Just In
- 10 min ago
కారు విలువ 10 లక్షలు.. రిపేర్ ఫీజు 20 లక్షలు; ఇదేంటనుకుంటున్నారా.. ఇది చూడండి
- 1 hr ago
కారు దొంగలించిన తర్వాత ఓనర్‌కే SMS చేసిన దొంగ.. చివరికి ఏమైందంటే?
- 3 hrs ago
కొత్త తరం మెర్సిడెస్ జిఎల్ఏ బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే ఇండియా లాంచ్!
- 3 hrs ago
కరోనా వేళ అందరికోసం 'ఆక్సిజన్ మ్యాన్‌గా' మారిన వ్యక్తి.. ఎక్కడంటే?
Don't Miss
- News
జగన్‌పై రఘురామ బిగ్‌బాంబ్- మీ కేసులకూ వందరోజులే- పిచ్చోళ్లకు నో ఛాన్స్-పది క్యాన్సిల్
- Finance
Gold prices today: బంగారం ధరలు మరింత తగ్గాయి, రూ.48,000 దిగువకు
- Lifestyle
చికెన్ చాప్స్
- Sports
అతినితో అతనికే సమస్య: గవాస్కర్ ఆగ్రహానికి గురైన సంజు శాంసన్: టీమిండియాలో చోటు దక్కదంటూ ఫైర్
- Movies
త్రివిక్రమ్ - మహేష్ కాంబో.. అభిమానులకు చిరాకు తెప్పిస్తున్న మరో సెలక్షన్?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆడి క్యూ 7 లగ్జరీ కార్ కొన్న నటుడు చందు గౌడ
చందు గౌడ అంటే చాలామందికి తెలియకపోవచ్చు, కానీ తెలుగులో త్రినయనీ సీరియల్ మరియు కన్నడలో లక్ష్మీ బారామ్మ సీరియల్ లో నటించిన నటుడు చందు బి గౌడ. ఈ ప్రముఖ సీరియల్ ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇటీవల యితడు లగ్జరీ ఆడి క్యూ 7 కారును కొనుగోలు చేసాడు.

చండుగౌడ కర్ణాటక ప్రాంతానికి చెందినవారైనా కన్నడ భాషా సీరియల్ తో పాటు తెలుగులో కూడా మంచి ఆధారం పొందుతున్నాడు. ఈ కారణంగా అతనికి ఇతర భాషలలో కూడా డిమాండ్ పెరుగుతోంది. సీరియల్స్ మాత్రమే కాదు, ఇటీవల విడుదలైన దర్శన్ నటించిన రాబర్ట్ సినిమా లో కూడా యితడు నటించారు. చందూ నెగటివ్ రోల్ లో కనిపించడం ఇదే మొదటిసారి.

నటుడు చందు గౌడ, కుష్కా, జాక్‌పాట్, కమరోట్టు చక్ పోస్ట్, శ్రీ వంటి కొన్ని చిత్రాల్లో నటించారు. అయితే ఇదిలా ఉండగా నటుడు చందు గౌడ ఇటీవల కొనుగోలు చేసిన ఆడి క్యూ 7 కారు యొక్క ఫోటోలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో పంచుకున్నారు. ఈ కొత్త ఆడి క్యూ 7 ఎస్‌యూవీ ప్రారంభ ధర ఎక్స్ షోరూమ్ ప్రకారం రూ .69.27 లక్షలు.
MOST READ:రెప్పపాటు కాలంలో తప్పించుకున్న స్కూటరిస్ట్.. లేకుంటే ఏమయ్యేదో?

చందు గౌడ కొనుగోలు చేసిన ఆడి క్యూ 7 విషయానికొస్తే, ఇది దేశీయ మార్కెట్లో లగ్జరీ ఎస్‌యూవీ విభాగంలో అగ్రస్థానంలో ఉంది. ఆడి క్యూ 7 ఎస్‌యూవీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తల కొనుగోలుతో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎస్‌యూవీగా నిలిచింది.

ఆడి క్యూ 7 కారులో రెండు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి 3.0-లీటర్ వి 6 టర్బో డీజిల్ ఇంజన్, మరొకటి 2.0-లీటర్ నాలుగు సిలిండర్ల టర్బో పెట్రోల్ ఇంజన్. ఇందులో ఉన్న 3.0-లీటర్ వి 6 టర్బో డీజిల్ ఇంజన్ 245.4 బిహెచ్‌పి పవర్ మరియు 600 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
MOST READ:2021 టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ ఇప్పుడు కొత్త కలర్‌లో.. అదే ఫీచర్స్.. అదే పర్ఫెమెన్స్

ఇంకా రెండవ ఇంజిన్ అయిన 2.0-లీటర్ నాలుగు సిలిండర్ల టర్బో పెట్రోల్ ఇంజన్ 248 బిహెచ్‌పి శక్తిని, 370 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్లు క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో 8-స్పీడ్ టిప్ట్రోనిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడతాయి. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

ఈ ఎస్‌యూవీలో మంచి లగ్జరీ డిజైన్ మరియు హై ఎండ్ ఫీచర్లు ఉన్నాయి. దేశీయ మార్కెట్లో ప్రస్తుతం అత్యధికంగా అమ్ముడవుతున్న ఆడి క్యూ 7 లో ప్రామాణిక ఎల్‌ఇడి లైటింగ్ ఉంది. అంతే కాకుండా ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, డీఆర్‌ఎల్‌లు ఉన్నాయి. ఈ కారులో అల్యూమినియం రూఫ్ రైల్, రియర్ స్పాయిలర్, పనరోమిక్ సన్‌రూఫ్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.
MOST READ:కఠినమైన రోడ్డులో కారు నడిపి అదరగొట్టిన అరుణాచల్ ప్రదేశ్ సిఎం [వీడియో]

క్యాబిన్ యొక్క ప్రీమియం రూపాన్ని మెరుగుపరచడానికి ఇంటీరియర్ అనేక ఫీచర్స్ కలిగి ఉంది. ఇది టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మల్టిపుల్ జోన్ క్లయింట్ కంట్రోల్ సిస్టమ్ వాటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. సాధారణంగా సెలబ్రెటీలు ఎప్పుడూ లగ్జరీ వాహనాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇటీవల ప్రభాస్ 6 కోట్ల వీలుగా కార్ కొనుగోలు చేశారు. దీని గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.