టెస్టింగ్ దశలో ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ బిఎస్6, త్వరలో విడుదల

ప్రస్తుతం మార్కెట్లో బిఎస్6 వాహనాల హవా కొనసాగుతోంది. తాజాగా.. జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ కూడా దేశీయ విపణిలో విక్రయిస్తున్న వాహనాల్లో బిఎస్6 వెర్షన్లను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగానే కంపెనీ అందిస్తున్న పస్సాట్ మోడల్‌లో కూడా బిఎస్6 వెర్షన్‌ను కంపెనీ టెస్ట్ చేస్తోంది. మహారాష్ట్ర వీధుల్లో టెస్టింగ్ దశలో ఉన్న 2020 ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ బిఎస్6 ప్రీమియం సెడాన్ ఫొటోలు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి.

టెస్టింగ్ దశలో ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ బిఎస్6, త్వరలో విడుదల

ఈ ఫొటోలను గమనిస్తే.. క్యామోఫ్లేజ్ (కారు వివరాలు కనపడకుండా కప్పి ఉంచడం) లేకుండానే ఫోక్స్‌వ్యాగన్ తమ కొత్త పస్సాట్‌ను టెస్ట్ చేస్తుండడాన్ని గమనించవచ్చు (టెస్టింగ్ చేయబడే వాహనాలకు రెడ్ కలర్ నెంబర్ ప్లేట్ ఉంటుంది). క్యామోఫ్లేజ్ లేకుండా టెస్ట్ చేయటాన్ని చూస్తుంటే అతి త్వరలోనే ఈ మోడల్ మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టెస్టింగ్ దశలో ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ బిఎస్6, త్వరలో విడుదల

గత కొంత కాలంగా ఇండియన్ మార్కెట్ నుంచి అదృశ్యమైన ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ తిరిగి రీ-ఎంట్రీ ఇవ్వనుంది. ఈ కొత్త మోడల్‌లో ఇదివరకటి 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌నే ఉపయోగించనున్నారు. కాకపోతే దానిని బిఎస్6 స్టాండర్డ్స్‌కు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. స్కొడా సూపర్బ్‌లో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 190 బిహెచ్‌పిల శక్తిని, 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ జిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో మాత్రమే లభిస్తుంది, ఇందులో మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ లేదు.

MOST READ: కరోనా నివారణకు ఆటో డ్రైవర్ కొత్త ఐడియా, మీరే చూడండి

టెస్టింగ్ దశలో ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ బిఎస్6, త్వరలో విడుదల

ఇదివరకటి బిఎస్4 మోడల్‌లోని 2.0 లీటర్ టిడిఐ ఇంజన్ గరిష్టంగా 174 బిహెచ్‌పిల శక్తిని, 350 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ డీజిల్ ఇంజన్ 6-స్పీడ్ జిఎస్‌జి గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ డీజిల్ ఇంజన్‌తో పోలిస్తే ప్రస్తుత పెట్రోల్ ఇంజన్ 16 బిహెచ్‌పిల ఎక్కువ శక్తిని మరియు 30 ఎన్ఎమ్‌ల తక్కువ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

టెస్టింగ్ దశలో ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ బిఎస్6, త్వరలో విడుదల

భవిష్యత్తులో ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే విడుదల కానుంది. ఇందులో డీజిల్ వెర్షన్ కొనాలనుకునే కస్టమర్ల కల కలగానే మిగిలే అవకాశం ఉంది. ఫోక్స్‌వ్యాగన్ ఇండియా హెడ్ స్టీఫెన్ నాప్ కూడా ఒకానొక సందర్భంలో ఇందులో.. బహుశా డీజిల్ వేరియంట్ రాకపోవచ్చని వ్యాఖ్యానించారు.

MOST READ: సూపర్‌ఫాస్ట్ ఛార్జర్‌లను ఏర్పాటుచేయడానికి టాటా పవర్‌తో చేతులు కలిపిన ఎంజి మోటార్

టెస్టింగ్ దశలో ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ బిఎస్6, త్వరలో విడుదల

కొత్త 2020 ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ బిఎస్‌6లో డిజైన్ పరంగా కూడా అనేక మార్పులు చేర్పులు ఉండనున్నాయి. సరికొత్త బంపర్స్, కొత్త గ్రిల్ డిజైన్, ఎల్ఈడి మ్యాట్రిక్స్ హెడ్‌ల్యాంప్స్, కొత్త టెయిల్ ల్యాంప్ క్లస్టర్ డిజైన్, బూట్ మొత్తాన్ని కవర్ చేసేలా రీడిజైన్ చేసిన పస్సాట్ లోగో, 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లను మనం ఇందులో చూడొచ్చు.

టెస్టింగ్ దశలో ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ బిఎస్6, త్వరలో విడుదల

ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే.. రీడిజైన్ చేసిన పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, బ్రాండ్ అందించే లేటెస్ట్ కనెక్టివిటీ టెక్నాలజీ వంటి సాంకేతికతతో పాటుగా మరింత లగ్జరీ ఫీల్‌నిచ్చే ఇంటీరియర్ క్యాబిన్‌ను డిజైన్ చేశారు. ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ మార్కెట్లో విడుదలైతే ఇది ఈ సెగ్మెంట్లోని స్కొడా సూపర్బ్, టొయోటా క్యామ్రీ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

MOST READ: ఆటో రిక్షాను కిరాణా షాపుగా మార్చిన ఆటో డ్రైవర్, ఎందుకో తెలుసా ?

టెస్టింగ్ దశలో ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ బిఎస్6, త్వరలో విడుదల

మునపటు ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ బిఎస్4 ధర (29.99 లక్షలు, ఎక్స్-షోరూమ్)తో పోల్చుకుంటే కొత్త బిఎస్6 పస్సాట్ ధర మరింత ఎక్కువగా ఉండొచ్చని అంచనా.

టెస్టింగ్ దశలో ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ బిఎస్6, త్వరలో విడుదల

ఇదిలా ఉంచితే.. ప్రీ ఓన్డ్ కార్లపై ఆసక్తి ఉన్నవారి కోసం వోక్స్‌వ్యాగన్ డస్ వెల్ట్ఆటో 3.0 (Das WeltAuto 3.0) అనే కొత్త ప్రణాళికను ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే. డస్ వెల్ట్ఆటో 3.0లో భాగంగా కస్టమర్లు తమకు కావల్సిన కార్లను కొనుగోలు చేయటం లేదా తమ పాత కార్లను విక్రయించడంలో వోక్స్‌వ్యాగన్ సహకరిస్తుంది. వోక్స్‌వ్యాగన్ డస్ వెల్ట్ఆటో 3.0 కోసం కంపెనీ కొత్త రకం షోరూమ్‌లను ప్రారంభించింది.

టెస్టింగ్ దశలో ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ బిఎస్6, త్వరలో విడుదల

ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ బిఎస్6 పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ప్రస్తుతం భారత మార్కెట్లోని ప్రీమియం సెడాన్ సెగ్మెంట్లో కార్ కంపెనీలకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ బిఎస్6 విడుదలైతే తిరిగి సక్సెస్‌ను సాధించటం ఖాయం. ప్రస్తుతానికి ఇది పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభ్యం కానుంది, ఇందులో డీజిల్ వెర్షన్ వస్తుందా లేదా అనేది వేచి చూడాలి.

Images:Zigwheels

Most Read Articles

English summary
The Volkswagen Passat has been spotted testing in the Indian market. The German automaker had discontinued the Passat in the Indian market as the 2.0-litre diesel engine was made BS6-complaint. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X