త్వరలోనే టొయోటా అర్బన్ క్రూయిజర్ డెలివరీలు; మొదటి బ్యాట్ డిశ్పాచ్ షురూ!

టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎమ్) ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన కాంపాక్ట్ ఎస్‌యూవీ "అర్బన్ క్రూయిజర్"కి సంబంధించిన మొదటి బ్యాచ్ ఎస్‌యూవీలను కంపెనీ ఫ్యాక్టరీ నుండి బయటకు పంపింది. దీన్నిబట్టి చూస్తుంటే, అతి త్వరలోనే టొయోటా అర్బన్ క్రూయిజర్ డెలివరీలు దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

త్వరలోనే టొయోటా అర్బన్ క్రూయిజర్ డెలివరీలు; మొదటి బ్యాట్ డిశ్పాచ్ షురూ!

గడచిన ఆగస్టు 2020 నెలలో ఈ మోడల్ కోసం అధికారికంగా బుకింగ్‌లను ప్రారంభించినప్పటి నుండి, అర్బన్ క్రూయిజర్ కాంపాక్ట్ ఎస్‌యూవీకి దేశవ్యాప్తంగా వినియోగదారుల నుండి మంచి ప్రోత్సాహకరమైన స్పందన లభించినట్లు కంపెనీ పేర్కొంది.

త్వరలోనే టొయోటా అర్బన్ క్రూయిజర్ డెలివరీలు; మొదటి బ్యాట్ డిశ్పాచ్ షురూ!

టొయోటా తమ అర్బన్ క్రూయిజర్ మోడల్‌ను మొత్తం మూడు వేరియంట్లలో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో విడుదల చేసింది. మార్కెట్లో ఈ మోడల్ ప్రారంభ ధర రూ.8.40 లక్షలుగా ఉండగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.11.30 లక్షలుగా ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ, ఇండియా).

MOST READ:మీకు తెలుసా.. ఈ బస్సులకు పెట్రోల్, డీజిల్ అవసరం లేదు

త్వరలోనే టొయోటా అర్బన్ క్రూయిజర్ డెలివరీలు; మొదటి బ్యాట్ డిశ్పాచ్ షురూ!

టొయోటా అర్బన్ క్రూయిజర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని మోనో-టోన్ మరియు డ్యూయెల్-టోన్ అనే పెయింట్ స్కీమ్‌లలో లభిస్తోంది. అర్బన్ క్రూయిజర్‌ను కంపెనీ 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్ల (ఏది ముందుగా ముగిస్తే అది) వారంటీతో అందిస్తోంది.

త్వరలోనే టొయోటా అర్బన్ క్రూయిజర్ డెలివరీలు; మొదటి బ్యాట్ డిశ్పాచ్ షురూ!

మారుతి సుజుకి - టొయోటా కిర్లోస్కర్ భాగస్వామ్యం నుండి వస్తున్న రెండవ ఉత్పత్తి ఈ అర్బన్ క్రూయిజర్. మారుతి సుజుకి విటారా బ్రెజ్జాకు రీబ్యాడ్జ్ చేయబడిన మోడలే ఈ టొయోటా అర్బన్ క్రూయిజర్. ఈ రెండు మోడళ్లలో చాలా వరకు పరికరాలు, ఫీచర్లు ఒకేలా ఉంటాయి. కాకపోతే, అర్బన్ క్రూయిజర్‌లో చేసిన ప్రధాన మార్పులలో ఎల్‌ఈడి లైటింగ్ ప్యాకేజీ గురించి చెప్పుకోవచ్చు. ఇందులో హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ ల్యాంప్స్ మరియు ఫాగ్ లైట్లను అన్నింటినీ ఎల్ఈడిలతో అందిస్తున్నారు.

MOST READ:భారత మార్కెట్లో మారుతి సుజుకి సెలెరియో లాంచ్ డీటైల్స్

త్వరలోనే టొయోటా అర్బన్ క్రూయిజర్ డెలివరీలు; మొదటి బ్యాట్ డిశ్పాచ్ షురూ!

టొయోటా అర్బన్ క్రూయిజర్‌లోని ఇంటీరియర్స్ కూడా విటారా బ్రెజ్జాలోని ఇంటీరియర్స్ మాదిరిగానే అదే లేఅవుట్‌ను మరియు ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ జాబితాలో పుష్-బటన్ ఇంజన్ స్టార్ట్ / స్టాప్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు రెయిన్ సెన్సింగ్ వైపర్స్ మొదలైనవి ఉన్నాయి.

త్వరలోనే టొయోటా అర్బన్ క్రూయిజర్ డెలివరీలు; మొదటి బ్యాట్ డిశ్పాచ్ షురూ!

ఇంకా ఇందులో క్రూయిజ్ కంట్రోల్‌తో పాటుగా ఎలక్ట్రోక్రోమిక్ రియర్‌వ్యూ మిర్రర్ మరియు కప్ హోల్డర్‌లతో కూడిన రియర్ సీట్ ఆర్మ్‌రెస్ట్ కూడా ఉన్నాయి. మారుతి యొక్క ‘స్మార్ట్‌ప్లే స్టూడియో' ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను టొయోటా తమ 'స్మార్ట్ ప్లేకాస్ట్'గా రీబ్రాండ్ చేసింది. ఇందులో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది.

MOST READ:ప్రైవేట్ బస్సుకు రూ. 5 లక్షలకుపైగా జరిమానా విధించిన గవర్నమెంట్.. కారణం ఏంటో తెలుసా ?

త్వరలోనే టొయోటా అర్బన్ క్రూయిజర్ డెలివరీలు; మొదటి బ్యాట్ డిశ్పాచ్ షురూ!

టొయోటా అర్బన్ క్రూయిజర్‌లోని కొన్ని ఇతర భద్రతా ఫీచర్లను గమనిస్తే, ఇందులో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఈబిడితో కూడిన ఏబిఎస్, హిల్ హోల్డ్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా విత్ ఆడియో, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ మొదలైనవి ఉన్నాయి.

త్వరలోనే టొయోటా అర్బన్ క్రూయిజర్ డెలివరీలు; మొదటి బ్యాట్ డిశ్పాచ్ షురూ!

ఇంజన్ విషయానికి వస్తే, విటారా బ్రెజ్జా మరియు అర్బన్ క్రూయిజర్‌లో ఒకే రకమైన ఇంజన్ ఉంటుంది. ఇందులో సుజుకి మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్‌ (ఎస్‌విహెచ్ఎస్)తో కూడిన 1.5-లీటర్ కె-సిరీస్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 104 బిహెచ్‌పి పవర్‌ను మరియు 138 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

MOST READ:కొత్త కలర్స్‌లో లాంచ్ అయిన బజాజ్ పల్సర్ NS & RS బైక్స్ ; ఇప్పుడు వీటి రేటెంతో తెలుసా ?

త్వరలోనే టొయోటా అర్బన్ క్రూయిజర్ డెలివరీలు; మొదటి బ్యాట్ డిశ్పాచ్ షురూ!

అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీ మొదటి బ్యాచ్‌ను డిశ్పాచ్ చేసిన సందర్భంగా టికెఎమ్ సేల్స్ అండ్ సర్వీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ సోని మాట్లాడుతూ, "పండుగ సీజన్ ప్రారంభానికి ముందే టికెఎమ్ అర్బన్ క్రూయిజర్ యొక్క మొదటి బ్యాచ్‌ను పంపినట్లు ప్రకటించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. అర్బన్ క్రూయిజర్ పట్ల మా కస్టమర్ల నుండి లభించిన అనూహ్య స్పందన, వారు మాపై ఉంచిన నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తుంది. కస్టమర్ ఫస్ట్ విధానం మరియు కస్టమర్ల ఆకాంక్షలను నెరవేర్చడానికి అంకితభావంతో, మేము కొత్త ఉత్పత్తులను సకాలంలో పరిచయం చేయడంపై దృష్టి పెడతాము. ఈ దశంలో అభివృద్ధి చెందుతున్న కస్టమర్ అవసరాలను తీర్చడానికి చేసిన మరో ప్రయత్నమే ఈ టొయోటా అర్బన్ క్రూయిజర్" అని అన్నారు.

త్వరలోనే టొయోటా అర్బన్ క్రూయిజర్ డెలివరీలు; మొదటి బ్యాట్ డిశ్పాచ్ షురూ!

టొయోటా అర్బన్ క్రూయిజర్ మొదటి బ్యాచ్ డెలివరీలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కస్టమర్లకు టొయోటా అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీలను అందించడం ద్వారా వారి పండుగ ఆనందాన్ని రెట్టింపు చేయాలని టొయోటా భావిస్తోంది. అర్బన్ క్రూయిజర్ ప్రస్తుతం టొయోటా బ్రాండ్ నుండి భారత మార్కెట్లో లభిస్తున్న అత్యంత చౌకైన ఎస్‌యూవీగా ఉంది.

Most Read Articles

English summary
Toyota Kirloskar Motor (TKM) has dispatched its recently launched compact SUV, the Urban Cruiser. With the first batch of SUVs dispatched in the country, deliveries of the Toyota Urban Cruiser is expected to begin soon across the country. Read in Telugu.
Story first published: Saturday, October 17, 2020, 18:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X