భారీగా తగ్గిన వోల్వో ఎక్స్‌సి టి4 ఆర్-డిజైన్ పెట్రోల్ వేరియంట్ ధర - వివరాలు

స్వీడిష్ కార్ కంపెనీ వోల్వో, భారత లగ్జరీ కార్ మార్కెట్లో విక్రయిస్తున్న సరికొత్త ఎక్స్‌సి 40 టి 4 ఆర్-డిజైన్ పెట్రోల్‌ వేరియంట్ ధరను భారీగా తగ్గించింది. వోల్వో ఇండియా గడచిన 2019 డిసెంబర్‌లో తమ సరికొత్త ఎక్స్‌సి 40 టి 4 ఆర్-డిజైన్ పెట్రోల్‌ను దేశీయ విపణిలో విడుదల చేసింది.

భారీగా తగ్గిన వోల్వో ఎక్స్‌సి టి4 ఆర్-డిజైన్ పెట్రోల్ వేరియంట్ ధర - వివరాలు

అప్పట్లో ఈ మోడల్ ప్రారంభ ధర రూ.39.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉండేది. అయితే, వోల్వో ఇండియా అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, కంపెనీ తమ వోల్వో ఎక్స్‌సి 40 ధరలను రూ.3 లక్షల వరకూ తగ్గించింది. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందే కంపెనీ ఈ కారు ధరను తగ్గించింది.

భారీగా తగ్గిన వోల్వో ఎక్స్‌సి టి4 ఆర్-డిజైన్ పెట్రోల్ వేరియంట్ ధర - వివరాలు

ఆల్-న్యూ వోల్వో ఎక్స్‌సి 40 వోల్వో ఇండియా నుంచి దేశీయ మార్కెట్లో లభిస్తున్న ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ. ఎంట్రీ లెవల్ విభాగంలో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తున్న ఈ మోడల్ తాజా ధర తగ్గింపు తర్వాత ఇప్పుడు రూ.36.90 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా)కు లభిస్తోంది. వోల్వో ఎక్స్‌సి 40 టి4 ఆర్-డిజైన్ పెట్రోల్‌పై ధర తగ్గింపునే కాకుండా కంపెనీ రూ.1 లక్ష విలువైన యాక్ససరీలను కూడా అందిస్తోంది.

భారీగా తగ్గిన వోల్వో ఎక్స్‌సి టి4 ఆర్-డిజైన్ పెట్రోల్ వేరియంట్ ధర - వివరాలు

వోల్వో ఎక్స్‌సి 40 టి4 ఆర్-డిజైన్ పెట్రోల్ డిజైన్ విషయానికి వస్తే, ఇది మంచి స్పోర్టీ ఎస్‌యూవీలా కనిపిస్తుంది. బయటి వైపు ఈ ఎస్‌యూవీలో ప్రత్యేకమైన టెయిల్ లాంప్ డిజైన్, టూ-టోన్ ఎక్స్‌టీరియర్స్, పెద్ద వీల్ ఆర్చెస్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, పానోరమిక్ సన్‌రూఫ్ మరియు ఎలక్ట్రానిక్ టెయిల్‌గేట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది మొత్తం ఆరు వేర్వేరు రంగులలో లభిస్తుంది. అవి - క్రిస్టల్ వైట్ పెరల్, బర్స్టింగ్ బ్లూ, గ్లాసీయర్ సిల్వర్, ఒనిక్స్ బ్లాక్, థండర్ గ్రే మరియు ఫ్యూజన్ రెడ్.

భారీగా తగ్గిన వోల్వో ఎక్స్‌సి టి4 ఆర్-డిజైన్ పెట్రోల్ వేరియంట్ ధర - వివరాలు

కొత్త వోల్వో ఎక్స్‌సి 40 టి4 ఆర్-డిజైన్ ఇంటీరియర్ ఫీచర్స్‌ని గమనిస్తే, క్యాబిన్ లోపల అల్యూమినియం ఇన్సెర్ట్‌లు, డ్యూయెల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 12.3 ఇంచ్ ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోకు అనుకూలమైన 9.0 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

భారీగా తగ్గిన వోల్వో ఎక్స్‌సి టి4 ఆర్-డిజైన్ పెట్రోల్ వేరియంట్ ధర - వివరాలు

ఈ కారులో బెస్ట్ ఇన్ క్లాస్ సేఫ్టీ ఫీచర్లతో వోల్వో ఎక్స్‌సి 40 టి4 ఆర్-డిజైన్‌ను కంపెనీ అందిస్తోంది. ఇందులో రాడార్ ఆధారిత యాక్టివ్ సేఫ్టీ, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ మిటిగేషన్, రన్-ఆఫ్ రోడ్ ప్రొటెక్షన్, రోల్ స్టెబిలిటీ కంట్రోల్, డిస్టెన్స్ అలెర్ట్, ఫ్రంట్ అండ్ రియర్ వెనుక పార్కింగ్ అసిస్ట్, స్టిల్ బాడీ కేజ్ మరియు ఏడు ఎయిర్‌బ్యాగులు ఉన్నాయి.

భారీగా తగ్గిన వోల్వో ఎక్స్‌సి టి4 ఆర్-డిజైన్ పెట్రోల్ వేరియంట్ ధర - వివరాలు

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త వోల్వో ఎక్స్‌సి 40 ఎస్‌యూవీలో బిఎస్6 కంప్లైంట్, 2.0-లీటర్, ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 190 బిహెచ్‌పి శక్తిని మరియు 300 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది 8-స్పీడ్ గేర్‌ట్రానిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

భారీగా తగ్గిన వోల్వో ఎక్స్‌సి టి4 ఆర్-డిజైన్ పెట్రోల్ వేరియంట్ ధర - వివరాలు

వోల్వో ఎక్స్‌సి 40 టి4 ఆర్-డిజైన్ ధర తగ్గింపుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

వోల్వో కార్లంటేనే సేఫ్టీకి పెట్టింది పేరు, ఈ కారులో బెస్ట్ ఇన్ క్లాస్ సేఫ్టీ ఫీచర్లను అందిస్తున్నారు. వోల్వో ఎక్స్‌సి 40 టి4 ఆర్-డిజైన్ ఈ విభాగంలో ఇతర కార్లతో పోలిస్తే చాలా భిన్నంగా కనిపిస్తుంది. ఇది భారత మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1, మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఏ, ఆడి క్యూ3 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, August 17, 2020, 11:50 [IST]
English summary
Volvo India launched the all-new XC40 T4 R-Design Petrol in India in December 2019. At the time of the launch, the new XC40 carried a price tag of Rs 39.90 lakh (ex-showroom, India). Read in Telugu.
Read more on: #వోల్వో #volvo
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+