భారత్‌కు మరో కొత్త టొయోటా కారు - ఈసారి అర్బన్ క్రూజర్; టీజర్ లాంచ్

జపాన్‌కు చెందిన టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ ఇండియా (టికెఎమ్) భారత మార్కెట్ కోసం ఓ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని సిద్ధం చేస్తోంది. ఈ మేరకు 'అర్బన్ క్రూయిజర్' పేరిట కంపెనీ ఓ కొత్త ఎస్‌యూవీ టీజర్‌ను విడుదల చేసింది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం టొయోటా నుంచి విడుదలైన మొదటి అధికారిక టీజర్ ఇది.

భారత్‌కు మరో కొత్త టొయోటా కారు - ఈసారి అర్బన్ క్రూజర్; టీజర్ లాంచ్

టొయోటా నుంచి రానున్న సరికొత్త అర్బన్ క్రూయిజర్, కంపెనీ యొక్క మొట్టమొదటి సబ్-4 మీటర్ కాంపాక్ట్-ఎస్‌యూవీగా ఉంటుంది. అతి త్వరలోనే ఇది భారత మార్కెట్లో విక్రయానికి అందుబాటులోకి వస్తుందని అంచనా.

భారత్‌కు మరో కొత్త టొయోటా కారు - ఈసారి అర్బన్ క్రూజర్; టీజర్ లాంచ్

టొయోటా తమ కొత్త ఎస్‌యూవీని ‘అర్బన్ క్రూయిజర్’ అనే నేమ్‌ప్లేట్‌తో విడుదల చేస్తామని ధృవీకరించింది మరియు ఇది భారత మార్కెట్ కోసం కంపెనీ యొక్క మొట్టమొదటి కాంపాక్ట్-ఎస్‌యూవీగా ఉంటుందని తెలిపింది. కొత్త టొయోటా అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీ ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

భారత్‌కు మరో కొత్త టొయోటా కారు - ఈసారి అర్బన్ క్రూజర్; టీజర్ లాంచ్

గమనిక: ఇక్కడ ఉపయోగించిన చిత్రాలు ప్రాతినిధ్య ప్రయోజనాల కోసం మాత్రమే.

భారత్‌కు మరో కొత్త టొయోటా కారు - ఈసారి అర్బన్ క్రూజర్; టీజర్ లాంచ్

ఈ జపనీస్ బ్రాండ్ అందిస్తున్న ఐకానిక్ ‘ల్యాండ్ క్రూయిజర్’ పేరు నుండి ప్రేరణ పొంది, ఈ కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీకి టొయోటా అర్బన్ క్రూయిజర్ అనే నేమ్‌ప్లేట్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గ్లాంజా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను (మారుతి బాలెనోకి టొయోటాకి వెర్షన్) అనుసరించి టొయోటా-సుజుకి భాగస్వామ్యంలో భాగంగా రానున్న రెండవ ఉత్పత్తే కాంపాక్ట్-ఎస్‌యూవీ అని సమాచారం.

భారత్‌కు మరో కొత్త టొయోటా కారు - ఈసారి అర్బన్ క్రూజర్; టీజర్ లాంచ్

అంటే ఈ అర్బన్ క్రూయిజర్‌ను కూడా బాలెనో-గ్లాంజా మాదిరిగానే, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడటానికి బాలెనో, గ్లాంజా మోడళ్లు ఎలా ఐడెంటికల్‌గా ఉంటాయో, బ్రెజ్జా మరియు టొయోటా అర్బన్ క్రూయిజర్‌లు కూడా అలానే ఉండే అవకాశం ఉంది.

భారత్‌కు మరో కొత్త టొయోటా కారు - ఈసారి అర్బన్ క్రూజర్; టీజర్ లాంచ్

అయితే, టొయోటా గ్లాంజా మాదిరిగా కాకుండా, ఈ అర్బన్ క్రూయిజర్ భారత మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే, దాని డిజైన్‌లో కొన్ని కీలకమైన మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. టొయోటా కూడా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవచ్చనేది నిపుణల అభిప్రాయం.

భారత్‌కు మరో కొత్త టొయోటా కారు - ఈసారి అర్బన్ క్రూజర్; టీజర్ లాంచ్

అర్బన్ క్రూయిజర్ టీజర్‌ను ఆవిష్కరించిన సందర్భంగా టికెఎమ్ సేల్స్ అండ్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ సోని మాట్లాడుతూ, "ఈ పండుగ సీజన్‌లో టొయోటా అర్బన్ క్రూయిజర్‌ను విడుదల చేయాలనే మా ప్రణాళికలను ప్రకటించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. కస్టమర్-ఫస్ట్ విధానంలో భాగంగా, టికెఎమ్ ఎల్లప్పుడూ వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తుంది. కొత్త ఉత్పత్తులను సకాలంలో ప్రవేశపెట్టడం మరియు కస్టమర్ అవసరాలను తీర్చడానికి టొయోటా చేస్తున్న ప్రయత్నంలో భాగంగా పుట్టుకొచ్చిందే ఈ కొత్త అర్బన్ క్రూయిజర్ అని" అన్నారు.

భారత్‌కు మరో కొత్త టొయోటా కారు - ఈసారి అర్బన్ క్రూజర్; టీజర్ లాంచ్

"అలాగే, టొయోటా అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీని సొంతం చేసుకోవాలనుకోవడమే కాకుండా, టొయోటా యొక్క ప్రపంచ ప్రమాణాల అమ్మకాలు మరియు అమ్మకాల తర్వాత సేవలను అనుభవించాలనుకునే కొత్త కస్టమర్లను స్వాగతించడానికి ఇది మాకు అవకాశాన్ని కల్పిస్తుందని ఆశిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఈ కొత్త కారు మరియు విడుదలకు సంబంధించిన మరిన్ని వివరాలను పంచుకుంటామ"ని ఆయన చెప్పారు.

భారత్‌కు మరో కొత్త టొయోటా కారు - ఈసారి అర్బన్ క్రూజర్; టీజర్ లాంచ్

ప్రస్తుతానికి ఈ కారుకి సంబంధించిన టీజర్ ఇమేజ్ మినహా వేరే ఏ ఇతర వివరాలు వెల్లడి కాలేదు. టొయోటా అర్బన్ క్రూయిజర్‌ను మారుతి విటారా బ్రెజ్జా ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసినట్లయితే, ఈ రెండు మోడళ్లలో ఒకేరకమైన 1.5-లీటర్ కె15 సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ను ఆఫర్ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఈ రెండింటిలో చాలా వరకూ ఫీచర్లు ఒకేలా ఉండొచ్చని తెలుస్తోంది.

భారత్‌కు మరో కొత్త టొయోటా కారు - ఈసారి అర్బన్ క్రూజర్; టీజర్ లాంచ్

ఈ ఇంజన్ విడుదల చేసే పవర్, టార్క్ గణాంకాలు కూడా ఒకేలా ఉండే అవకాశం ఉంది. బ్రెజ్జాలో 5-స్పీడ్ మాన్యువల్ మరియు 4-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవే గేర్‌బాక్స్ ఆప్షన్స్ కొత్త అర్బన్ క్రూయిజర్‌లో కూడా అందుబాటులోకి వస్తాయి. టొయోటా అర్బన్ క్రూయిజర్‌లో స్మార్ట్ మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీని కూడా ఆఫర్ చేయవచ్చని సమాచారం.

భారత్‌కు మరో కొత్త టొయోటా కారు - ఈసారి అర్బన్ క్రూజర్; టీజర్ లాంచ్

టొయోటా అర్బన్ క్రూయిజర్ కాంపాక్ట్ ఎస్‌యూవీపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టొయోటా అర్బన్ క్రూయిజర్ భారత మార్కెట్లో ఈ జపనీస్ బ్రాండ్‌కు మొట్టమొదటి కాంపాక్ట్-ఎస్‌యూవీగా నిలుస్తుంది. యువ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని, భారతదేశంలో ఎస్‌యూవీల పెరుగుతున్న డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు టొయోటా ఈ మోడల్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. కొత్త టొయోటా అర్బన్ క్రూయిజర్ మార్కెట్లో విడుదలైతే ఇది ఈ సెగ్మెంట్లో మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ మరియు త్వరలో రానున్న కియా సోనెట్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

Read more on: #టొయోటా
English summary
Toyota Kirloskar Motors India (TKM) has released the first official teaser of their upcoming Urban Cruiser SUV.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X