గోల్డ్ కారు డ్రైవ్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేయాలనుకుంటే.. ?

అబ్దుల్ కలాం గారు చెప్పినట్లు కలలు కనండి, ఆకలలను సాకారం చేసుకోండి అన్నట్లు ఒక వ్యక్తి ఏకంగా అనుకున్నట్లు తన రోల్స్ రాయిస్ కారుని బంగారు కారుగా మార్చిన ఉదంతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరింత సమాచారం ఇప్పుడు మీకోసం..

గోల్డ్ కారు డ్రైవ్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేయాలనుకుంటున్నారా.. !

సాధారణంగా యువకులు మనస్సు అత్యంత విలువైన మరియు విలాసవంతమైన వాహనాలను ఉపయోగించాలని ఆశిస్తూ ఉంటుంది. మార్కెట్లో రోల్స్ రాయిస్ అనేది చాలా ఎక్కువ ధర కలిగిన కారు. కాబట్టి ఇటువంటి కార్లను చాలా అరుదుగానే ఉపయోగిస్తూ ఉంటారు. చాలా మంది ఇటువంటి లగ్జరీ కార్లను కొనాలని కలలు కంటూ ఉంటారు.

గోల్డ్ కారు డ్రైవ్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేయాలనుకుంటున్నారా.. !

చాల మంది వాహనప్రియులు ఈ ఖరీదైన కార్లను కొనడానికి కాకపోయినా వీటిని అద్దెకి తీసుకుంటూ ఉంటారు. మామూలుగా ఈ రోల్స్ రాయిస్ కార్లను అద్దెకు తీసుకోవడం కూడా చాలా డబ్బుతో కూడుకున్న విషయం. ఒక రోజుకి ఈ రోల్స్ రాయిస్ కార్లను అద్దెకు తీసుకోవాలంటే రూ. 40,000 నుంచి 50,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఈ కారు యొక్క అద్దె ఒక సాధారణ వ్యక్తి నెల జీతం.

గోల్డ్ కారు డ్రైవ్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేయాలనుకుంటున్నారా.. !

రోల్స్ రాయిస్ కార్లను కొనటమే చాలా కష్టమవుతున్న కాలంలో కేరళకి చెంది బాబీ అనే వ్యక్తి తన రోల్స్ రాయిస్ కారును టాక్సీగా మార్చేశాడు. ఈ రోల్స్ రాయిస్ కారుని బాబీ అనేక మార్పులు చేసాడు.

గోల్డ్ కారు డ్రైవ్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేయాలనుకుంటున్నారా.. !

బాబీ మార్పులు చేసిన ఈ కారుని గమనించినట్లయితే దీనికి గోల్డెన్ వైపర్ అమర్చబడి ఉంది. కారు డోర్స్ పై ట్యాగ్‌లు అమర్చబడి ఉంటాయి. అంతే కాకుండా బాబీ అనే పేరు గల స్టిక్కర్స్ డోర్స్ కి అమర్చబడి ఉంటాయి. ఈ రోల్స్ రాయిస్ కారుని బాబీ గత సంవత్సరం కొనుగోలు చేశారు.

గోల్డ్ కారు డ్రైవ్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేయాలనుకుంటున్నారా.. !

ఈ కారు ఆక్సిజన్ రిసార్ట్‌లో ఉపయోగించడానికి కొనుగోలు చేసినట్లు మనకు తెలుస్తుంది. ఈ కారు ధర రూ. 12 కోట్లు. ఈ సంస్థ ఈ కారుకి బంగారు పూత వేయించింది. బంగారు పూత చేయించిన తరువాత ఈ కారు మరింత అందంగా తయారైంది.

గోల్డ్ కారు డ్రైవ్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేయాలనుకుంటున్నారా.. !

భారతదేశంలో బంగారు పూత ఉన్న వాహనాలు చాలా ఉన్నప్పటికీ బంగారు పూత వేయించిన మొదటి రోల్స్ రాయిస్ కారు ఇదే. ఈ గోల్డ్ కారు ఆక్సిజన్ రిసార్ట్ కి నిర్దిష్ట ప్యాకేజి కింద అద్దెకు ఇవ్వబడుతుంది. బంగారు పూత వేయించిన ఈ కార్ వల్ల పెద్దగా లాభాలు ఆశించలేరు. ఇది రిసార్ట్ కి వచ్చే వారికి ఆకర్షణీయంగా ఉంటుంది.

గోల్డ్ కారు డ్రైవ్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేయాలనుకుంటున్నారా.. !

రోల్స్ రాయిస్ ఫాంటమ్ 7 భారతదేశంలో మొట్టమొదటిసారిగా 2003 లో ప్రారంభించబడింది. రోల్స్ రాయిస్ 2017 లో భారతదేశంలో కొత్త తరం కారును విడుదల చేసింది. ఈ కొత్త కారు భారతదేశంలో అమ్ముడయ్యే అత్యంత ఖరీదైన కార్లలో ఒకటి.

గోల్డ్ కారు డ్రైవ్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేయాలనుకుంటున్నారా.. !

ఈ కారులో అనేక లగ్జరీ వస్తువులు ఉన్నాయి. ఈ కారు లగ్జరీ కొన్ని స్టార్ హోటళ్లలో కూడా ఇవ్వబడదు. అన్ని రోల్స్ రాయిస్ కార్లు టాప్-ఎండ్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి.

గోల్డ్ కారు డ్రైవ్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేయాలనుకుంటున్నారా.. !

ఫాంటమ్ 7 కారులో 6.75 లీటర్ నేచురల్ యాస్పిరేటెడ్ వి 12 ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 453 బిహెచ్‌పి పవర్ మరియు 720 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 6.1 సెకన్లలో గంటకు 0 - 100 కిమీ వేగవంతం చేస్తుంది. ఈ కారు యొక్క గరిష్ట వేగం గంటకు 240 కి.మీ. దూరం ప్రయాణించగల సామర్త్యాన్ని కలిగి ఉంటుంది.

గోల్డ్ కారు డ్రైవ్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేయాలనుకుంటున్నారా.. !

మీరు కూడా ఈ రోల్స్ రాయిస్ కారుని డ్రైవ్ చేయాలనుకుంటున్నారా.. అయితే 50,000 రూపాయలు ఖర్చు చేయగలిగితే ఈ కారుని నడిపే గోల్డెన్ ఛాన్స్ మీరు కొట్టేయొచ్చు..

Source: Wrapstyle/Instagram

Most Read Articles

English summary
Gold wrapped Rolls Royce Phantom VII as taxi. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X