Just In
- 11 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్‌డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 12 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 12 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 14 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- Lifestyle
ఆదివారం దినఫలాలు : వ్యాపారులు ఈరోజు తమ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సెకండ్ హ్యాండ్ కార్ సెంటర్లను అప్‌డేట్ చేసిన ఫోక్స్‌వ్యాగన్
జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ భారతదేశంలో ప్రీ-ఓన్డ్ కార్ల కోసం డిజిటల్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ అవుట్లెట్లను ప్రారంభించినట్లు పేర్కొంది. 'దస్ వెల్ట్ఆటో ఎక్సలెన్స్ సెంటర్స్' అని పిలువబడే ఈ అవుట్‌లెట్లు కోయంబత్తూర్, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చిన్ మరియు త్రిస్సూర్ వంటి వివిధ నగరాల్లో ఉన్నాయి.

సర్టిఫైడ్ ప్రీ-ఓన్డ్ కార్లను కొనడానికి, అమ్మడానికి లేదా మార్పిడి (ఎక్సేంజ్) చేయడానికి వన్-స్టాప్ పరిష్కారాన్ని మరింత బలోపేతం చేయడాన్ని ఫోక్స్‌వ్యాగన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్ నుండి ఉపయోగించిన వాహనాన్ని (యూజ్డ్ కారుని) కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు ప్రత్యేకమైన మరియు కస్టమైజ్డ్ సేవలను కంపెనీ అందిస్తోంది.

ఈ కేంద్రాలలో బ్రాండ్ అందించే మొత్తం ఫీచర్లను నుండి వినియోగదారులు ప్రొఫెషనల్ కార్ ఎవాల్యూయేషన్, స్పెషల్ ఫైనాన్స్ ఆఫర్, ప్రత్యేకమైన యాక్ససరీ ప్యాకేజీలు మరియు ఇబ్బంది లేని వాహన బదిలీ వంటి సేవలను పొందవచ్చు.
MOST READ:మరో వాహనాన్ని కాఫీ కొట్టిన చైనా కంపెనీ.. ఈ సారి ఏ వాహనంలో తెలుసా ?

డిడబ్ల్యూఏ కేంద్రాలు సున్నితమైన, పారదర్శక మరియు సురక్షితమైన అనుభవం కోసం మల్టీ-బ్రాండ్ ప్రీ-ఓన్డ్ కార్ల కొనుగోలు, అమ్మకం లేదా మార్పిడిని అందిస్తాయి. యూజ్డ్ కార్లను సమగ్రంగా తనిఖీ చేసిన తర్వాత, పోటీతత్వ ధరలతో కంపెనీ విక్రయిస్తోంది.

కస్టమర్ల నుండి డిడబ్ల్యూఏ కేంద్రాలు కొనుగోలు చేసే ప్రతి యూజ్డ్ కారును సమగ్రంగా 160-పాయింట్ల చెక్‌లిస్ట్‌తో తనిఖీ చేస్తారు. థర్డ్ పార్టీ ఇన్స్పెక్టర్ ద్వారా తనిఖీని విజయవంతంగా పూర్తి చేసిన తరువాత, ఈ కార్లు బ్రాండ్ ద్వారా ధృవీకరించబడతాయి.
MOST READ:దుమ్మురేపుతున్న ఫార్చ్యూనర్ లెజెండరీ ఎస్యూవీ ఆఫ్ రోడ్ పెర్ఫార్మెన్స్ వీడియో

ఫోక్స్‌వ్యాగన్‌కు భారతదేశం అంతటా 105కి పైగా డిడబ్ల్యూఏ కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆర్థిక సంవ్సరంలో (2020-21లో) 17 కొత్త డిడబ్ల్యూఏ ఎక్సలెన్స్ సెంటర్లను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. ఇబ్బందులు లేని మరియు కాంటాక్ట్‌లెస్ అనుభవం కోసం ఈ బ్రాండ్ డిడబ్ల్యూఏ ఎక్సలెన్స్ సెంటర్‌లో డిజిటలైజేషన్‌ను ప్రక్రియను కూడా ప్రారంభించింది.

భావి కొనుగోలుదారులు బ్రాండ్ అందించే పూర్తి డిజిటల్ అనుభవాన్ని అన్వేషించవచ్చు. దస్ వెల్ట్ఆటో వాల్యుయేటర్ యాప్ ద్వారా కస్టమర్లు తమ కారు విలువని స్వయంగా లెక్కించుకోవచ్చు. డిడబ్ల్యూఏ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ కొనుగోలు లేదా అమ్మకం కూడా ఉంటుంది. ఇది ప్రత్యేకమైన మొబైల్ యాప్ ‘ఇండియన్ బ్లూ బుక్' ఇచ్చిన అల్గారిథంల ఆధారంగా వేగంగా మరియు పారదర్శక వాహన విలువల తెలియజేస్తుంది.

ఈ ప్రణాళిక గురించి ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా డైరెక్టర్ మిస్టర్ స్టెఫెన్ నాప్ మాట్లాడుతూ, "కస్టమర్ అనుభవం మా బ్రాండ్ ఫిలాసఫీలో ప్రధానమైనది మరియు డిడబ్ల్యూఏ ఎక్సలెన్స్ సెంటర్‌ను ప్రవేశపెట్టడంతో, ప్రీ-ఓన్డ్ కార్ల విభాగంలో మేము ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న కాలానికి అనుగుణంగా ఉంటామని నమ్ముతున్నాము. అనుకూలీకరించిన సేవలను అందించడం ద్వారా ప్రీ-ఓన్డ్ కార్లను కొనుగోలు చేయడం, అమ్మడం లేదా మార్పిడి చేసే ప్రక్రియను అప్రయత్నంగా మరియు ఇబ్బంది లేకుండా చేయడం ద్వారా వినియోగదారులకు మనశ్శాంతిని అందించడంమే మా ప్రధాన లక్ష్యం" అని చెప్పారు.

డిడబ్ల్యూఏ ఎక్సలెన్స్ సెంటర్‌లు తమ బ్రాండ్ ఫిలాసఫీకి కట్టుబడి, ఫోక్స్‌వ్యాగన్ యొక్క 10 పిల్లర్ సర్వీస్‌పై నిర్మించబడింది. ఇందులో ప్రొఫెషనల్ కన్సల్టేషన్, డిడబ్ల్యూఏ రిలేషన్‌షిప్ మేనేజర్ ద్వారా నిపుణుల సలహా, రోడ్-సైడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్, టెస్ట్ డ్రైవ్, వెహికల్ కస్టమైజేషన్ మరియు యాజమాన్య వ్యవధిలో సర్వీస్ సపోర్ట్ మొదలైన సేవలు ఉంటాయి.

ఫోక్స్‌వ్యాగన్ తమ ప్రీ-ఓన్డ్ కార్ బిజినెస్ సెంటర్లను అప్‌డేట్ చేయటంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
దేశంలో కోవిడ్-19 వ్యాప్తి తర్వాత మార్కెట్లో ప్రీ-ఓన్డ్ కార్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్ నుండి ప్రీ-ఓన్డ్ కార్లను కొనుగోలు చేసేటప్పుడు భారతీయ కొనుగోలుదారులకు ఇబ్బందులు లేని అనుభవాన్ని అందించే దిశగా ఫోక్స్‌వ్యాగన్ ప్రయత్నాలు చేస్తోంది.