Just In
- 17 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 1 day ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 1 day ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 1 day ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
మార్చి 8 నుంచి రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Movies
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వెబ్‌సైట్ నుండి మాయమైన ఇన్నోవా టూరింగ్ స్పోర్ట్; డిస్‌కంటిన్యూ అయిందా?
టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ ఇండియా, భారత మార్కెట్లో ఇప్పటి వరకూ విక్రయిస్తూ వచ్చిన తమ ఇన్నోవా టూరింగ్ స్పోర్ట్ మోడల్‌ను అధికారిక వెబ్‌సైట్ నుండి తొలగించింది. ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్‌ను కంపెనీ నిలిపివేసి ఉండవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. స్టాండర్డ్ ఇన్నోవా మోడల్‌తో పోల్చుకుంటే, ఇన్నోవా టూరింగ్ స్పోర్ట్ మోడల్‌లో అనేక కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి.

టొయోటా తమ అధికారి వెబ్‌సైట్ నుండి ఇన్నోవా టూరింగ్ స్పోర్ట్ మోడల్‌ను తొలగించడాన్ని చూస్తుంటే, భారత మార్కెట్లో కంపెనీ ఈ ఉత్పత్తిని డిస్‌కంటిన్యూ చేసి ఉండొచ్చని తెలుస్తోంది. అయితే, ఈ విషయాన్ని టొయోటా ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. వచ్చే ఏడాది సరికొత్త టొయోటా ఇన్నోవా ఫేస్‌లిఫ్ట్ మార్కెట్లో విడుదల కానున్న నేపథ్యంలో, ఈ టూరింగ్ స్పోర్ట్ మోడల్‌ను నిలిపివేసి ఉండొచ్చని తెలుస్తోంది.

టొయోటా ఇన్నోవా టూరింగ్ స్పోర్ట్ మోడల్‌లో స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే మరింత అగ్రెసివ్ మరియు స్పోర్టీగా కనిపించే బాడీ డిజైన్, కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ ఉంటాయి. స్టాండర్డ్ మోడల్‌లో క్రోమ్ ఫినిషింగ్‌లో కనిపించే అనేక ట్రిమ్‌లు టూరింగ్ స్పోర్ట్ ఎమ్‌పివిలో బ్లాక్-అవుట్ చేయబడి కనిపిస్తాయి.
MOST READ:ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ నుంచి మరో పోస్ట్.. అదేంటో చూసారా ?

ముందు భాగంలోని మార్పులలో స్మోక్డ్ హెడ్‌ల్యాంప్‌లతో పాటు బ్లాక్-అవుట్ గ్రిల్ ఉంటుంది. ఇందులో ఎమ్‌పివి చుట్టూ బ్లాక్-అవుట్ ఆల్ రౌండ్ బాడీ క్లాడింగ్ కూడా ఉంటుంది. వెనుక భాగంలో మందపాటి నల్లని స్ట్రిప్ ఉంటుంది, ఇది స్కఫ్ ప్లేట్లతో పాటుగా ఇరువైపులా టెయిల్ ల్యాంప్స్‌కు అనుసంధానించబడి ఉంటుంది.

ఇన్నోవా టూరింగ్ స్పోర్ట్ సైడ్ డిజైన్‌లో బ్లాక్-అవుట్ అల్లాయ్ వీల్స్‌తో పాటు బ్లాక్డ్ అవుట్ సైడ్ మిర్రర్స్ మరియు సైడ్ స్కర్ట్‌లు ఉంటాయి. టూరింగ్ స్పోర్ట్ మోడల్ యొక్క విండో-లైన్ బ్లాక్ చేయబడి ఉంటుంది, ఇది ఎమ్‌పివికి మరింత అగ్రెసివ్ రూపాన్ని జోడిస్తుంది. ఈ మోడల్ వైల్డ్‌ఫైర్ రెడ్ మరియు పెరల్ వైట్ అనే రెండు రంగులలో లభించేది.
MOST READ:త్వరపడండి.. దీపావళి సందర్భంగా బెనెల్లి ఇంపీరియల్ 400 బైక్‌పై భారీ ఆఫర్స్

టూరింగ్ స్పోర్ట్ క్యాబిన్ లేఅవుట్ స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే అనిపిస్తుంది. అయితే, ఇందులో స్పోర్టీ లుక్ కోసం ఆల్-బ్లాక్ ఇంటీరియర్స్ థీమ్‌ను కలిగి ఉంటుంది. ఇందులో సీట్ అప్‌హోలెస్ట్రీ, ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ వంటి అంశాలు బ్లాక్ థీమ్‌లో ఉంటాయి. అలాగే డాష్‌పై ఉన్న ఫాక్స్ ఉడ్ ట్రిమ్‌లను ఇందులో బుర్గండి-రెడ్ కలర్‌లోకి మార్చారు. అంతేకాకుండా, స్టీరింగ్ పైభాగంలో ఉన్న ఉడ్‌ను కూడా బ్లాక్ కలర్‌లో ఫినిష్ చేశారు.

ఇన్నోవా టూరింగ్ స్పోర్ట్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇది స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే రెండు ఇంజన్ ఆప్షన్లతో లభించేంది. ఇందులోని 2.7-లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 164 బిహెచ్‌పి పవర్‌ను మరియు 245 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, 2.4-లీటర్ డీజిల్ ఇంజన్ 148 బిహెచ్‌పి పవర్‌ను మరియు 360 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్‌తో జతచేయబడి ఉంటుంది.
MOST READ:నవంబర్ 7 న 6 నగరాల్లో లాంచ్ కానున్న ఏథర్ 450 ఎక్స్ ; ఆ నగరాలు ఇవే

మార్కెట్లో టొయోటా ఇన్నోవా క్రిస్టా ప్రారంభ ధర రూ.19.53 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఇండియా)గా ఉండగా, ఇందులో టూరింగ్ స్పోర్ట్ మోడల్ ధర దాని స్టాండర్డ్ మోడల్ ధర కంటే రూ.53,000 అధికంగా ఉండేది. ఇందులో టాప్-ఎండ్ డీజిల్ జెడ్‌ఎక్స్ ఏటి మోడల్ ధర రూ.24.67 లక్షలు, ఎక్స్‌షోరూమ్ (ఇండియా)గా ఉంది.

టొయోటా ఇన్నోవా టూరింగ్ స్పోర్ట్ మోడల్‌ను డిస్‌కంటిన్యూ చేయటంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
భారత మార్కెట్లో మరింత స్పోర్టీ అనుభూతినిచ్చే ఇన్నోవా కోసం చూస్తున్న కస్టమర్లను టార్గెట్‌గా చేసుకొని టొయోటా తమ ఇన్నోవా టూరింగ్ స్పోర్ట్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం, ఈ మోడల్ మార్కెట్ నుండి తొలగిపోయింది. అయితే, భవిష్యత్తులో ఇంత కన్నా మరింత ప్రీమియం లుక్ అండ్ స్పోర్టీ ఫీల్‌తో కొత్త స్పెషల్ ఎడిషన్ ఇన్నోవాను టొయోటా పరిచయం చేసే అవకాశం ఉంది.
MOST READ:రూ. 30 వేల విలువైన స్కూటర్‌కి రూ. 42 వేలు ఫైన్.. చివరికి ఏమైందంటే ?