Just In
- 9 hrs ago
కారులో ఉన్న పాడిల్ షిఫ్ట్ ఫీచర్ యొక్క ప్రయోజనాలు
- 21 hrs ago
భారత్‌లో ఫేమ్ స్కీమ్స్ కింద స్థాపించబడిన EV ఛార్జింగ్ స్టేషన్లు
- 21 hrs ago
టాటా టిగోర్ ఈవి ఫేస్‌లిఫ్ట్ వివరాలు వెల్లడి; ఎక్స్ ప్రెస్-టి పేరుతో త్వరలోనే లాంచ్!
- 24 hrs ago
హైదరాబాద్‌లో విడుదల కానున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ - డీటేల్స్
Don't Miss
- News
వైఎస్ జగన్‌కు నారా లోకేష్ లేఖ: కేసీఆర్, మోడీ సర్కార్‌తో ముడిపెడుతూ
- Movies
Vakeelsaab 9 days collections: టార్గెట్‌కు ఇంకా కొద్దీ దూరంలోనే.. కోవిడ్ కష్టకాలంలో సాధ్యమేనా?
- Finance
జీరో బ్యాలెన్స్ ఖాతాల్లో ట్రాన్సాక్షన్స్ ఛార్జీలపై ఎస్బీఐ వడ్డీ రేటు, ఫ్రీ ట్రాన్సాక్షన్స్
- Sports
MI vs SRH: ఏం చెప్పాలో తెలియడం లేదు.. ఈ ఓటమిని ఎలా తీసుకోవాలో అంతకన్నా అర్థం కావడం లేదు: వార్నర్
- Lifestyle
ఈ వారం 18వ తేదీ నుండి ఏప్రిల్ 24వ తేదీ వరకు మీ రాశిఫలాలు...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఫోక్స్‌వ్యాగన్ కస్టమర్ టచ్ పాయింట్ ఇప్పుడు మన హైదరాబాద్‌లో కూడా.. ఎక్కడో తెలుసా?
ప్రముఖ వాహన తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా హైదరాబాద్‌లోని మెహదీపట్నం వద్ద కొత్త కస్టమర్ టచ్‌పాయింట్‌ను ప్రారంభించింది. ఈ కొత్త కస్టమర్ టచ్ పాయింట్ జ్యోతి నగర్ వద్ద ఉంది. ఈ కొత్త 3 ఎస్ స్పెషలిటీ ఆటో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ నిహార్ మోడి నాయకత్వంలో నడుస్తుంది.

కొత్త కస్టమర్ టచ్‌పాయింట్‌ను ప్రారంభించడం గురించి ఆటో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ నిహార్ మోడి మాట్లాడుతూ, "తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని మా నెట్‌వర్క్‌ను ఫోక్స్‌వ్యాగన్ మెహదీపట్నం చేర్చడంతో, మా వినియోగదారులకు మరింత అందుబాటులో ఉంటుందని మేము భావిస్తున్నాము.

మా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్, ఇంటిగ్రేటెడ్ సేల్స్ అండ్ సర్వీస్ స్పెషలిటీ, మా కస్టమర్లకు వారి సౌలభ్యం మరియు అమ్మకాలను మెరుగుపరచడానికి మరియు మెయింటెనెన్స్ సర్వీస్ పొందటానికి వీలు కల్పిస్తుంది.
MOST READ:బ్రేకింగ్ న్యూస్.. త్వరలో పెరగనున్న మహీంద్రా థార్ ధర : వివరాలు

ఫోక్స్‌వ్యాగన్ ప్రారంభించిన ఈ కొత్త సదుపాయంలో 3 కార్ల ప్రదర్శన ఉంటుంది, ఇది కొత్త మరియు వాడిన కార్ల విభాగంలో వినియోగదారులకు సరికొత్త ఉత్పత్తి సమర్పణలను ప్రదర్శించడంలో సహాయపడుతుంది. ఈ సౌకర్యం అమ్మకాల తర్వాత సర్వీస్ అందిస్తుంది, ఇందులో మెయింటెనెన్స్ మరియు స్పైర్ పార్ట్శ్ ఉంటాయి.

అన్ని మరమ్మత్తు మరియు నిర్వహణ పనులు కస్టమర్ సౌలభ్యం మరియు మద్దతు కోసం అత్యంత నైపుణ్యం మరియు శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులచే చేయబడతాయి. వోక్స్వ్యాగన్ ఇండియాకు దేశవ్యాప్తంగా 137 సేల్స్ మరియు 116 సర్వీస్ టచ్ పాయింట్లు ఉన్నాయి. అంతే కాకుండా 2020 చివరి నాటికి వీటిని 150 కి పెంచాలని కంపెనీ యోచిస్తోంది.
MOST READ:టాటా మోటార్స్ కొత్త స్టైల్‌లో పరిచయం చేసిన సేఫ్టీ బబుల్ ; ఎందుకో తెలుసా !

ఈ కొత్త సదుపాయాన్ని ప్రారంభించడంపై వోక్స్వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా బ్రాండ్ హెడ్ ఆశిష్ గుప్తా మాట్లాడుతూ, "హైదరాబాద్ లోని మెహదీపట్నం వద్ద కొత్త సదుపాయాన్ని ప్రారంభించడంతో, దేశవ్యాప్తంగా మా కస్టమర్ టచ్ పాయింట్లను విస్తరించడానికి వోక్స్వ్యాగన్ ట్రాక్‌లో ఉంది.

వచ్చే ఏడాది టైగన్ ప్రారంభించటానికి కంపెనీ సన్నాహాలను సిద్ధం చేస్తోంది. మా కస్టమర్లకు అనుకూలమైన వాటిని ప్రవేశపెట్టడానికి మేము నిర్విరామంగా కృషి చేస్తున్నాము.
ఈ కొత్త సర్వీస్ పాయింట్ దక్షిణ ప్రాంతంలోని మా వినియోగదారులకు అద్భుతమైన అమ్మకాలు మరియు సేవా అనుభవాన్ని అందించగలమని మేము భావిస్తున్నాము. ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాలలో వోక్స్వ్యాగన్ టచ్ పాయింట్ ప్రారంభించడం వల్ల వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. దీని వల్ల కంపెనీ యొక్క అమ్మకాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
MOST READ:బెంగళూరు నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో డైరెక్ట్ ప్లైట్ సర్వీస్.. ఎప్పటినుంచే తెలుసా ?