Just In
Don't Miss
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Movies
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహీంద్రా థార్ కన్వర్టిబల్‌ను చూశారా? - ధర, వివరాలు
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా తమ సరికొత్త 2020 మహీంద్రా థార్ ఎస్‌యూవీ ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ ఎస్‌యూవీ లైనప్‌లో ఎంపిక చేసిన వేరియంట్లలో కన్వర్టిబుల్ సాఫ్ట్ టాప్‌తో ఈ కొత్త థార్‌ను అందిస్తున్నారు. కొత్త మహీంద్రా థార్‌లో ఫ్యాక్టరీలో అమర్చిన కన్వర్టిబుల్ సాఫ్ట్-టాప్‌ను ప్రదర్శించే ఓ కొత్త వీడియోను కంపెనీ విడుదల చేసింది.

కేవలం ఆఫ్-రోడ్ ప్రియుల కోసం మాత్రమే కాకుండా, నిత్యం వినియోగించుకునేందుకు వీలుగా కూడా మహీంద్రా ఈ ఎస్‌యూవీని తయారు చేసింది. ఈ వీడియోలో మహీంద్రా తమ కన్వర్టిబుల్ టాప్‌ను ఎలా మడవవచ్చో వివరించింది. సరికొత్త థార్‌లో కన్వర్టిబుల్-టాప్‌ను మడతపెట్టడంలో లేదా ఉపయోగించడంలో మూడు ప్రధాన దశలు ఉన్నాయి.
ఈ వీడియోలో మొదటగా ఓ వ్యక్తి వెనుక మరియు సైడ్ స్క్రీన్‌లను అన్‌జిప్ చేస్తాడు, అలాగే, ఇందులోని వెల్క్రోని కూడా తొలగిస్తాడు. దీంతో ప్లాస్టిక్ తెరలు పై నుండి జిప్ జోడింపుల వరకూ పూర్తిగా తొలగించబడతాయి.
MOST READ:ఒక్క సారిగా సర్వీస్ సెంటర్లపై పడిన కార్ ఓనర్స్.. ఎందుకంటే ?

రెండవ దశగా, ఆ వ్యక్తి కారప ముందు భాగంలో సన్ వైజర్లపై ఉన్న రెండు లాచెస్‌ను అన్‌లాక్ చేస్తాడు. ఈ లాచెస్‌ను అన్‌లాక్ చేసినప్పుడు, మడత పెట్టడానికి సిద్ధంగా ఉన్న పైకప్పు కారు నుండి వేరు చేయబడుతుంది.

ఇకపోతే, ఇందులో మూడవ దశలో ఆ వ్యక్తి చేసేదల్లా ఇరువైపులా ఉంచిన గైడ్ రాడ్స్ సాయంతో ఎస్‌యూవీ వెనుక వైపుకు కాన్వాస్ మడచడమే. అది పూర్తిగా వెనక్కి నెట్టిన తర్వాత, మడత విధానం పూర్తవుతుంది మరియు మనకు టాప్‌లెస్ 2020 మహీంద్రా థార్ సిద్ధమవుతుంది.
MOST READ:త్వరపడండి.. హోండా కార్లపై ఆకర్షనీయమైన ఆక్టోబర్ నెల ఆఫర్లు!

మహీంద్రా థార్‌లో పైభాగాన్ని మూసివేయడానికి, అదే మూడు దశలను రివర్స్ పద్ధతిలో అనుసరించాల్సి ఉంటుంది. తొలగించగల రాడ్లు, నట్స్ అండ్ బోల్ట్‌ల సాయంతో కొత్త థార్‌ను కన్వర్టిబుల్ టాప్‌గా మార్చడానికి పాత తరం థార్‌లా కాకుండా, చాలా సులువుగా, త్వరగా మరియు ఇబ్బంది లేకుండా ఉంటుంది.

కొత్త థార్ కన్వర్టిబల్ విషయంలో మహీంద్రా వెనుక మరియు సైడ్స్ తెరలు మరియు ముందు భాగంలో లాచెస్ వంటి అన్ని అటాచ్ పాయింట్లకు తగిన వాటర్‌ప్రూఫింగ్ ఇచ్చింది. ఇది క్యాబిన్ లోపల నీటిని ప్రవేశించకుండా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, కొత్త థార్‌లోని అన్ని ఇంటీరియర్‌లను ఐపి54 సర్టిఫైడ్ వాటర్‌ప్రూఫ్ మెటీరియల్స్‌తో తయారు చేసినందున వాహన యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
MOST READ:ఇది చూసారా.. బామ్మకోసం 4 దేశాలు కాలినడకతో ప్రయాణించిన 10 ఏళ్ల బాలుడు

ఇదివరకు చెప్పుకున్నట్లుగానే, కొత్త మహీంద్రా థార్‌లోని కన్వర్టిబుల్-టాప్ ఎస్‌యూవీ లైనప్‌లోని కొన్ని వేరియంట్‌లకు మాత్రమే పరిమితం చేయబడింది. రూ.11.90 లక్షల నుంచి ప్రారంభమయ్యే ఎఎక్స్ (ఓ), రూ.129 లక్షల నుంచి రూ.13.65 లక్షల మధ్య రిటైల్ అయ్యే ఎల్ఎక్స్ వేరియంట్లు ఇందులో ఉన్నాయి.

పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ (ఇండియా). కొత్త 2020 మహీంద్రా థార్ యొక్క మరిన్ని వేరియంట్ వారీగా ధరలు, ఫీచర్లు మరియు ఇతర వివరాలు ఇదివరకటి కథనంలో ప్రచురించబడ్డాయి. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.
MOST READ:సర్వీస్ సెంటర్ నుంచి దొంగలించబడిన టయోటా ఇన్నోవా క్రిస్టా.. ఇంతకీ ఎలా జరిగిందో తెలుసా ?

ఇకపోతే, ఈ కొత్త తరం ఎస్‌యూవీలో ముఖ్యంగా చెప్పుకోవల్సింది ఇందులోని అప్‌డేట్ చేయబడిన ఇంజన్ ఆప్షన్స్. ఇందులో 2.0-లీటర్ టి-జిడి ఎమ్‌స్టాలియన్ పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్‌ను మరియు 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, 2.2-లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్ 130 బిహెచ్‌పి మరియు 300 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ రెండు ఇంజన్లు సిక్స్-స్పీడ్ మాన్యువల్ లేదా సిక్స్-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి. అంతేకాకుండా, ఇందులోని అన్ని మోడళ్లను స్టాండర్డ్‌గా షిఫ్ట్-ఆన్-ఫ్లై ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో అందించనున్నారు.
కొత్త మహీంద్రా థార్ కన్వర్టిబల్ టాప్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
కొత్త 2020 మహీంద్రా థార్ ఎస్‌యూవీలోని కన్వర్టిబుల్ టాప్ ఫ్యాన్సీ స్పోర్ట్స్ కార్లలాంటి అధునాతమైనది కాకపోవచ్చు. కానీ, మునుపటి తరం థార్‌తో పోల్చుకుంటే, దీనిని ఆపరేట్ చేయడం చాలా సులభంగా ఉంది. అయితే, కొత్త 2020 థార్‌లో ఈ కొత్త మరియు సులభంగా ఆపరేట్ చేయగల కన్వర్టిబుల్ టాప్ పొందడానికి, వినియోగదారులు కొంచెం ఎక్కువ ఖర్చు చేసి, ఏఎక్స్ (ఓ) వేరియంట్ లేదా టాప్-స్పెక్ ఎల్ఎక్స్ వేరియంట్‌లను ఎంచుకోవాల్సి ఉంటుంది.