Just In
- 17 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 1 day ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 1 day ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 1 day ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
మాజీ రాష్ట్రపతి కలాం సోదరుడు మహమ్మద్ ముత్తుమీర కన్నుమూత
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Movies
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కియా సోనెట్‌లో అందరూ మెచ్చుకునే టాప్ 8 ఫీచర్లు ఏంటో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న కియా మోటార్స్ ఇండియా నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ కియా సోనెట్‌ను సెప్టెంబర్ 18, 2020వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసినదే. డ్రైవ్‌స్పార్క్ బృందం ఇటీవలే ఈ కారును పూర్తిగా పరీక్షిచింది.

ఈ నేపథ్యంలో, కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో అందరూ మెచ్చుకునే టాప్ 8 ఫీచర్లు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

01. స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్
కరోనా మహమ్మారి నేపథ్యంలో, ఏసి ఉండే కార్లలో వైరస్ వ్యాప్తి సంక్రమణ ప్రమాదం ఎక్కువగా ఉన్నందున, కారులో స్వచ్ఛమైన గాలి, వాతావరణం ఉండేలా చూసుకోవటం ఎంతో అవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకొని, కియా సొనెట్ కారులో యాంటీవైరస్ టెక్నాలజీతో కూడిన కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ సిస్టమ్‌ను కంపెనీ అందిస్తోంది. దీనిని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. కారులో గాలి నాణ్యత గురించి సమాచారాన్ని ప్రదర్శించే ఎలక్ట్రానిక్ స్క్రీన్ కూడా ఇందులో ఉంటుంది.
MOST READ:65 బిహెచ్‌పి శక్తినిచ్చే దేశంలోని ఏకైక ట్విన్ సిలిండర్ లాంబ్రేటా స్కూటర్.. ఇదే

02. ప్రీమియం బోస్ సౌండ్ సిస్టమ్
సంగీతాన్ని ఇష్టపడే వారి కోసం కియా సోనెట్ కారులో ప్రీమియం బోస్ సౌండ్ సిస్టమ్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఇందులో 7 స్పీకర్లు మరియు సబ్ వూఫర్‌తో కూడిన మ్యూజిక్ సిస్టమ్ అధిక నాణ్యత గల సంగీతాన్ని అందిస్తుంది. ఈ ఫీచర్ ఖచ్చితంగా వినియోగదారులను ఆకర్షిస్తుంది.

03. పెద్ద టచ్‌స్క్రీన్
కియా సోనెట్ కారు ఇంటీరియర్స్‌లో ముఖ్యమైన ఫీచర్లలో 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. కియా సొనెట్ వంటి చిన్న కారులో ఇంత పెద్ద టచ్‌స్క్రీన్ ఆఫర్ చేయటం నిజంగా గొప్ప విషయం. ఇది కియా బ్రాండ్ యొక్క స్వంత కనెక్టింగ్ (యూవీవో) టెక్నాలజీతో పాటుగా ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో ప్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేస్తుంది.
MOST READ:హస్క్వర్నా నుంచి భారత్‌కు రానున్న స్వార్ట్పిలెన్, విట్పిలెన్ 401 బైక్స్

04. యూవీవో కనెక్టెడ్ కార్ టెక్నాలజీ
కియా సోనెట్ కారులోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో లైవ్ ఇంటర్నెట్ సదుపాయం ఉంది. ఇది యూవీఓ కనెక్టెడ్ టెక్నాలజీ ద్వారా సాధ్యమవుతుంది. యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లో యూవీవో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం ద్వారా కారులోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను రిమోట్‌గా కంట్రోల్ చేయటం సాధ్యమవుతుంది. ఇది వాయిస్ అసిస్టెడ్ ఫంక్షన్స్‌ను కూడా నిర్వహిస్తుంది.

05. ఐఎమ్‌టి గేర్‌బాక్స్
కియా సోనెట్ కారులో మరో ప్రత్యేకత, ఇందులో అందుబాటులో ఉన్న ఐఎమ్‌టి (ఇంటెలిజెంట్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) సిస్టమ్. ఈ టెక్నాలజీని ఇటీవలే హ్యుందాయ్ వెన్యూ కారులో తొలిసారిగా పరిచయం చేశారు. ఇందులో మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుంది, కానీ క్లచ్ పెడల్ మాత్రం ఉండదు. కారులో అమర్చిన యంత్రాల సాయంతో క్లచ్ పెడల్ ఆటోమేటిక్‌గా దానంటత అదే ఆపరేట్ అవుతుంది. అంటే, డ్రైవర్ కేవలం గేర్ మార్చితే సరిపోతుంది, మిగిలిన పని కారులోని కంప్యూటర్ చేస్తుందన్నమాట. ఈ కారు మ్యాన్యువల్ గేర్‌బాక్స్ పనితీరుని, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సౌకర్యాన్ని అందిస్తుంది.
MOST READ:రూ. 5 లక్షల లోపు ధర కలిగిన మారుతి సుజుకి టాప్ 5 కార్లు ఇవే.. చూసారా

06. డీజిల్ ఆటోమేటిక్
కియా సోనెట్ కారులో ఐఎమ్‌టి గేర్‌బాక్స్ కాకుండా, ఇందులోని డీజిల్ ఇంజన్లు రెగ్యులర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో కూడా లభిస్తాయి. సోనెట్ కారులోని 1.5 లీటర్ వేరియబుల్ జియోమెట్రీ టర్బో (విజిటి) ఇంజన్ సిక్స్-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇది 114 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

07. డ్రైవింగ్ మోడ్స్
కియా సోనెట్‌లో మొత్తం మూడు డ్రైవింగ్ మోడ్స్ (ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్) మరియు మూడు ట్రాక్షన్ కంట్రోల్స్ (స్నో, మడ్ మరియు శాండ్) ఉంటాయి. ఇందులో 4x4 సిస్టమ్ లేకపోయినప్పటికీ, వివిధ రోడ్ పరిస్థితులకు అనుగుణంగా పవర్, టార్క్‌లను డెలివరీ చేసేందుకు ఈ డ్రైవింగ్ మరియు ట్రాక్షన్ మోడ్స్ ఉపయోగపడుతాయి.
MOST READ:రవిశాస్త్రి కస్టమైజ్డ్ చేసిన 35 ఏళ్ల ఆడి కార్.. చూసారా ?

08. రియర్ ఏసి వెంట్స్
భారత్ వంటి అధిక ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతాల్లో కారులో ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ చాలా ప్రాముఖ్యమైనది. సాధారణంగా, మార్కెట్లో లభించే చిన్న కార్లలో వెనుక సీటులో కూర్చున్న ప్రయాణీకుల కోసం ప్రత్యేకమైన ఏసి సౌలభ్యం ఉండదు. కానీ కియా సోనెట్‌లో మాత్రం వెనుక సీటు ప్రయాణికుల కోసం కూడా ప్రత్యేక ఏసి వెంట్స్ ఉంటాయి. కాబట్టి, వెనుక వరుసలోని ప్రయాణీకులు కూడా మండు వేసవిలో చల్లగా ప్రయాణించవచ్చు.

కియా సోనెట్ కారులోని టాప్ 8 ఫీచర్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
కియా సోనెట్‌ని అత్యంత పోటీతో కూడుకున్న సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో విడుదల చేయనున్నారు. కస్టమర్లను మొదటి చూపులోనే ఆకర్షించే విధంగా ఈ కారును రూపొందించారు. ఇందులో డిజైన్ నుంచి ఫీచర్ల వరకూ అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. అంతేకాకుండా, వివిధ రకాల కస్టమర్లకు అభిరుచికి తగినట్లుగా ఇది వివిధ వేరియంట్లలో లభ్యం కానుంది.
భారత్‌లో కియా సోనెట్ ఈ విభాగంలో హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, టాటా నెక్సాన్, టొయోటా అర్బన్ క్రూయిజర్ మరియు నిస్సాన్ మాగ్నైట్ వంటి మోడళ్లకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది.