ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో ఆటోమేటిక్ వేరియంట్స్ విడుదల; ధర, ఫీచర్లు

ఫోక్స్‌వ్యాగన్ ఇండియా భారత మార్కెట్లో విక్రయిస్తున్న పోలో హ్యాచ్‌బ్యాక్ మరియు వెంటో సెడాన్లలో కంపెనీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ వెర్షన్లు విడుదల చేసింది. బిఎస్6 కంప్లైంట్ ఇంజన్ కలిగిన పోలో మరియు వెంటోలు కొత్త ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ కూడా లభ్యం కానున్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో ఆటోమేటిక్ వేరియంట్స్ విడుదల; ధర, ఫీచర్లు

పోలో జిటి టిఎస్ఐ మరియు వెంటో హైలైన్ ప్లస్ వేరియంట్లలో మాత్రమే ఈ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ లభ్యం కానుంది. భారత మార్కెట్లో ఈ రెండు ఆటోమేటిక్ వేరియంట్ల పరిచయ ధరలు ఇలా ఉన్నాయి:

-> పోలో జిటి టిఎస్ఐ ఏటి - రూ.9.67 లక్షలు

-> వెంటో హైలైన్ ప్లస్ ఏటి - రూ.12.99 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో ఆటోమేటిక్ వేరియంట్స్ విడుదల; ధర, ఫీచర్లు

ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ఈ ఏడాది మార్చ్ నెలలో పోలో మరియు వెంటో మోడళ్లలో బిఎస్6 కంప్లైంట్ వెర్షన్లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. బిఎస్6 అప్‌డేట్‌లో భాగంగా, ఈ జర్మన్ కార్ కంపెనీ ఈ రెండు మోడళ్లలో డీజిల్ ఇంజన్ ఆప్షన్లను పూర్తిగా నిలిపివేసింది. ప్రస్తుతానికి ఈ రెండు మోడళ్లు కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభ్యం కానున్నాయి.

MOST READ:ఢిల్లీలో సమ్మె ప్రారంభించిన క్యాబ్ డ్రైవర్లు , ఎందుకో తెలుసా !

ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో ఆటోమేటిక్ వేరియంట్స్ విడుదల; ధర, ఫీచర్లు

ఇదివరకటి పాత పెట్రోల్ ఇంజన్ల స్థానంలో కంపెనీ కొత్తగా 1.0-లీటర్ త్రీ సిలిండర్ టిఎస్‌ఐ ఇంజన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి శక్తిని మరియు 170 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రారంభంలో ఈ రెండు మోడళ్లు ఒకే రకమైన స్టాండర్డ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌‌తో లభించేవి. ఇప్పుడు వీటిలో టాప్-ఎండ్ వేరియంట్లు 6-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడా లభ్యం కానున్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో ఆటోమేటిక్ వేరియంట్స్ విడుదల; ధర, ఫీచర్లు

పోలో జిటి మరియు వెంటో హైలైన్ ప్లస్‌లలోని రెండు ఆటోమేటిక్ వేరియంట్లు నమ్మశక్యం కాని రీతిలో అత్యధిక మైలేజ్ గణాంకాలను ఇస్తాయని కంపెనీ పేర్కొంది. పోలో జిటి ఆటోమేటిక్ లీటరుకు 16.47 కి.మీ. మైలేజీని మరియు వెంటో ఆటోమేటిక్ లీటరుకు16.35 కి.మీ ఏఆర్ఏఐ సర్టిఫైడ్ మైలేజీనిస్తాయని కంపెనీ తెలిపింది.

MOST READ:మతిపోగుడుతున్న మాడిఫైడ్ మహీంద్రా ఇన్వాడర్

ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో ఆటోమేటిక్ వేరియంట్స్ విడుదల; ధర, ఫీచర్లు

పోలో జిటి టిఎస్ఐ ఏటి మరియు వెంటో హైలైన్ ప్లస్ ఏటి మోడళ్ల కోసం బుకింగ్‌లు కూడా ప్రారంభమైనట్లు ఫోక్స్‌వ్యాగన్ ధృవీకరించింది. కస్టమర్లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కానీ లేదా భారతదేశం అంతటా ఉన్న ఏదైనా అధీకృత ఫోక్స్‌వ్యాగన్ డీలర్‌షిప్‌ను సందర్శించి కానీ కార్లను బుక్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 15, 2020వ తేదీ నుండి ఈ రెండు మోడళ్ల డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో ఆటోమేటిక్ వేరియంట్స్ విడుదల; ధర, ఫీచర్లు

పోలో, వెంటో ఆటోమేటిక్ వేరియంట్లను మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా డైరెక్టర్ స్టీఫెన్ నాప్ మాట్లాడుతూ, "భారతదేశంలో ప్రీమియం కార్లను అందించే బ్రాండ్‌గా ఉండటమే ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్ ఫిలాసఫీ. ఆ ఉద్దేశ్యంతోనే, మేము బిఎస్6 పోలో మరియు వెంటో మోడళ్లలో ఆటోమేటిక్ వేరియంట్‌లను విడుదల చేస్తున్నాము. వినియోగదారులకు పనితీరు మరియు మెరుగైన ఫన్-టు-డ్రైవ్ అనుభవాన్ని అందించడంతో పాటుగా ధీటైన మైలేజీని అందించేలా వీటిని రూపొందించామ"ని అన్నారు.

MOST READ:ట్రాక్టర్ వెనుకవైపు పెద్ద టైర్లు ఉండటానికి కారణం ఏంటో తెలుసా ?

ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో ఆటోమేటిక్ వేరియంట్స్ విడుదల; ధర, ఫీచర్లు

"ఈ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లోని సున్నితమైన గేర్‌షిఫ్ట్ భారతీయ డ్రైవింగ్ పరిస్థితులకు పరిపూర్ణంగా ఉంటుంది. ఈ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ మొత్తం నిర్వహణ వ్యయాన్ని కూడా తగ్గిస్తుంది మరియు మొత్తం యాజమాన్య వ్యయ (టిసిఓ) అనుభవాన్ని సానుకూలంగా పెంచుతుందని" ఆయన అన్నారు.

ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో ఆటోమేటిక్ వేరియంట్స్ విడుదల; ధర, ఫీచర్లు

ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో ఆటోమేటిక్ వేరియంట్ల విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

పోలో మరియు వెంటో రెండు మోడళ్లు కూడా ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్ నుండి భారత మార్కెట్లో లభిస్తున్న ఎంట్రీ లెవల్ మోడళ్లు. ఈ విభాగంలో ఇవి ఇప్పటికే మంచి పాపులారిటీని దక్కించుకున్నాయి. వీటిలో బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు, పరికరాలు ఉన్నాయి మరియు ఇవి నమ్మశక్యం కాని నిర్మాణ నాణ్యత (బిల్డ్ క్వాలిటీ)తో రూపొందించబడ్డాయి. పోలో మరియు వెంటోలు ఇప్పుడు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌‌తో లభిస్తున్న నేపథ్యంలో, ఇవి దేశంలోని కస్టమర్లకు మరింత ఆకర్షణీయంగా, డ్రైవింగ్‌కు అనుకూలంగా ఉండనున్నాయి.

MOST READ:ఇది బుల్లెట్ బైక్ నుంచి తయారైన పాప్‌కార్న్ [వీడియో]

Most Read Articles

English summary
Volkswagen has introduced the BS6-compliant Polo and Vento with automatic transmision units. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X