భారత మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త Lexus ES300h: ధర & వివరాలు

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ Lexus (లెక్సస్) తన పోర్ట్‌ఫోలియోను కొత్త బేబీ సెడాన్‌తో అప్‌డేట్ చేసింది. కంపెనీ దేశీయ మార్కెట్లో కొత్త Lexus ES300h (లెక్సస్ ఈఎస్300హెచ్) మోడల్ ను విడుదల చేసింది. భారత మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త Lexus ES300h ధర రూ. 56.65 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త Lexus ES300h గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

భారత మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త Lexus ES300h: ధర & వివరాలు

దేశీయ విపణిలో అడుగుపెట్టిన కొత్త Lexus ES300h (లెక్సస్ ఈఎస్300హెచ్) చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. అయితే ఈ కొత్త 2021 లెక్సస్ ES300h యొక్క మొత్తం సిల్హౌట్‌లో ఎటువంటి మార్పు లేదు, మీరు ఇక్కడ గమనించవచ్చు. కానీ కొంత తక్కువ మొత్తంలో మాత్రమే అప్‌డేట్‌లు ఇవ్వబడ్డాయి.

భారత మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త Lexus ES300h: ధర & వివరాలు

Lexus ES300h (లెక్సస్ ఈఎస్300హెచ్) యొక్క డిజైన్ మరియు స్టైలింగ్ కొత్తగా అనిపిస్తుంది. ఈ లగ్జరీ సెడాన్ ముందు భాగంలో, సిగ్నేచర్ స్పిండిల్ ఆకారంలో ఉండే ఫ్రంట్ గ్రిల్ మెష్ నమూనాతో కొద్దిగా సవరించబడింది. ఇందులోని లైట్ క్లస్టర్ ప్రస్తుత తరం మోడల్ కంటే ఎక్కువ ఉంటుంది. అంతే కాకుండా, దాని అల్లాయ్ వీల్స్ డిజైన్ కూడా పూర్తిగా కొత్తది మరియు కంపెనీ దాని అల్లాయ్ వీల్స్ కోసం రెండు కలర్ ఆప్షన్‌లను ప్రవేశపెట్టింది. అవి ఒకటి సోనిక్ ఇరిడియం కాగా మరొకటి సోనిక్ క్రోమ్ కలర్స్.

భారత మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త Lexus ES300h: ధర & వివరాలు

కొత్త 2021 Lexus ES300h (లెక్సస్ ఈఎస్300హెచ్) యొక్క ఇంటీరియర్‌ విషయానికి వస్తే, ఇందులో ఉన్న క్యాబిన్ మునుపటిలానే ఉంచబడింది, అయితే ఇప్పుడు కొత్త వాల్‌నట్ మెటీరియల్ అపోల్స్ట్రే ఉపయోగిస్తుంది. ఈ కారులో రిక్లైనింగ్ మరియు వెంటిలేటెడ్ రియర్ సీట్లు వంటి అనేక ఆధునిక ఫీచర్లను కంపెనీ ఇచ్చింది. మొత్తానికి ఇది చూడటానికి ఆకర్షణీయంగా మరియు వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

భారత మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త Lexus ES300h: ధర & వివరాలు

అంతే కాకుండా ఈ కొత్త లగ్జరీ సెడాన్ లో బ్రేక్ పెడల్ కోసం విస్తరించిన ఉపరితల వైశాల్యం, కిక్ సెన్సార్‌తో పవర్ టెయిల్‌గేట్, 360-డిగ్రీ కెమెరా, 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, 17-స్పీకర్ మార్క్ లెవిన్సన్ సౌండ్ సిస్టమ్ మరియు ఎయిర్ ప్యూరిఫయర్ వంటి ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులోని బోనెట్ వాలుగా ఉంటుంది.

భారత మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త Lexus ES300h: ధర & వివరాలు

కొత్త 2021 Lexus ES300h (లెక్సస్ ఈఎస్300హెచ్) యొక్క ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు లేదు. కావున ఈ సెడాన్ లో దాని పాత 2.5-లీటర్, ఫోర్ సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌ ఉంటుంది. ఇందులో కంపెనీ 16 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ని కూడా ఉపయోగించింది. ఈ ఇంజిన్‌తో పాటు బ్యాటరీ గరిష్టంగా 215 బిహెచ్‌పి పవర్ మరియు 221 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తుంది.

భారత మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త Lexus ES300h: ధర & వివరాలు

Lexus ES300h (లెక్సస్ ఈఎస్300హెచ్) అనేది ఫ్రంట్-వీల్-డ్రైవ్ కారు మరియు ఇది సవిటి గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. కావున మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక్క చెప్పాలంటే ఇది వాహనదారునికి మంచి లగ్జరీ అనుభవాన్ని అందిస్తుంది.

భారత మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త Lexus ES300h: ధర & వివరాలు

భారతదేశంలో విడుదలైన కొత్త Lexus ES300h (లెక్సస్ ఈఎస్300హెచ్) సెడాన్ Toyota Camry (టొయోటా క్యామ్రీ) కి ప్రత్యర్థిగా ఉంటుంది. ఇది దేశీయ మార్కెట్లో రూ. 41.20 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో విక్రయించబడుతోంది. భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త Lexus ES300h ఎలాంటి ఆదరణ పొందుతుంది మరియు ఎలాంటి బుకింగ్స్ పొందుతుంది అనే విషయాలు త్వరలో తెలుస్తాయి.

భారత మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త Lexus ES300h: ధర & వివరాలు

భారతీయ మార్కెట్లో దాదాపు అన్ని వాహనాలకు మంచి డిమాండ్ ఉంది, కావున ఇప్పుడు భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త Lexus ES300h (లెక్సస్ ఈఎస్300హెచ్) కూడా మంచి అమ్మకాలతో ముందుకు సాగే అవకాశం ఉంటుందని మేము భావిస్తున్నాము. భారతీయ మార్కెట్లో లగ్జరీ వాహనాలకు కూడా ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త 'లెక్సస్ ఈఎస్300హెచ్' లగ్జరీ కారు కూడా ఆదరణ పొందుతుంది. ఈ సెడాన్ కలిగి ఉన్న ఫీచర్స్ మరియు పరికరాలన్నీ కూడా కొనుగోలుదారులను తప్పకుండా ఆకర్షిస్తాయి.

ఎప్పటికప్పుడు కొత్త బైకులు మరియు కొత్త కార్లకు సంబందించిన మరింత సమాచారం తెలుసుకోవడానికి మా DriveSpark ఛానల్ ఫాలో అవ్వండి. మీకు నచ్చిన వాహనాలకు సంబందించిన మరింత సమాచారం తెలుసుకోండి.

Most Read Articles

English summary
2021 lexus es300h sedan launched at rs 56 65 lakhs features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X