ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ బుకింగ్స్ నిలిపివేత; అప్పుడే అన్నీ అమ్ముడైపోయాయ్!

ఫోక్స్‌వ్యాగన్ ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న 'టి-రాక్' ఎస్‌యూవీకి బుకింగ్‌లు స్వీకరించడాన్ని నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ మోడల్‌కు మార్కెట్ నుండి అనూహ్య స్పందన రావటంతో ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ ఎస్‌యూవీ ప్రస్తుత బ్యాచ్ మొత్తం పూర్తిగా అమ్ముడైపోయిందని కంపెనీ తెలిపింది.

ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ బుకింగ్స్ నిలిపివేత; అప్పుడే అన్నీ అమ్ముడైపోయాయ్!

ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ ఎస్‌యూవీని ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రీమియం మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో విడుదలైన టి-రాక్ ధర రూ.19.99 లక్షలు ఎక్స్-షోరూమ్, ఇండియా ఉంది.

ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ బుకింగ్స్ నిలిపివేత; అప్పుడే అన్నీ అమ్ముడైపోయాయ్!

ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ కోసం డెలివరీలు ఈ ఏడాది ప్రారంభంలోనే స్టార్ట్ కావాల్సి ఉంది, అయితే, కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఇది ఆలస్యం అయింది. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పరిమితులను సడలించిన నేపథ్యంలో, ఈ ఎస్‌యూవీ పూర్తిగా అమ్ముడైందని కంపెనీ ప్రకటించింది.

MOST READ:స్కోడా రాపిడ్ టిఎస్ఐ మోంటే కార్లో ఎడిషన్ రోడ్ టెస్ట్ రివ్యూ.. వచ్చేసింది

ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ బుకింగ్స్ నిలిపివేత; అప్పుడే అన్నీ అమ్ముడైపోయాయ్!

ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ ఎస్‌యూవీని బ్రాండ్ యొక్క పాపులర్ ఎమ్‌క్యూబి ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. ఈ మోడల్‌ను భారత మార్కెట్లోకి సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్‌లో అందిస్తున్నారు. అంటే ఈ కారును పూర్తిగా విదేశాల్లో తయారు చేసి, ఇక్కడి మార్కెట్‌కు దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నారు.

ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ బుకింగ్స్ నిలిపివేత; అప్పుడే అన్నీ అమ్ముడైపోయాయ్!

ఈ ఎస్‌యూవీని ఒకే ఒక వేరియంట్‌లో మాత్రమే అందిస్తున్నారు. ఇది ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో లభిస్తుంది. ఇందులో ఆల్ ఎల్‌ఈడీ లైట్లు, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, పానోరమిక్ సన్‌రూఫ్, స్టైలిష్ డ్యూయెల్-టోన్ అల్లాయ్ వీల్స్, లెదర్ అప్‌హోలెస్ట్రీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లున్నాయి.

MOST READ:కొత్త కారు కొన్న సన్నీలియోన్ : ఈ కార్ రేటెంతో ఎంతో తెలుసా ?

ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ బుకింగ్స్ నిలిపివేత; అప్పుడే అన్నీ అమ్ముడైపోయాయ్!

ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో సరికొత్త 1.5-లీటర్ టిఎస్ఐ ఇవో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ బిఎస్6 నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. ఇది గరిష్టంగా 147 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ బుకింగ్స్ నిలిపివేత; అప్పుడే అన్నీ అమ్ముడైపోయాయ్!

ఈ విషయంపై ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా డైరెక్టర్ స్టెఫెన్ నాప్ మాట్లాడుతూ, "మా ప్రోడక్ట్ లైనప్‌లోని టి-రాక్ మరియు టిగువాన్ ఆల్‌స్పేస్ మోడళ్లకు మార్కెట్ నుండి లభిస్తున్న స్పందన చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఎస్‌యూవీల విషయంలో మా వ్యూహంపై కస్టమర్ అంగీకారానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. ఈ వేగాన్ని ఇలానే కొనసాగిస్తూ, మా తదుపరి పెద్ద ఎస్‌యూవీ - ఫోక్స్‌వ్యాగన్ టైగన్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామ"ని అన్నారు.

MOST READ:ఇష్టమైన కారుని విరాళంగా ఇచ్చిన ప్రముఖ నటుడు జాన్ అబ్రహం.. ఎందుకో తెలుసా?

ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ బుకింగ్స్ నిలిపివేత; అప్పుడే అన్నీ అమ్ముడైపోయాయ్!

అంతేకాకుండా, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ప్రీమియం ఎస్‌యూవీని 2021లో భారత మార్కెట్లో విడుదల చేస్తామని, ఇది కస్టమర్లకు జర్మన్ ఇంజనీరింగ్ అద్భుతాన్ని మరియు ఫోక్స్‌వ్యాగన్ యొక్క టిఎస్ఐ టెక్నాలజీల కలయికను అందిస్తుందని ఆయన అన్నారు. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ శక్తివంతమైన పనితీరుతో మెరుగైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుందని చెప్పారు.

ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ బుకింగ్స్ నిలిపివేత; అప్పుడే అన్నీ అమ్ముడైపోయాయ్!

ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ బుకింగ్స్ నిలిపివేతపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ప్రస్తుతం టి-రాక్ మోడల్‌ని విదేశాల నుండి దిగుమతి చేసుకోవటం మరియు ప్రస్తుత పరిస్థితులు దిగుమతులు అంత సానుకూలంగా లేకపోవటం వంటి కారణాల దృష్ట్యా దేశంలో ఈ మోడల్ బుకింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. టి-రాక్ భారత్‌లో విడుదలైన అతికొద్ది రోజుల్లోనే మంచి ప్రజాదరణను సొంతం చేసుకుంది.

MOST READ:వైద్య వృత్తిని విడిచిపెట్టి ఆటో డ్రైవర్‌గా మారిన గవర్నమెంట్ డాక్టర్, ఎందుకో తెలుసా ?

Most Read Articles

English summary
Volkswagen India has announced that they have stopped accepting bookings for their T-Roc SUV in India. The company has announced that the current batch of the T-Roc SUV has been sold out, following a positive response in the market. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X