Just In
- 2 hrs ago
525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- 2 hrs ago
45 లీటర్ల ఇంధన ట్యాంక్‌లో 48 లీటర్ల పెట్రోల్.. దీనితో మొదలైన గొడవ.. చివరికి ఏమైందంటే
- 4 hrs ago
సూపర్ సోకో నుండి మూడు సరికొత్త ఎలక్ట్రిక్ టూవీలర్స్
- 4 hrs ago
చెన్నైలో కొత్త డీలర్షిప్ ప్రారంభించిన వోల్వో.. పూర్తి వివరాలు
Don't Miss
- News
భారత్‌లో రెండో రోజూ భారీగా పెరిగిన కరోనా కేసులు: 16వేలకు పైగానే, మరణాలు పెరిగాయి
- Sports
రెండు రోజుల్లోనే 22 టెస్టులు పూర్తి.. ఇంగ్లండ్ జట్టుదే ఆధిపత్యం!! భారత్ ఎన్నిసార్లంటే?
- Movies
మహేశ్‌కు మళ్లీ కథ చెప్పిన సక్సెస్ఫుల్ డైరెక్టర్: ఈ సారి మరో ప్రయోగం అంటూ రిప్లై
- Finance
గుడ్‌న్యూస్, 30,000 మందికి క్యాప్‌జెమిని ఉద్యోగాలు! ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్‌కు అవకాశం
- Lifestyle
ఈ 4 రాశుల వారికి లీడర్ షిప్ క్వాలిటీస్ ఉండవు... ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
త్వరలో భారత్‌కు రానున్న ఫోక్స్‌వ్యాగన్ టైగన్; వెబ్‌సైట్‌లో లిస్టింగ్!
ఫోక్స్‌వ్యాగన్ ఇండియా, త్వరలోనే దేశీయ విపణిలో ఓ సరికొత్త ఎస్‌యూవీని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ఫోక్స్‌వ్యాగన్ తమ అధికారిక ఇండియన్ వెబ్‌సైట్‌లో కొత్త మోడల్‌ను అప్‌డేట్ చేసింది. అంతర్జాతీయ మార్కెట్లలో అత్యంత పాపులర్ అయిన సరికొత్త ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీని కంపెనీ భారత్‌లో విడుదల చేయనుంది.

ఫోక్స్‌వ్యాగన్ ఇండియా, తమ టైగన్ ఎస్‌యూవీని తొలిసారిగా ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచింది. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఈ బ్రాండ్ యొక్క ఎమ్‌క్యూబి ఏ0 ఐఎన్ ప్లాట్‌ఫామ్‌లో భాగంగా ఉంటుంది మరియు దీని నిర్మాణం చాలా వరకూ స్థానికంగానే ఉంటుంది.

టైగన్ ఉత్పాదక వ్యయాన్ని తగ్గించి, అందుబాటు ధరలో విడుదల చేసేందుకు గానూ కంపెనీ ఈ మోడల్‌ను భారత మార్కెట్లో అసెంబ్లింగ్ చేయనుంది. ఇందులో లోకలైజేషన్ స్థాయిని కూడా పెంచనుంది. ఫోక్స్‌వ్యాగన్ ఇప్పుడు తాజాగా తమ అధికారిక భారతీయ వెబ్‌సైట్‌ను అప్‌డేట్ చేయటాన్ని చూస్తుంటే, కంపెనీ త్వరలోనే ఈ ఎస్‌యూవీని భారత్‌లో విడుదల చేయవచ్చని తెలుస్తోంది.
MOST READ:ఎఫ్ 1 రేసులో 7 వ ప్రపంచ రికార్డ్ సొంతం చేసుకున్న హామిల్టన్ ; వివరాలు

ఫోక్స్‌వ్యాగన్ ఇండియా, టైగన్ మోడల్ విడుదలకు సంబంధించి ఓ ఖచ్చితమైన కాలమానాన్ని ప్రకటించకపోయినప్పటికీ, ఈ ఏడాది చివరి నాటికి కానీ లేదా వచ్చే ఏడాది ఆరంభంలో కానీ ఈ ఎస్‌యూవీ భారత మార్కెట్లో విక్రయించబడుతుందని తెలుస్తోంది.

డిజైన్ పరంగా చూసుకుంటే, కొత్త ఫోక్స్‌వ్యాగన్ టైగన్‌లో ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్‍లతో కూడిన ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, క్రోమ్‌తో ఫినిష్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్, 17ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడి స్ట్రిప్ ద్వారా కనెక్ట్ చేయబడిన ఎల్ఈడి టెయిల్ లైట్స్, రూఫ్ స్టాప్ ల్యాంప్, సిల్వర్-ఫినిష్డ్ రూఫ్ రైల్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, బంపర్‌లపై సిల్వర్ ఎలిమెంట్స్ మరియు ముందు, వెనుక రెండు వైపులా ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌లతో కూడిన స్పాయిలర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
MOST READ:రోడ్డెక్కనున్న కొత్త డబుల్ డెక్కర్ బస్సులు.. ఎక్కడో తెలుసా..!

అలాగే, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఇంటీరియర్స్‌ను గమనిస్తే, ఇందులో బ్రాండ్ యొక్క లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీతో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటుగా అనేక ఇతర ఫీచర్లు మరియు పరికరాలు ఇందులో లభిస్తాయి. ఈ ఎస్‌యూవీలో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, వైర్‌లెస్ ఛార్జింగ్, స్పోర్టీ ఆల్-బ్లాక్ క్యాబిన్, సాఫ్ట్-టచ్ మెటీరియల్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

ఇక ఇంజన్ విషయానికి వస్తే, కొత్త ఫోక్స్‌వ్యాగన్ టైగన్ బ్రాండ్ యొక్క టిఎస్ఐ శ్రేణి పెట్రోల్ ఇంజన్లను కలిగి ఉంటుంది. ఇదే ఇంజన్లను ఇతర మోడళ్లలో కూడా ఉపయోగిస్తున్నారు. టైగన్ ఎస్‌యూవీలో 1.5-లీటర్ టిఎస్‌ఐ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చనున్నట్లు సమాచారం. ఇది సిక్స్-స్పీడ్ మాన్యువల్ లేదా సెవన్-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది.
MOST READ:మీకు తెలుసా.. అత్యంత ఖరీదైన తెలుగు హీరోల కార్లు, వాటి వివరాలు

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో విడుదల కానుంది. ఇది ఈ విభాగంలో ఇప్పటికే పాపులర్ అయిన హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, నిస్సాన్ కిక్స్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. అయితే, ధర పరంగా ఫోక్స్‌వ్యాగన్ టైగన్ పైన తెలిపిన మోడళ్లతో ఏ విధంగా పోటీ పడుతుందనేది ఆసక్తికరంగా మారింది.