నేనే నెంబర్ వన్.. భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎమ్‌పివి

కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్రం ప్రకటించిన దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా అనేక ఆటోమొబైల్ కంపెనీ తీవ్ర నష్టాలను చవిచూశాయి. దాదాపు రెండు నెలల పాటు దుకాణాలు మూతడపటంతో అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే, గడచిన మే నెలలో కేంద్రం లాక్‌డౌన్ నుంచి కొన్ని మినహాయింపులు ఇవ్వటంతో కార్ షోరూమ్‌ల తలుపులు తెరచుకున్నాయి. అమ్మకాలు ప్రారంభమయ్యాయి.

నేనే నెంబర్ వన్.. భారత్‌లో అత్యధికంగా అమ్మడవుతున్న ఎమ్‌పివి

ఈ నేపథ్యంలో మారుతి సుజుకి అందిస్తున్న పాపులర్ ఎమ్‌పివి మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) గడచిన మే 2020లో సెగ్మెంట్లో కెల్లా గరిష్ట అమ్మకాలను నమోదు చేసుకొని మరోసారి సెగ్మెంట్ లీడర్‌గా అగ్రస్థానంలో నిలిచింది.

ఓవైపు లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ ఈ మోడల్ అమ్మకాలు మాత్రం తగ్గలేదు. గడచిన మే 2020 నెలలో మారుతి సుజుకి ఇండియా మొత్తం 2,353 ఎర్టిగా వాహనాలను విక్రయించింది. ఈ సెగ్మెంట్లో అందుబాటులో ఉన్న ఇతర మోడళ్లతో పోల్చుకుంటే ఈ సంఖ్యే అధికం.

నేనే నెంబర్ వన్.. భారత్‌లో అత్యధికంగా అమ్మడవుతున్న ఎమ్‌పివి

అయితే, గతేడాది సరిగ్గా ఇదే సమయం (మే 2019)తో పోల్చుకుంటే అమ్మకాలు మాత్రం ఏకంగా 73 శాతం క్షీణించాయి. మే 2019లో మారుతి సుజుకి మొత్తం 9,000 ఎర్టిగా ఎమ్‌పివిలను విక్రయించింది.

మే 2020 అమ్మకాల రేసులో మారుతి ఎర్టిగా తర్వాతి స్థానంలో మరో దేశీయ కంపెనీ మహీంద్రా అందిస్తున్న బొలెరో (Bolero) నిలిచింది. ఈ సమయంలో మొత్తం 1,715 యూనిట్ల మహీంద్రా బొలెరో వాహనాలు అమ్ముడుపోయాయి. కాకపోతే, గడచిన మే 2019తో పోలిస్తే ఈ మోడల్ అమ్మకాలు 71 శాతం క్షీణించాయి. ఆ సమయంలో మొత్తం 5,947 బొలెరోలు అమ్ముడయ్యాయి.

నేనే నెంబర్ వన్.. భారత్‌లో అత్యధికంగా అమ్మడవుతున్న ఎమ్‌పివి

ఇక తృతీయ స్థానంలో ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో అందిస్తున్న ట్రైబర్ (Triber) ఎమ్‌పివి నిలిచింది. మే 2020లో మొత్తం 931 యూనిట్లు అమ్ముడయ్యాయి. భారత మార్కెట్లో ఇటీవలే విడుదలైన ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ రెనో ట్రైబర్ ఎమ్‌పివి అతి తక్కువ సమయంలోనే అశేష ఆదరణ పొందింది. సరసమైన ధరకే ఇది అందుబాటులో ఉంటుంది.

నేనే నెంబర్ వన్.. భారత్‌లో అత్యధికంగా అమ్మడవుతున్న ఎమ్‌పివి

గడచిన మే నెలలో టొయోటా ఇన్నోవా క్రిస్టా కూడా మంచి అమ్మకాలనే నమోదు చేసుకుంది. ఈ సమయంలో మొత్తం 759 యూనిట్ల ఇన్నోవాలు అమ్ముడుపోగా గడచిన సంవత్సరం మే 2019తో పోల్చుకుంటే ఈ మోడల్ అమ్మకాలు 87 శాతం క్షీణించాయి. కరోనా లేని ఆ సమయంలో మొత్తం 5,631 కార్లు అమ్ముడుపోయాయి. టొయోటా ఇటీవలే తమ బిఎస్6 వెర్షన్ ఇన్నోవా క్రిస్టా ధరలను రూ.61,000 మేర పెంచిన సంగతి తెలిసినదే.

MOST READ: 2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ; త్వరలో భారత్‌లో విడుదల!

నేనే నెంబర్ వన్.. భారత్‌లో అత్యధికంగా అమ్మడవుతున్న ఎమ్‌పివి

మారుతి సుజుకి అందిస్తున్న మరో ప్రీమియం ఎమ్‌పివి, నెక్సా సిరీస్‌కి చెందిన ఎక్స్ఎల్6 కూడా లాక్‌డౌన్ సమయంలో ప్రోత్సాహకర అమ్మకాలనే నమోదు చేసింది. మే 2020లో మొత్తం 711 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 వాహనాలు అమ్ముడుపోయాయి. దేశవ్యాప్తంగా ఉన్న నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా మాత్రమే ఎక్స్ఎల్6 అందుబాటులో ఉంటుంది.

Rank Model May'20 May'19 Growth (%)
1 Maruti Ertiga 2,353 8,864 -73
2 Mahindra Bolero 1,715 5,947 -71
3 Renault Triber 931 0 -
4 Toyota Innova Crysta 759 5,631 -87
5 Maruti XL6 711 0 -
6 Datsun Go Plus 62 242 -74
7 Kia Carnival 50 0 -
8 Toyota Vellfire 32 0 -
9 Mahindra Marazzo 0 1,381 -100
10 Mahindra Xylo 0 312 -100
11 Tata Hexa 0 301 -100
12 Honda BR-V 0 255 -100
13 Renault Lodgy 0 49 -100

Source: Autopunditz.com

నేనే నెంబర్ వన్.. భారత్‌లో అత్యధికంగా అమ్మడవుతున్న ఎమ్‌పివి

గడచిన మే నెలలో రెనో అందిస్తున్న మరో ఎమ్‌పివి డాట్సన్ గో ప్లస్ కేవలం 62 యూనిట్లు మాత్రమే అమ్మడై ఈ రేసులో 6వ స్థానంలో నిలిచింది. గతేడాది మే 2019తో పోల్చుకుంటే ఈ మోడల్ అమ్మకాలు ఏకంగా 74 శాతం క్షీణించాయి. ఆ సమయంలో మొత్తం 242 డాట్సన్ గో ప్లస్ వాహనాలను రెనో విక్రయించింది.

MOST READ: పెరిగిన టొయోటా ఇన్నోవా క్రిస్టా బిఎస్6 ధరలు

నేనే నెంబర్ వన్.. భారత్‌లో అత్యధికంగా అమ్మడవుతున్న ఎమ్‌పివి

ఎమ్‌పివి సెగ్మెంట్లో కొత్తగా ప్రవేశించిన కొరియన్ బ్రాండ్ కియా అందిస్తున్న కార్నివాల్ ఎమ్‌పివి 50 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసుకోగా మరో కొత్త మోడల్ అయిన టొయోటా వెల్‌ఫైర్ 32 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసుకొని వరుసగా 7 మరియు 8వ స్థానాల్లో నిలిచాయి.

నేనే నెంబర్ వన్.. భారత్‌లో అత్యధికంగా అమ్మడవుతున్న ఎమ్‌పివి

ఇక ఈ జాబితాలో చివరగా మహీంద్రా మరాజో మరియు మహీంద్రా జైలో వాహనాలను మహీంద్రా అండ్ మహీంద్రా గడచిన మే 2020లో ఒక్క యూనిట్‌ను విక్రయించలేకపోయింది. అయితే, మే 2019లో మాత్రం 1,381 యూనిట్ల మహీంద్రా మరాజో కార్లు మరియు 312 యూనిట్ల మహీంద్రా జైలో కార్లు అమ్ముడుపోయాయి.

MOST READ: మహీంద్రా ఎక్స్‌యూవీ300 కార్ రివ్యూ

నేనే నెంబర్ వన్.. భారత్‌లో అత్యధికంగా అమ్మడవుతున్న ఎమ్‌పివి

మే 2020లో ఎమ్‌పివిల అమ్మకాలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కరోనా వైరస్ నేపథ్యంలో దాదాపు రెండు నెలలుగా ఎలాంటి కార్ల విక్రయాలు జరగలేదు. అయితే, మే నెలలో లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత ప్రజలు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా రవాణా కన్నా ప్రైవేట్ రవాణాకే ప్రధాన్యత ఇస్తుండటంతో రానున్న రోజుల్లో కార్ల అమ్మకాలు మరింత పెరవచ్చని అంచనా. భారత్‌లో ప్రత్యేకించి ఎక్కువ మంది ప్రయాణించేందుకు వీలుగా ఉండే ఎమ్‌పివి వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. మరికొద్ది నెలల్లో ఈ సెగ్మెంట్లో అమ్మకాలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Most Read Articles

English summary
Amidst the restart of vehicle sales in India, the Maruti Suzuki Ertiga has emerged as the best-selling MPV in the Indian market in the previous month. The Maruti Ertiga registered a sales of 2,353 units in May 2020, amidst the restart of operations of company dealerships across the country. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X