ఫస్ట్ టయోటా వెల్‌ఫైర్ కార్ కొన్న కేరళ సూపర్ స్టార్ ఎవరో తెలుసా.. !

భారతదేశంలో ఇటీవల కాలంలో ప్రారంభించిన టయోటా వెల్‌ఫైర్ ఇప్పుడు డెలివరీలను ప్రారంభించింది. ఈ కొత్త టయోటా వెల్‌ఫైర్ కారుని మొట్ట మొదట కేరళకు చెందిన ఒక సినీ స్టార్ కి అందజేయడం జరిగింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూద్దాం.. !

ఫస్ట్ టయోటా వెల్‌ఫైర్ కార్ కొన్న కేరళ సూపర్ స్టార్ ఎవరో తెలుసా.. !

ఇండియన్ మార్కెట్లో విడుదలైన టయోటా వెల్‌ఫైర్ మొట్ట మొదట కేరళ రాష్ట్రంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ కి అందజేసింది. ఈ కారు మూడు నెలలు అమ్ముడవుతుందని, నెలకు 60 యూనిట్ల చొప్పున దిగుమతి చేసుకుంటారని, ఇప్పటికే 180 యూనిట్లు అమ్ముడయినట్లు కంపెనీ వర్గాలు తెలియజేసాయి.

ఫస్ట్ టయోటా వెల్‌ఫైర్ కార్ కొన్న కేరళ సూపర్ స్టార్ ఎవరో తెలుసా.. !

కొత్త టయోటా వెల్‌ఫైర్ దేశంలో ఉండే అత్యంత విలాసవంతమైన మరియు విశాలమైన కారు. అంతే కాకుండా ఇది భారతదేశంలో విక్రయించబడుతున్న అతిపెద్ద ప్యాసింజర్ కారులలో కూడా ఒకటి. దీని ధర రూ. 79 లక్షలు (ఎక్స్-షోరూమ్).

ఫస్ట్ టయోటా వెల్‌ఫైర్ కార్ కొన్న కేరళ సూపర్ స్టార్ ఎవరో తెలుసా.. !

కొత్త టయోటా వెల్‌ఫైర్ యొక్క ఫీచర్స్ గమనించినట్లయితే దీని ముందు భాగంలో విస్తృత క్రోమ్ స్ట్రిప్స్‌ను కలిగి ఉంటుంది. డ్యూయల్ ఎల్‌ఇడి సెటప్‌, రూఫ్ మౌంటెడ్ రియర్ స్పాయిలర్, క్లియర్-లెన్స్ కాంబినేషన్ లైట్లు మరియు ర్యాపారౌండ్ రియర్ విండ్‌షీల్డ్, డాష్‌బోర్డ్ అంతా నలుపు రంగులో ఉంటుంది. సీట్లు నలుపు మరియు లేత గోధుమరంగు యొక్క డ్యూయల్ టోన్ థీమ్‌లో కలిగి ఉంది లెదర్ తో చేయబడి ఉంటాయి.

ఫస్ట్ టయోటా వెల్‌ఫైర్ కార్ కొన్న కేరళ సూపర్ స్టార్ ఎవరో తెలుసా.. !

వెల్‌ఫైర్ యొక్క సూపర్ లగ్జరీ కారులో వెంటిలేటెడ్ సీట్లు, సీట్ టేబుల్స్, యాంబియంట్ లైటింగ్, పర్సనల్ స్పాట్‌లైట్లు, పవర్డ్ రియర్ డోర్స్, డబుల్ సన్‌రూఫ్ మరియు ట్రై-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి.

ఫస్ట్ టయోటా వెల్‌ఫైర్ కార్ కొన్న కేరళ సూపర్ స్టార్ ఎవరో తెలుసా.. !

టయోటా వెల్‌ఫైర్ యొక్క భద్రతా లక్షణాలను గమనిస్తే ఇందులో 7 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, కార్నరింగ్ లాంప్స్ వంటివి ఉంటాయి.

ఫస్ట్ టయోటా వెల్‌ఫైర్ కార్ కొన్న కేరళ సూపర్ స్టార్ ఎవరో తెలుసా.. !

ఈ వాహనంలో శక్తినివ్వడానికి 2.5 లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 179 హెచ్‌పి గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా ఇ-సివిటి యూనిట్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో ఇ-ఎడబ్ల్యుడి వ్యవస్థ కూడా ఉంటుంది. దీని వల్ల కారు శుభ్రంగా ఉంటుంది.

టయోటా వెల్‌ఫైర్ యొక్క రూపకల్పన మరింత ఆకర్షణీయంగా ఉండకపోయినా, దాని భారీ పరిమాణం వల్ల మరియు విశాలంగా ఉండటం వల్ల ప్రత్యేకమైన గుర్తిపును కలిగి ఉంటుంది.

ఫస్ట్ టయోటా వెల్‌ఫైర్ కార్ కొన్న కేరళ సూపర్ స్టార్ ఎవరో తెలుసా.. !

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారతదేశంలో విడుదల చేసిన టయోటా వెల్‌ఫైర్ యొక్క వైట్ కలర్ కారుని కేరళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కి అందజేశారు. ఇది చాలా విశాలంగా ఉండే విలాసవంతమైన కారు. ఇండియన్ మార్కెట్లో ఈ టయోటా వెల్‌ఫైర్ కి, మెర్సిడెస్ వి క్లాస్ కారు ప్రత్యర్థిగా ఉంటుంది. బెంజ్ వి క్లాస్ మరియు టయోటా వెల్‌ఫైర్ చూడటానికి ఒకే రకమైన బాహ్య రూపు రేఖలను కలిగి ఉంటాయి. ఈ టయోటా లగ్జరీ ఎమ్‌పివి కార్లు మార్కెట్లో పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Toyota Vellfire white colour delivered to Mohanlal in Kerala. Read in Telugu.
Story first published: Monday, March 2, 2020, 11:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X