ఇండియన్ మార్కెట్లో టి-రాక్ ఎస్‌యువి ని ఆవిష్కరించిన వోక్స్ వ్యాగన్

జర్మన్ కార్ల తయారీ సంస్థ అయిన వోక్స్ వ్యాగన్ 2020 ఆటో ఎక్స్‌పోలో తన బ్రాండ్ నుంచి టి-రాక్ క్రాస్ఓవర్ ఎస్యువిని విడుదల చేసింది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

ఇండియన్ మార్కెట్లో టి-రాక్ ఎస్‌యువి ని ఆవిష్కరించిన వోక్స్ వ్యాగన్

ఇండియన్ మార్కెట్లో ప్రారంభించటానికి ముందే వోక్స్ వ్యాగన్ టి- రాక్ దేశంలోకి ప్రవేశించింది. టి- రాక్ ఎస్‌యువి ని సిబియు (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) గా భారత మార్కెట్లోకి దిగుమతి చేయనున్నారు. ఈ వోక్స్ వ్యాగన్ నుండి భారీ అమ్మకాలను కంపెనీ ఆశించడం లేదు.

ఇండియన్ మార్కెట్లో టి-రాక్ ఎస్‌యువి ని ఆవిష్కరించిన వోక్స్ వ్యాగన్

సెగ్మెంట్‌లోని ఇతర ప్రత్యర్థులతో పోల్చితే టి-రోక్‌ను ప్రీమియంతో ధర నిర్ణయించవచ్చని సంస్థ భావిస్తోంది. దాదాపుగా దేనిని రూ. 20 లక్షల ధరతో ఈ ఎస్‌యూవీని ప్రవేశపెట్టడానికి కంపెనీ కృషి చేస్తోంది. ప్రస్తుతం ఇది కంపాస్ జీప్ కంటే చౌకైనదిగా ఉంది.

ఇండియన్ మార్కెట్లో టి-రాక్ ఎస్‌యువి ని ఆవిష్కరించిన వోక్స్ వ్యాగన్

వోక్స్ వ్యాగన్ టి- రాక్ ని భారతీయ మార్కెట్లో ఒక సారి ప్రవేశపెట్టిన తరువాత అత్యంత పోటీ ఉన్న మిడ్ సైజ్ విభాగంలో ఉంచబడుతుంది. ఈ మిడ్ సైజ్ విభాగంలో ఎంజి హెక్టర్, జీప్ కంపాస్, కియా సెల్టోస్ మరియు ఇటీవల ఆవిష్కరించిన 2020 హ్యుందాయ్ క్రెటా వంటి ప్రత్యర్థులు ఉన్నారు.

ఇండియన్ మార్కెట్లో టి-రాక్ ఎస్‌యువి ని ఆవిష్కరించిన వోక్స్ వ్యాగన్

సిబియు దిగుమతి కావడంతో, వోక్స్వ్యాగన్ టి-రాక్ యొక్క ఒకే ఒక్క వేరియంట్‌ను కూడా తీసుకురావాలని ఆశిస్తారు. ఇది ఫ్రీమియం ఫీచర్స్, కనెక్టెడ్ టెక్ మరియు భద్రతా పరికరాలైన ఎయిర్ బ్యాగ్స్ వంటి వాటిని కూడా కలిగి ఉంటుంది.

ఇండియన్ మార్కెట్లో టి-రాక్ ఎస్‌యువి ని ఆవిష్కరించిన వోక్స్ వ్యాగన్

వోక్స్ వ్యాగన్ టి- రాక్ లో 1.5 లీటర్ టిఎస్‌ఐ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 7 స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడుతుంది. వోక్స్ వ్యాగన్ ఇంకా టి-రాక్ యొక్క పవర్ మరియు టార్క్ గణాంకాలను అధికారికంగా ప్రకటించలేదు.

ఇండియన్ మార్కెట్లో టి-రాక్ ఎస్‌యువి ని ఆవిష్కరించిన వోక్స్ వ్యాగన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

జర్మన్ బ్రాండ్ భారతీయ మార్కెట్లోకి తీసుకురావడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోడల్స్ లో వోక్స్ వ్యాగన్ టి- రాక్ ఒకటి. భవిష్యత్ లో వోక్స్ వ్యాగన్ నుంచి ఇతర కొత్త మోడల్స్ ని కూడా ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని సంస్థ యోచిస్తోంది.

Most Read Articles

English summary
Auto Expo 2020: Volkswagen T-Roc SUV Unveiled - Expected Launch Date, Specs, Features, Images & More. Read in Telugu.
Story first published: Thursday, February 6, 2020, 18:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X