Just In
- 17 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 1 day ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 1 day ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 1 day ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
మాజీ రాష్ట్రపతి కలాం సోదరుడు మహమ్మద్ ముత్తుమీర కన్నుమూత
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Movies
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విడుదలకు ముస్తాబవుతున్న ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ బిఎస్6; వివరాలు
జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్, తమ పాపులర్ ప్రీమియం సెడాన్ 'పస్సాట్'లో బిఎస్6 వెర్షన్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్త 2020 ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ కారును మహారాష్ట్ర రోడ్లపై టెస్టింగ్ చేస్తుండగా మరోసారి కెమెరాకి చిక్కింది. ఈ కారును క్యామోఫ్లేజ్ లేకుండా టెస్టింగ్ చేయటాన్ని చూస్తుంటే, మరికొద్ది రోజుల్లోనే ఇది భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తాజాగా రష్‌లేన్ ఇందుకు సంబంధించి కొన్ని స్పై చిత్రాలను విడుదల చేసింది. ఈ టెస్టింగ్ కారును పూనేలోని ఫోక్స్‌వ్యాగన్ ప్లాంట్ సమీపంలో పరీక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. సరికొత్త డిజైన్ మరియు ఫీచర్లతో పాటుగా సరికొత్త ఇంజన్ ఆప్షన్‌తో కొత్త 2020 ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ కానుంది.

కొత్త ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ కారు ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్లలో సూక్ష్మమైన మార్పులు ఉన్నాయి. ముందు భాగంలో, రీడిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్, గ్రిల్ మరియు ఎల్ఈడి మ్యాట్రిక్స్ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. వెనుక వైపు స్ప్లిట్ టెయిల్ ల్యాంప్ డిజైన్ మరియు బూట్ లిడ్‌పై ఫోక్స్‌వ్యాగన్ లోగో మరియు పస్సాట్ బ్యాడ్జ్ ఉన్నాయి. అలాగే, ఇందులో కొత్త 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ డిజైన్‌ను కూడా మనం గమనించవచ్చు.
MOST READ:ఖరీదైన మోడిఫైడ్ కార్ రిజిస్ట్రేషన్ సస్పెండ్, ఎదుకో తెలుసా ?

సైడ్ డిజైన్‌ను గమనిస్తే, పస్సాట్ ఫ్రంట్ ఫెండర్ నుండి టెయిల్ ల్యాంప్స్ వరకూ ఉన్న బోల్డ్ షోల్డర్ లైన్‌ను ఇందులో చూడొచ్చు. ఈ లైన్‌లోనే ఫ్రంట్ అండ్ రియర్ డోర్ హ్యాండిల్స్ కూడా అమర్చబడి ఉంటాయి. బిఎస్4 పస్సాట్‌తో పోల్చుకుంటే బిఎస్6 పస్సాట్ మరింత స్టైలిష్‌గా, అగ్రెసివ్‌గా కనిపిస్తుంది.

ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే.. బ్రాండ్ యొక్క వర్చువల్ కాక్‌పిట్ డిజైన్‌తో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, బ్రాండ్ అందించే లేటెస్ట్ కనెక్టివిటీ టెక్నాలజీ వంటి సాంకేతికతతో పాటుగా మరింత లగ్జరీ ఫీల్‌నిచ్చే ఇంటీరియర్ క్యాబిన్‌ను కలిగి ఉండనుంది.
MOST READ:స్కోడా రాపిడ్ టిఎస్ఐ మోంటే కార్లో ఎడిషన్ రోడ్ టెస్ట్ రివ్యూ.. వచ్చేసింది

అంతేకాకుండా, ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పానోరమిక్ సన్‌రూఫ్, అప్‌డేటెడ్ లెథర్ అప్‌హోలెస్ట్రీ, పవర్-ఆపరేటెడ్ సీట్స్ మరియు వెంటిలేటెడ్ సీట్స్, మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

బిఎస్6 పస్సాట్‌లో అతిపెద్ద మార్పు, దాని ఇంజన్‌లో ఉండబోతోంది. స్కొడా సూపర్బ్‌లో ఉపయోగిస్తున్న 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఇందులో ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 190 బిహెచ్‌పిల శక్తిని, 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ జిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో మాత్రమే లభిస్తుంది, ఇందులో మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ లేదు.
MOST READ:షోరూమ్‌కి చేరుకున్న కియా సోనెట్ టెస్ట్ డ్రైవ్ మోడల్.. చూసారా !

ఇదివరకటి బిఎస్4 మోడళ్లలో 2.0 లీటర్ టిడిఐ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 174 బిహెచ్‌పిల శక్తిని, 350 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ డీజిల్ ఇంజన్ 6-స్పీడ్ జిఎస్‌జి గేర్‌బాక్స్‌తో లభ్యమయ్యేది. ఈ డీజిల్ ఇంజన్‌తో పోలిస్తే ప్రస్తుత పెట్రోల్ ఇంజన్ 16 బిహెచ్‌పిల ఎక్కువ శక్తిని మరియు 30 ఎన్ఎమ్‌ల తక్కువ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

భారతదేశంలో తాజా ఉద్గార నిబంధనలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ఫోక్స్‌వ్యాగన్ ఇకపై పెట్రోల్ ఆధారిత వాహనాలను నిర్మించడంపైనే దృష్టి సారిస్తామని కంపెనీ ఓ సందర్భంలో ప్రకటించింది. అయితే, భారత్ వంటి మార్కెట్లలో డీజిల్ ఇంజన్లకు కూడా సమాన గిరాకీ ఉన్న నేపథ్యంలో, ఇందులో డీజిల్ ఇంజన్ కూడా తర్వాతి దశల్లో అందుబాటులోకి రావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.
MOST READ:అదిరిపోయే ఫీచర్స్ తో మోడిఫైడ్ చేయబడిన ఫోర్స్ ట్రావెలర్, దీని ముందు లిమోలిన్ కూడా దిగదుడుపే

బిఎస్6 వెర్షన్ ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ కారులో అనేక డ్రైవర్ అసిస్ట్ మరియు సేఫ్టీ ఫీచర్లు ఉండొచ్చని అంచనా. ఇందులో ఫార్వర్డ్ కొల్లైజన్ వార్నింగ్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, పెడస్ట్రైన్ మోనిటరింగ్ సిస్టమ్, లేన్ కీపింగ్ అసిస్ట్ వంటి స్మార్ట్ సేఫ్టీ ఫీచర్లతో పాటుగా స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఇందులో లభ్యం కానున్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ భారత మార్కెట్లో విడుదలైతే, ఇది ఈ విభాగంలో స్కోడా సూపర్బ్ మరియు టొయోటా క్యామ్రీ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. ఇదివరకు భారత్‌లో బిఎస్4 పస్సాట్ ప్రారంభ ధర రూ.29.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండేది. అయితే, కొత్త అప్‌డేట్‌ల కారణంగా బిఎస్6 పస్సాట్ ధర బిఎస్4 ధర కన్నా అధికంగా ఉండొచ్చని అంచనా.

బిఎస్6 ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ బిఎస్6 మోడల్ విషయంలో రియల్ వరల్డ్ కండిషన్స్ ప్రకారం కంపెనీ టెస్టింగ్ చేయటాన్ని చూస్తుండే, ఈ మోడల్ విడుదలకు దాదాపుగా ముహుర్తం ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది పండుగ సీజన్‌లో ఇది ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.