భారత్‌లో విడుదలైన ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ ; ధర & వివరాలు

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా తన పోర్ట్‌ఫోలియోను భారత మార్కెట్లో విస్తరించడానికి నిరంతరం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగా కంపెనీ ఇప్పుడు తన కొత్త 2021 ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. భారత మార్కెట్లో విడుదలైన ఈ కొత్త ఎస్5 స్పోర్ట్‌బ్యాక్‌ ధర ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ. 79.06 లక్షలు.

భారత్‌లో విడుదలైన ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ ; ధర & వివరాలు

కంపెనీ ఇండియన్ మార్కెట్లో విడుదల చేయడానికి ముందే ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ యొక్క టీజర్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కొత్త 2021 ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ ఎట్టకేలకు మార్కెట్లో విడుదలైంది. కంపెనీ యొక్క 2021 ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్‌ చాలా అప్డేట్స్ కలిగి ఉంది.

భారత్‌లో విడుదలైన ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ ; ధర & వివరాలు

కొత్త 2021 ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ చాలా వరకు అప్డేట్స్ పొందాయి. ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్ యొక్క కొత్త మోడల్ మరింత స్పోర్టి మరియు దూకుడుగా తయారైంది. ఇది ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లను కలిగి ఉంది.

భారత్‌లో విడుదలైన ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ ; ధర & వివరాలు

ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్ 19 ఇంచెస్ 5 ఆర్మ్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉండి, చాలా స్టైలిష్ గా కనిపిస్తాయి. అంతే కాకుండా ఈ కారులో కంపెనీ స్లైడింగ్ రూఫ్‌లైన్‌ను ఉపయోగించింది. ఇందులో బ్లాక్-అవుట్ ORVM కూడా ఉంది. ఫ్రంట్ మాదిరిగానే, కంపెనీ సిగ్నేచర్ కూంబ్ షేప్ గ్రిల్‌ను పియానో ​​బ్లాక్ ఫినిష్‌లో ఎల్‌ఇడి హెడ్‌లైట్ మరియు ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌తో ఇచ్చారు.

భారత్‌లో విడుదలైన ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ ; ధర & వివరాలు

కారు వెనుక భాగంలో స్లిమ్ ఎల్‌ఇడి టైల్ లైట్స్ ఉన్నాయి. ఇవన్నీ కారు యొక్క క్యాబిన్‌కు మరింత ప్రీమియం లుక్ ఇస్తుంది. ఇది మునుపటికంటె ఎక్కువ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండి, చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

భారత్‌లో విడుదలైన ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ ; ధర & వివరాలు

2021 ఆడి ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇది స్పోర్ట్ బ్యాక్ యొక్క బాహ్య రూపకల్పనకు బాగా సరిపోయే ఆల్-బ్లాక్ ట్రీట్మెంట్ ను పొందుతుంది. ఈ కారు డాష్‌బోర్డ్‌లో 10 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. దీనితో పాటు 12.2 ఇంచెస్ డిజిటల్ ఎమ్ఐడి స్క్రీన్ అందించబడుతుంది.

భారత్‌లో విడుదలైన ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ ; ధర & వివరాలు

ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్ లో 3 స్పోక్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ S-బ్యాడ్జ్‌తో వస్తుంది. ఇంకా పనోరమిక్ గ్లాస్ సన్‌రూఫ్ మరియు 3 డి సరౌండ్ సౌండ్‌తో 19 స్పీకర్ సౌండ్ సిస్టమ్‌ వంటి వాటిని కలిగి ఉంటుంది.

భారత్‌లో విడుదలైన ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ ; ధర & వివరాలు

2021 ఆడి ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్ 3.0-లీటర్ వి 6 టిఎఫ్‌ఎస్‌ఐ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 354 బిహెచ్‌పి శక్తిని మరియు 500 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ టిప్ట్రోనిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది, ఇది నాలుగు చక్రాలకు శక్తినిస్తుంది.

భారత్‌లో విడుదలైన ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ ; ధర & వివరాలు

ఇందులో ఉన్న పవర్ పుల్ ఇంజిన్ వల్ల, ఈ కారు కేవలం 5 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిమీ వరకు ప్రయాణిస్తుంది. కానీ కంపెనీ దాని అత్యధిక వేగాన్ని గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఆడి కంపెనీ ఈ కారును సిబియు మార్గం ద్వారా భారత్‌కు తీసుకువస్తుంది.

భారత మార్కెట్లో విడుదలైన ఈ కొత్త 2021 ఆడి ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్, మెర్సిడెస్-ఎఎమ్‌జి జి 43 మరియు బిఎమ్‌డబ్ల్యూ ఎం 340 ఐ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Monday, March 22, 2021, 13:45 [IST]
English summary
2021 Audi S5 Sportback Launched In India. Read in Telugu.
Read more on: #ఆడి #audi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+