Just In
- 10 hrs ago
ల్యాండ్ రోవర్‌పై ప్రేమ; అంతిమ యాత్రకు కూడా అదే.. ఇది ఒక రాజు కోరిక
- 11 hrs ago
భారత్‌లో విడుదలైన ఫోక్స్‌వ్యాగన్ కొత్త వేరియంట్; ధర & వివరాలు
- 13 hrs ago
బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160పై చేతులు వదిలేసి వీలీ, వరల్డ్ రికార్డ్ బ్రేక్!
- 14 hrs ago
ఇదే అత్యంత చవకైన హీరో బైక్; ధర కేవలం రూ.49,400 మాత్రమే..!
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : మిధున రాశి వారికి పనిభారం ఎక్కువగా ఉంటుంది...!
- News
కేసీఆర్ మనవడికీ పదవచ్చేదే, కానీ: రవినాయక్ మంచోడంటూ బండి సంజయ్, విజయశాంతి ఫైర్
- Sports
RR vs DC: సిక్స్‌లతో చెలరేగిన రూ.16.25 కోట్ల ఆటగాడు.. రాజస్థాన్ అద్భుత విజయం!
- Finance
భారీగా షాకిచ్చిన పసిడి, రూ.630 పెరిగి రూ.47,000 క్రాస్: వెండి రూ.1100 జంప్
- Movies
కొరటాల శివ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఇదే.. మళ్ళీ అదే తరహాలో..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
డాట్సన్ కార్లపై ఇయర్ ఎండ్ ఆఫర్స్; రూ.51,000 వరకూ డిస్కౌంట్స్
నిస్సాన్‌కి చెందిన బడ్జెట్ కార్ బ్రాండ్ 'డాట్సన్' ఈ ఏడాది ముగింపు సందర్భంగా, డిసెంబర్ 2020 నెలలో తమ మొత్తం ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో డాట్సన్ విక్రయించే మోడల్‌ని బట్టి కంపెనీ రూ.51,000 వరకూ ప్రయోజనాలను అందిస్తోంది.

డాట్సన్ అందిస్తున్న డిసెంబర్ నెల ఆఫర్లలో నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు కార్పోరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి. రెడి-గో, గో మరియు గో ప్లస్ మోడళ్లకు ఇవి వర్తిస్తాయి. కస్టమర్ ఎంచుకునే మోడల్‌ను బట్టి మారుతూ ఉంటాయి. ఈ ఆఫర్లు డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31, 2020 వరకూ చెల్లుబాటులో ఉంటాయి.

డాట్సన్ బ్రాండ్ నుండి లభిస్తున్న ఎంట్రీ లెవల్ మోడల్ డాట్సన్ రెడి-గో హ్యాచ్‌బ్యాక్‌లోని అన్ని వేరియంట్లపై కంపెనీ గరిష్టంగా రూ.45,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.9,000 వరకు నగదు తగ్గింపు, రూ.11,000 వరకూ ఇయర్-ఎండ్ బెనిఫిట్స్, రూ.20,000 ఎక్స్-చేంజ్ బోనస్ మరియు రూ.5,000 కార్పొరేట్ ఆఫర్‌లు కలిసి ఉన్నాయి.
MOST READ:కొత్త విమానంలో ప్రయాణించిన భారత రాష్ట్రపతి ; ఇంతకీ ఈ విమానం ప్రత్యేకత ఏంటో తెలుసా

భారత మార్కెట్లో డాట్సన్ రెడి-గో ధరలు రూ.2.88 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభం అవుతాయి. ఈ ఏడాది ఆరంభంలో రెడి-గోలో ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కంపెనీ విడుదల చేసింది. ఇది మునుపటి కన్నా అదనపు ఫీచర్లు మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇందులో బిఎస్6 కంప్లైంట్ 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 67 బిహెచ్‌పి పవర్‌ను మరియు 91 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది, ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఎఎమ్‌టి గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

డిసెంబర్ 2020లో డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్‌ను కొనుగోలు చేసే కస్టమర్లు రూ.51,000 వరకు విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో రూ.20,000 వరకు నగదు తగ్గింపు, రూ.11,000 వరకూ ఇయర్-ఎండ్ బెనిఫిట్స్ మరియు రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌లు లభిస్తాయి. మార్కెట్లో డాట్సన్ గో ధరలు రూ.3.99 లక్షల నుండి ప్రారంభమవుతాయి. ఆటోమేటిక్ వేరియంట్ ధరలు రూ.6.25 లక్షల నుండి ప్రారంభమవుతాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
MOST READ:మత్తులో చేసిన పనికి మత్తు దిగేలా గుణపాఠం చెప్పిన పోలీసులు.. ఎక్కడో తెలుసా ?

ఈ కారులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 76 బిహెచ్‌పి పవర్‌ను మరియు 104 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది, ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది భారత్‌లో లభిస్తున్న అత్యంత చవకైన ఆటోమేటిక్ కారు. ఈ విభాగంలో ఇది టాటా టియోగో, మారుతి సుజుకి స్విఫ్ట్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

డాట్సన్ బ్రాండ్ యొక్క ఫ్లాగ్‌షిప్ మోడల్ మరియు కాంపాక్ట్ ఎమ్‌పివి అయిన డాట్సన్ గో ప్లస్ మోడల్‌పై ఈ డిసెంబర్ నెలలో గరిష్టంగా రూ.46,000 వరకు ప్రయోజనాలను అందిస్తున్నారు. ఇందులో రూ.15,000 వరకు నగదు తగ్గింపు, రూ.11,000 వరకూ ఇయర్-ఎండ్ డిస్కౌంట్స్ మరియు రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కలిసి ఉన్నాయి.
MOST READ:డ్రీమ్ కార్లో కనిపించిన రిషబ్ శెట్టి.. అతని డ్రీమ్ నిజం చేసినది ఎవరో తెలుసా ?

మార్కెట్లో డాట్సన్ గో ప్లస్ ధరలు రూ.4.20 లక్షల నుంచి రూ.6.90 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). గో హ్యాచ్‌బ్యాక్ మాదిరిగానే గో ప్లస్ కాంపాక్ట్ ఎమ్‌పివి కూడా ఒకేరకమైన ఇంజన్, గేర్‌బాక్స్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. మార్కెట్లో ఇది రెనో ట్రైబర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

డాట్సన్ ఇయర్-ఎండ్ ఆఫర్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
డాట్సన్ భారత మార్కెట్లో ప్రవేశించినప్పటి నుండి ఆశించినరీతిలో అమ్మకాలను సాగించలేకపోయింది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ, డాట్సన్ కూడా ఇతర కార్ కంపెనీల మాదిరిగానే ఇయర్ ఎండ్ ఆఫర్లతో కొత్త వినియోగదారులను తనవైపుకు ఆకర్షించుకోవాలని చూస్తోంది.
MOST READ:హిమాలయాల్లో కూడా తన సత్తా చాటుకున్న టాటా నెక్సాన్ [వీడియో]