ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన వోక్స్ వ్యాగన్ టి-రాక్ రేటెంతో తెలుసా.. !

జర్మన్ బ్రాండ్ అయిన వోక్స్ వ్యాగన్ తన బ్రాండ్ యొక్క టి-రాక్ ఎస్‌యువిని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇండియన్ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త వోక్స్ వ్యాగన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. !

ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన వోక్స్ వ్యాగన్ టి-రాక్ రేటెంతో తెలుసా.. !

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వోక్స్ వ్యాగన్ టి-రాక్ ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో విడుదలైనది. ఈ ఎస్‌యువి ధర రూ. 19.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). వోక్స్ వ్యాగన్ టిగువాన్ తరువాత టి-రాక్ రెండవ మోడల్.

ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన వోక్స్ వ్యాగన్ టి-రాక్ రేటెంతో తెలుసా.. !

వోక్స్ వ్యాగన్ టి-రాక్ మిడ్-సైజ్ ఎస్‌యువి విభాగంలో ప్రీమియం సమర్పణగా ఉంది. ఈ ఎస్‌యువి యొక్క కొలతను గమనించినట్లయితే దీని యొక్క పొడవు 4342 మి.మీ, 1819 మి.మీ వెడల్పు, 1537 మి.మీ ఎత్తు మరియు 2590 మి.మీ వీల్‌బేస్ కలిగి ఉంది. వోక్స్ వ్యాగన్ యొక్క కొత్త టి-రాక్ సిబియు (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) మార్గం ద్వారా మనదేశంలోకి దిగుమతి అవుతుంది.

ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన వోక్స్ వ్యాగన్ టి-రాక్ రేటెంతో తెలుసా.. !

వోక్స్ వ్యాగన్ టి-రాక్ మొట్టమొదటిసారిగా 2020 ఆటో ఎక్స్పోలో ప్రదర్శించబడింది. ఆటో ఎక్స్పోలో ఆవిష్కరించబడిన ఈ బ్రాండ్ ఎస్‌యువి అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించింది . ఇప్పటికే వోక్స్ వ్యాగన్ టి-రాక్ 300 బుకింగ్ యూనిట్లను కలిగి ఉంది. ఈ కొత్త కార్ యొక్క డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు.

ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన వోక్స్ వ్యాగన్ టి-రాక్ రేటెంతో తెలుసా.. !

వోక్స్ వ్యాగన్ టి-రాక్ ఆధునిక డిజైన్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా కొత్త అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. కొత్త టి-రాక్ ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లతో ఎల్‌ఇడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లతో వస్తుంది, దీనికి ఎల్‌ఇడి కార్నరింగ్ లైట్లు మరియు ఫాగ్ లాంప్‌లు కూడా లభిస్తాయి. ముందు భాగంలో స్టైలిష్ గ్రిల్ ఉంటుంది, దాని మధ్యలో విడబ్ల్యు బ్యాడ్జింగ్ ఉంటుంది.

ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన వోక్స్ వ్యాగన్ టి-రాక్ రేటెంతో తెలుసా.. !

వోక్స్ వ్యాగన్ టి-రాక్ లో స్టాండర్డ్ 17-ఇంచెస్ అల్లాయ్ వీల్స్, సబ్టెల్ క్యారెక్టర్ లైన్స్, క్రీజెస్ మరియు ప్లాలర్డ్ వీల్ ఆర్చెస్ ఉన్నాయి. వెనుకవైపు స్టైలిష్ ఎల్‌ఇడి టైల్లైట్స్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్లు మరియు పైకప్పుతో అమర్చిన స్పాయిలర్ కూడా ఉంటుంది.

ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన వోక్స్ వ్యాగన్ టి-రాక్ రేటెంతో తెలుసా.. !

వోక్స్ వ్యాగన్ యొక్క లోపలి భాగంలో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వర్చువల్ కాక్‌పిట్, లెదర్ అప్హోల్స్టరీ, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోలర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం వంటివి ఉంటాయి.

ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన వోక్స్ వ్యాగన్ టి-రాక్ రేటెంతో తెలుసా.. !

కొత్త బిఎస్ 6 వోక్స్ వ్యాగన్ లో 1.5 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 148 బిహెచ్‌పి మరియు 240 ఎన్ఎమ్పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ యూనిట్‌తో జత చేయబడింది. టి-రరాక్ గంటకు 205 కి.మీ వేగంతో ప్రయాణించగల సామర్త్యాన్ని కలిగి ఉంటుంది. కేవలం 8.4 సెకన్లలో 0 - 100 కి.మీ స్ప్రింట్ చేయగలదని వోక్స్ వ్యాగన్ తెలిపింది.

ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన వోక్స్ వ్యాగన్ టి-రాక్ రేటెంతో తెలుసా.. !

కొత్త వోక్స్ వ్యాగన్ టి-రాక్ ఆరు కలర్ ఎంపికలతో అందించబడుతుంది. అవి కర్కుమా ఎల్లో, ప్యూర్ వైట్, రావెన్న బ్లూ, ఎనర్జిటిక్ ఆరెంజ్, ఇండియం గ్రే మరియు డీప్ బ్లాక్ పెర్ల్. ఈ ఆరు కలర్స్ లో ఐదు బ్లాక్-అవుట్ రూప్ ని కలిగి ఉంటుంది.

ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన వోక్స్ వ్యాగన్ టి-రాక్ రేటెంతో తెలుసా.. !

డ్రైవ్‌‌స్పార్క్ తెలుగు అభిప్రాయం.. !

వోక్స్ వ్యాగన్ టి-రాక్ జర్మన్ బ్రాండ్ నుంచి విడుదలైన ఒక అప్డేటెడ్ వెర్షన్ మోడల్. టి-రోక్ ఎంక్యూబి A0 ఇన్ ప్లాట్‌ఫామ్‌లో భాగంగా ఉంది. ఎట్టకేలకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వోక్స్ వ్యాగన్ టి-రాక్ ఇండియాలో అడుగుపెట్టింది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. త్వరలో ఈ వాహనాల డెలివరీలు కూడా చేయబడతాయి.

Most Read Articles

English summary
Volkswagen T-Roc SUV Launched In India At Rs 19.99 Lakh: Will Rival The Jeep Compass. Read in Telugu.
Story first published: Wednesday, March 18, 2020, 15:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X