2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించనున్న వోక్స్‌వ్యాగన్ టైగన్

ఆటో ఎక్స్‌పో 2020 కి కొద్ది రోజుల ముందుగానే వోక్స్‌వ్యాగన్ తన కొత్త టైగన్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. కానీ 2020 లో ఫిబ్రవరి 7 నుండి 12 వరకు జరిగే ఆటో ఎక్స్‌పోలో బహిరంగంగా ప్రవేశించనుంది.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించనున్న వోక్స్‌వ్యాగన్ టైగన్

కొత్త వోక్స్‌వ్యాగన్ టైగన్ బ్రాండ్ యొక్క ఎంక్యూబి ఏఓ ఇన్ ప్లాట్‌ఫాంపై ఆధారపడి ఉంటుంది. ఇది ఇండియన్ మార్కెట్ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడింది. ఇది ఈ సంవత్సరం చివరలో అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. వోక్స్‌వ్యాగన్ టైగన్ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో టి-క్రాస్ గా అందుబాటులో ఉంది.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించనున్న వోక్స్‌వ్యాగన్ టైగన్

టైగన్ యొక్క కొలతలు గమనించినట్లయితే పొడవు కొంత ఎక్కువగా ఉంటుంది. యూరోపియన్-స్పెక్ టి-క్రాస్‌తో పోలిస్తే, ఇండియన్ టైగన్ 100 మిమీ వీల్ బేస్, 205 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ ని కలిగి ఉంటుంది. టైగన్ లో క్యాబిన్ విశాలంగా ఉంటుంది. ముందు మరియు వెనుక ప్రయాణించే వారికి చాల అనుకూలంగా కూడా ఉంటుంది. లగేజ్ స్పేస్ కూడా విశాలంగా ఉంటుంది.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించనున్న వోక్స్‌వ్యాగన్ టైగన్

వోక్స్‌వ్యాగన్ టైగన్ లో సొగసైన ఎల్‌ఇడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లు, వెనుకవైపు ఎల్‌ఇడి టైల్లైట్స్, ఎల్‌ఇడి లైట్ బీమ్ బూట్ వంటివి ఉంటాయి. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ కూడా ఉంటాయి.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించనున్న వోక్స్‌వ్యాగన్ టైగన్

వోక్స్‌వ్యాగన్ టైగన్ భారతదేశంలో ప్రవేశపెట్టిన మొదటి ఉత్పత్తులలో ఒకటి. భవిష్యత్ ఎస్‌యూవిలు కూడా ఎంక్యూబి ఏఓ ఇన్ ప్లాట్‌ఫాంపై ఆధారపడి ఉంటాయి. వీటిలో స్కోడా ఎస్‌యూవి సమర్పణలు కూడా ఉంటాయి.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించనున్న వోక్స్‌వ్యాగన్ టైగన్

టైగన్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలోకి ప్రవేశించిన వోక్స్‌వ్యాగన్ బ్రాండ్ యొక్క మొదటి ఉత్పత్తి. ప్రస్తుతం దీనికి మార్కెట్లో చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. వోక్స్‌వ్యాగన్ టైగన్‌కు 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ని కలిగి ఉంటుంది. ఇది130 బిహెచ్‌పి గరిష్ట పవర్ అవుట్ఫుట్ ని అందిస్తుంది.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించనున్న వోక్స్‌వ్యాగన్ టైగన్

వోక్స్‌వ్యాగన్ టైగన్ ఇప్పుడు కొత్త వాహనాల శ్రేణిలో ప్రవేశించడంతోపాటు, ఇండియన్ మార్కెట్లో తన ఉనికిని విస్తరించే పనిలో ఉంది. ఇప్పుడు ఇండియా మొత్తం అనేక డీలర్షిప్లను ఏర్పాటు చేస్తోంది.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించనున్న వోక్స్‌వ్యాగన్ టైగన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఆటో ఎక్స్‌పో 2020 కంటే కొద్ది రోజుల ముందే వోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవి భారత మార్కెట్లోకి ప్రవేశించింది. దేశంలో అత్యంత పోటీతత్వ మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో వోక్స్‌వ్యాగన్ బ్రాండ్ యొక్క మొదటి ప్రయత్నం టైగన్. భారతదేశంలో ప్రారంభించిన తర్వాత, వోక్స్‌వ్యాగన్ టైగన్, కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా మరియు టాటా హారియర్ వంటి వాటికి ధరలో పోటీని ఇవ్వడమే కాకుండా కాకుండా, వీటికి మార్కెట్లో సరైన ప్రత్యర్థిగా కూడా ఉంటుంది.

Most Read Articles

English summary
Volkswagen Taigun SUV Unveiled Ahead Of Auto Expo 2020: Will Rival The Kia Seltos & Hyundai Creta. Read in Telugu.
Story first published: Tuesday, February 4, 2020, 18:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X