Just In
- 54 min ago
3 కి.మీ ట్రక్కుని రివర్స్ గేర్‌లో నడిపిన డ్రైవర్.. ఎందుకనుకుంటున్నారా, అయితే ఇది చూడండి
- 1 hr ago
దేశంలోనే అతిపెద్ద మల్టీ-బ్రాండ్ కార్ సర్వీస్ సెంటర్‌ను ఓపెన్ చేసిన బాష్
- 2 hrs ago
టీవీఎస్ ఎక్స్ఎల్ 100 విన్నర్ ఎడిషన్ లాంచ్ : ధర & వివరాలు
- 16 hrs ago
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
Don't Miss
- News
నాన్సీ ల్యాప్‌టాప్ చోరీ? రష్యా ఇంటలిజెన్స్‌కు చేరవేసే ప్లాన్.. ఎఫ్‌బీఐ అఫిడవిట్లో సంచలనాలు..
- Sports
వికెట్ కీపర్‌గా పంత్ అరుదైన రికార్డు.. ధోనీ కన్నా వేగంగా!!
- Finance
Gold prices today : స్థిరంగా బంగారం ధరలు, వెండి ధరలు జంప్
- Lifestyle
మీరు ఎప్పుడూ ఎందుకు అలసిపోతున్నారు?అందుకు సాధారణ కారణాలు ఇక్కడ ఉన్నాయి..
- Movies
Master box office: 6వ రోజు కూడా పవర్‌ఫుల్ కలెక్షన్స్.. విజయ్ మరో బిగ్గెస్ట్ రికార్డ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కొత్త టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ విడుదల తేదీ ఖరారు - వివరాలు
టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ కొత్త సంవత్సరాన్ని సరికొత్తగా ప్రారంభించాలని చూస్తోంది. టొయోటా నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను కంపెనీ జనవరి 6, 2021వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఫార్చ్యూనర్ స్థానాన్ని ఇది రీప్లేస్ చేయనుంది.

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టొయోటా ఫార్చ్యూనర్‌ని చివరిగా 2016లో అప్‌డేట్ చేశారు. కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్‌తో పాటుగా కంపెనీ ఇందులో ‘లెజెండర్' అనే ఓ స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. దీనిని స్టాండర్డ్ వేరియంట్‌లకు ఎగువన ప్రీమియం వేరియంట్‌గా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

స్టాండర్ ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌తో పోల్చుకుంటే ఈ స్పెషల్ ఎడిషన్ ఫార్చ్యూనర్ లెజెండర్ వేరియంట్‌లో అనేక కాస్మెటిక్ మార్పులు ఉండనున్నాయి. ఇందులో అనేక ట్రిమ్స్‌ను ప్రీమియం బ్లాక్ కలర్‌లో ఫినిష్ చేశారు. ఈ ఎస్‌యూవీ కోసం టివిసి షూట్ చేస్తుండగా ఇటీవలే కెమెరాకు చిక్కింది - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.
MOST READ:అద్భుతంగా ఉన్న మలయాళీ స్టార్ మమ్ముట్టి లగ్జరీ కారవాన్.. చూసారా !

ఇక టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ విషయానికి వస్తే, ఇది ఇప్పటికే వివిధ అంతర్జాతీయ మార్కెట్లలో ఆవిష్కరించబడిన మోడల్ ఆధారంగానే ఉంటుందని సమాచారం. ఈ కొత్త మోడల్‌లోని ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లను పూర్తిగా రీడిజైన్ చేశారు.

ఇందులో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్, ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లతో కూడిన హెడ్‌ల్యాంప్‌లు, రీడిజైన్ చేయబడిన బ్లాక్-అవుట్ ఫ్రంట్ గ్రిల్ మరియు సెంట్రల్ ఎయిర్ ఇన్‌టేక్, అలాగే ముందు భాగంలో క్రింది వైపు కొత్త ఫాక్స్ స్కిడ్ ప్లేట్ వంటి మార్పులు ఉన్నాయి. అంతేకాకుండా, కొత్త ఎల్ఈడి టెయిల్ లైట్లు, రీడిజైన్ చేసిన బూట్ లిడ్, కొత్త వెనుక బంపర్ డిజైన్ మరియు 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి మార్పులు కూడా ఇందులో ఉన్నాయి.

ఇంటీరియర్స్‌లోని మార్పులను గమనిస్తే, ఇందులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే కొత్త 8.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అప్‌గ్రేడ్ చేయబడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎనిమిది రకాలుగా సర్దుబాటు చేయగల ఫ్రంట్ సీట్స్, తొమ్మిది-స్పీకర్లతో కూడిన జెబిఎల్ ఆడియో సిస్టమ్ వంటి మార్పులు ఉండే అవకాశం ఉంది.

కొత్త టొయోటా ఫార్చ్యూనర్‌లో సరికొత్త ఫీచర్లు మరియు డిజైన్ మార్పులు మినహా, పాత తరం ఫార్చ్యూనర్‌లో కనిపించిన అనేక రకాల ఇతర ఫీచర్లు మరియు పరికరాలు యధావిధిగా కొత్త మోడల్‌ను కొనసాగించనున్నారు. సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో మల్టిపుల్ ఎయిర్‌బ్యాగులు, ఈబిడితో కూడిన ఎబిఎస్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ మొదలైనవి ఉన్నాయి.
MOST READ:కేవలం 4 గంటల సమయంలో భారీగా పట్టుబడ్డ దొంగ వాహనాలు..ఇంకా ఎన్నో..మీరే చూడండి

కొత్త 2021 ఫార్చ్యూనర్ ఇంజన్ విషయంపై ఇంకా స్పష్టత లేదు. అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసిన కొత్త ఫార్చ్యూనర్ 2.8-లీటర్ డీజిల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఈ పవర్‌ఫుల్ ఇంజన్‌ను ఎక్కువ పవర్, టార్క్‌లను ఉత్పత్తి చేసేలా అప్‌గ్రేడ్ చేశారు. ఈ ఇంజన్ గరిష్టంగా 204 బిహెచ్‌పి పవర్‌ను మరియు 500 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఇండియన్ స్పెక్ ఫార్చ్యూనర్‌లోని ఇదే ఇంజన్ 175 బిహెచ్‌పి మరియు 420 ఎన్ఎమ్ టార్క్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. మరి ఈ పవర్‌ఫుల్ ఇంజన్‌ను కంపెనీ భారత్‌లో ప్రవేశపెడుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఇంజన్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.
MOST READ:సినిమా స్టైల్లో బస్సును కొండపై యు-టర్న్ చేసిన డ్రైవర్ [వీడియో]

డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో పాటుగా ప్రస్తుత మోడల్‌లో ఆఫర్ చేస్తున్న 2.7 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో కూడా కొత్త ఫార్చ్యూనర్‌లో కొనసాగించవచ్చని సమాచారం. ఈ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 165 బిహెచ్‌పి పవర్‌ను మరియు 245 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఫైవ్-స్పీడ్ మాన్యువల్ లేదా ఆప్షనల్ సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్‌తో లభిస్తుంది.

కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ దాని మునుపటి తరం మోడల్ కంటే మెరుగైన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఫలితంగా దాని ధరలో కూడా స్వల్ప పెరుగుదల ఉండొచ్చని అంచనా. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని రూ.28.66 లక్షల నుండి రూ.34.43 లక్షల మధ్యలో విక్రయిస్తున్నారు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

టొయోటా బ్రాండ్‌కు ఫార్చ్యూనర్ ఈ విభాగంలో ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీగా ఉంది. ఇది భారత మార్కెట్లోని ఈ విభాగంలో ఎమ్‌జి గ్లోస్టర్, ఫోర్డ్ ఎండీవర్ స్పోర్ట్, మహీంద్రా ఆల్ట్యూరాస్ జి4 మరియు స్కొడా కొడియాక్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.