం ఇదే.. చూసారా !

టెస్లా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టాప్ ఎలక్ట్రిక్ ఆటోమోటివ్ తయారీదారుల్లో అగ్రగామిగా ఉంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), అటానమస్ డ్రైవింగ్, సుధీర్ఘ బ్యాటరీ రేంజ్ వంటి, విలాసవంతమైన ఫీచర్స్, ధృడమైన నిర్మాణం వంటి ఎన్నో విశిష్టలతో టెస్లా ఎలక్ట్రిక్ కార్లు తయారు చేయబడుతాయి.

టెస్లా కార్లు ముఖ్యంగా వాటి టెక్నాలజీ మరియు రేంజ్ విషయంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందాయి. టెస్లా నుండి లభిస్తున్న ఎంట్రీ లెవల్ "మోడల్ 3" ఎలక్ట్రిక్-కారు వేరియంట్‌ను బట్టి ఒకే ఛార్జీపై గరిష్టంగా 500 కిలోమీటర్లకు పైగా డ్రైవింగ్ రేంజ్‌ను కలిగి ఉంటుంది. ఇది కేవలం 3.5 సెకండ్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
MOST READ:బిగ్ బ్రేకింగ్ న్యూస్: భారత్‌కు టెస్లా రాకను ఖరారు చేసిన ఎలన్ మస్క్!

టెస్లా మోడల్ 3 లాంగ్ డ్రైవింగ్ రేంజ్ మరియు మెరుగైన ప్రాక్టికాలిటీతో పాటుగా ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో లభిస్తుంది. దీని క్యాబిన్‌లో అమర్చిన పెద్ద కేంద్రీకృత మౌంటెడ్ టాబ్లెట్ ఇన్‌స్పైర్డ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ప్రత్యేక ఆకర్షనగా నిలుస్తుంది. ఇది ఛార్జ్ స్థితి మరియు సమీప ఛార్జింగ్ స్టేషన్లతో పాటుగా అనేక గణాంకాలను డ్రైవర్‌కు తెలియజేస్తుంది.

మునుపటి నివేదికల ప్రకారం, భారత్‌లోని అధిక దిగుమతి సుంకాల కారణంగా టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించడం ఆలస్యం అయ్యింది. భారత్‌లో దిగుమతి సుంకాలు 100 శాతానికి పైగా ఉన్నందున, మనలాంటి ప్రైస్-సెన్సిటివ్ మార్కెట్లలో టెస్లా కార్లు మరింత ఖరీదైనవిగా ఉంటాయి. ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే, టెస్లా తమ కార్లను స్థానికంగా భారత్‌లోనే ఉత్పత్తి చేసినట్లయితే, వీటి ధరలు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది.
MOST READ:మహీంద్రా థార్ కన్వర్టిబల్‌ను చూశారా? - ధర, వివరాలు

ఇటీవలి కథనాల ప్రకారం, టెస్లా భారతదేశంలో ఒక పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాన్ని (ఆర్ అండ్ డి) ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ కర్ణాటకలోని బెంగళూరులో ఆర్ అండ్ డి సెంటర్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది.

దేశంలో అంకితమైన ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని ప్రకటించిన తొలి భారత రాష్ట్రం కర్ణాటక. ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలకు ప్రభుత్వం నుండి రాయితీలను ఇవ్వడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ మరియు యాజమాన్య వ్యయాన్ని తగ్గించడమే ఈ రాష్ట్రం యొక్క ప్రధాన లక్ష్యం. టెస్లా మరియు ఇతర ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు దేశవ్యాప్తంగా తమ ఉత్పత్తులను స్థానికంగానే చేసి విక్రయించడానికి ఈ చొరవ ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది.
MOST READ:త్వరపడండి.. హోండా కార్లపై ఆకర్షనీయమైన ఆక్టోబర్ నెల ఆఫర్లు!

భారత్‌లో టెస్లా ఎలక్ట్రిక్ కార్ల విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
భారత ప్రభుత్వం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి మరియు అమ్మకాలకు సహాయపడే ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నాయి. దేశంలో ప్రస్తుత మార్పును సద్వినియోగం చేసుకుని 2021లో భారత్‌లోకి ప్రవేశించాలని టెస్లా యోచిస్తోంది.