Just In
- 8 hrs ago
కారులో ఉన్న పాడిల్ షిఫ్ట్ ఫీచర్ యొక్క ప్రయోజనాలు
- 20 hrs ago
భారత్‌లో ఫేమ్ స్కీమ్స్ కింద స్థాపించబడిన EV ఛార్జింగ్ స్టేషన్లు
- 20 hrs ago
టాటా టిగోర్ ఈవి ఫేస్‌లిఫ్ట్ వివరాలు వెల్లడి; ఎక్స్ ప్రెస్-టి పేరుతో త్వరలోనే లాంచ్!
- 23 hrs ago
హైదరాబాద్‌లో విడుదల కానున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ - డీటేల్స్
Don't Miss
- Sports
IPL 2021: సన్‌రైజర్స్‌కు భారీ షాక్.. స్టార్ పేసర్‌కు గాయం! ఆడేది అనుమానమే!
- News
కరోనా విలయం: ప్రధానికి చెక్ పెడుతూ రాహుల్ గాంధీ కీలక నిర్ణయం -వంచన వద్దన్న ప్రియాంక -మోదీ ఇలా
- Finance
పదింటిలో 9 కంపెనీల్లో నియామకాల జోరు, ఐటీలో అదుర్స్
- Movies
మరోసారి నందమూరి హీరోతో బోయపాటి మూవీ: యాక్షన్ స్టోరీని రెడీ చేసిన మాస్ డైరెక్టర్
- Lifestyle
ఈ వారం 18వ తేదీ నుండి ఏప్రిల్ 24వ తేదీ వరకు మీ రాశిఫలాలు...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గుడ్ న్యూస్.. ఫాస్ట్‌ట్యాగ్ గడువు పెంపు.. లాస్ట్ డేట్ ఎప్పుడో ఇక్కడ చూడండి
2021 జనవరి 1 నుంచి ఫోర్ వీలర్ వాహనాలకు ఫాస్ట్‌టాగ్ తప్పనిసరి అని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం విదితమే. టోల్ వసూలు కోసం డిజిటల్ మరియు ఐటి ఆధారిత చెల్లింపులను ప్రోత్సహించడానికి, 1 డిసెంబర్ 2017 లోపు అమ్మిన వాహనాలతో సహా మొత్తం ఫోర్ వీలర్ వాహనాలకు తప్పనిసరి ఫాస్టాగ్ ఉండాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇప్పుడు ఫాస్ట్‌ట్యాగ్ అమలు చేసుకోవడానికి గడువును పొడిగిస్తూ రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ గడువు ఫిబ్రవరి 15 వరకు పొడిగించబడింది. ఎకనామిక్ టైమ్స్ ఆటో యొక్క నివేదిక ప్రకారం, 2021 ఫిబ్రవరి 15 వరకు అన్ని టోల్ ప్లాజాలపై నగదు లావాదేవీలకు కొంత మినహాయింపు ఇచ్చింది.

రానున్న కొత్త సంవత్సరం 2021జనవరి 01 నుంచి దేశంలో 100 శాతం ఫాస్టాగ్ టోల్ కలెక్షన్ అమలు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికి దేశంలో కొనసాగుతున్న కరోనా మహమ్మారి కారణంగా ఈ తేదీని కాస్త పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం, టోల్ వసూళ్లలో 75 శాతం ఫాస్ట్‌ట్యాగ్ వాటా ఉంది.
MOST READ:వెహికల్‌పై పేర్లు ఉంటే ఇప్పుడే తీసెయ్యండి.. లేకుంటే ఏమవుతుందో తెలుసా..!

2021 జనవరి 1 నుండి అమల్లోకి వచ్చే అన్ని ఫోర్ వీలర్ వాహనాల రిజిస్ట్రేషన్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ వ్యూహం ప్రకారం, జాతీయ రహదారి మరియు ఎక్స్‌ప్రెస్‌వేను చాలా వేగంగా డిజిటలైజ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక రహదారి ప్రాజెక్టులలో ఎలక్ట్రానిక్ టోల్ వసూలు కూడా ఉన్నాయి.

ఈ ప్రాజెక్టులో దేశంలోని అన్ని టోల్ ప్లాజాలు 100 శాతం నగదు రహితంగా కొనసాగుతాయి. దేశంలోని అన్ని టోల్ ప్లాజాల వద్ద ఫాస్ట్‌ట్యాగ్ వే లు నిర్మించబడ్డాయి. ఫాస్ట్‌ట్యాగ్ అనేది వాహనాల విండ్ స్క్రీన్ మీద అమర్చిన ఒక డిజిటల్ స్టిక్కర్. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీపై పనిచేస్తుంది.
MOST READ:ఇంద్రభవనం లాంటి విమానం.. ఇది చూస్తే ఒక్కసారైనా వెళ్లాలనిపిస్తుంది.. ఓ లుక్కేసెయ్యండి

ఫాస్ట్‌ట్యాగ్ కలిగిన వాహనాలు టోల్ ప్లాజా గుండా వెళ్ళినప్పుడు, టోల్ టాక్స్ స్వయంచాలకంగా బ్యాంక్ లేదా ఫాస్టాగ్‌తో అనుబంధించబడిన ప్రీపెయిడ్ ఖాతా నుండి తీసుకుంటుంది. టోల్ చెల్లించడానికి ప్రత్యేకంగా టోల్ గేట్ దగ్గర వేచి ఉండవలసిన అవసరం లేదు.

ఫాస్ట్‌ట్యాగ్ అనేది వాహనదారుల సమయాన్ని ఆదా చేయడమే కాకుండా ఇంధనాన్ని కూడా పొదుపు చేస్తుంది. దేశ వ్యాప్తంగా 100 శాతం ఫాస్ట్‌ట్యాగ్ మేలు చేసిన తర్వాత టోల్ వసూలు కోసం వాహనాలు టోల్ గేట్ దగ్గర వేచి ఉండవలసిన అవసరం ఉండదు.
MOST READ:రూ. 41,500 జరిమానాతో సీజ్ చేయబడిన డ్యాన్స్ స్కార్పియో ; కారణం ఏంటో తెలుసుకోండి

ఫాస్ట్‌ట్యాగ్ లు ఇప్పుడు బ్యాంకులు లేదా ఆన్లైన్ లో కూడా కొనుగోలు చేయవచ్చు. అంతే కాకుండా రవాణా కార్యాలయం నుండి కూడా ఫాస్ట్‌ట్యాగ్ కొనుగోలు చేయవచ్చు. ఫాస్ట్‌ట్యాగ్ తీసుకోవటానికి, మీరు కెవైసి మరియు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అందించాల్సి ఉంటుంది. ఫాస్ట్‌ట్యాగ్ ను అమెజాన్ మరియు పేటీఎం వంటి ఆన్లైన్ షాపింగ్స్ లో కూడా కొనుగోలు చేయవచ్చు.

వాహనాలన్నీ ఫాస్ట్‌ట్యాగ్స్ కలిగి ఉండటం వల్ల సాధారణ వసూళ్లకంటే ఎక్కువ శాతం వసూలు చేసే అవకాశం ఉంది. ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లు ఎక్కువ సమయం వేచి ఉండవలసిన అవసరం లేదు, ఈ కారణంగా ట్రాఫిక్ జామ్ ఉండదు.
MOST READ:భయంకర ప్రమాదం నుంచి చిటికెలో తపించుకున్న యువకులు [వీడియో]

ఫాస్ట్‌ట్యాగ్ అమలులోకి వచ్చిన తర్వాత టోల్ వసూలు మునుపటికంటే ఎక్కువగా రోజు రోజుకు పెరుగుతోంది. సేఫ్టీ మరియు వెహికల్ ట్రాకింగ్ కోసం ఫాస్ట్‌ట్యాగ్ బాగా ఉపయోగపడుతుంది. ఫాస్ట్‌ట్యాగ్ కలిగిన వాహనాలు టోల్ ప్లాజా గుండా వెళ్ళినట్లైతే అక్కడ వెళ్లే ప్రతి వాహనం యొక్క రికార్డ్ ప్రభుత్వం దగ్గర ఉంటుంది.

మీ వాహనం యొక్క ఫాస్ట్‌ట్యాగ్ సంబంధించిన సమాచారాన్ని వీక్షించడానికి నా ఫాస్ట్‌ట్యాగ్ అప్లికేషన్ కూడా ప్రారంభించబడింది. ఫాస్ట్‌ట్యాగ్ కి సంబంధించిన అన్ని ప్రశ్నలకు ఈ యాప్‌లో సమాధానం లభిస్తుంది. ఈ యాప్ లో వినియోగదారులు వారి ఫాస్ట్‌ట్యాగ్ టోల్ లావాదేవీలను చూడవచ్చు మరియు ఆ అకౌంట్ రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు.