బిఎమ్‌డబ్ల్యూ లగ్జరీ కార్ కొనుగోలుచేసిన కన్నడ నటి కారుణ్య రామ్

బిగ్ బాస్ ప్రోగ్రామ్స్ గురించి తెలియని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఇటీవల కాలంలో బిగ్ బాస్ చాలా ఫెమస్ అయింది. బిగ్ బాస్ ప్రోగ్రామ్ తెలుగు, కన్నడ మరియు ఇతర భాషలలో బాగా ప్రాచుర్యం చెందింది. ఈ బిగ్ బాస్ లో పాల్గొనటం చాలామంది యువకుల కల. అయితే ఇందులో కొన్ని రంగాలలో ప్రతిభ కనపరచినవారిని ఎంపిక చేస్తారు.

బిఎమ్‌డబ్ల్యూ లగ్జరీ కార్ కొనుగోలుచేసిన కన్నడ నటి కరుణ్య రామ్

ఇప్పుడు అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ కన్నడ సీజన్ 5 పోటీదారు మరియు సినీ నటి కారుణ్య రామ్ ఇటీవల కొత్త లగ్జరీ బిఎమ్‌డబ్ల్యూ 3 కారును కొనుగోలు చేశారు. కారుణ్య రామ్ కొనుగోలుచేసి కారు బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్. కారుణ్య రామ్ కొనుగోలు చేసిన మొదటి లగ్జరీ కార్ ఈ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్.

బిఎమ్‌డబ్ల్యూ లగ్జరీ కార్ కొనుగోలుచేసిన కన్నడ నటి కరుణ్య రామ్

చాలామందికి లగ్జరీ కార్స్ కొనాలని కలలు కంటూ ఉంటారు. అయితే ఈ కలలు కొంతమందికి కలలుగానే మిగిలిపోతాయి. కొంతమంది వాటిని నెరవేర్చుకుంటారు. ఇటీవల నటి కరుణ్య రామ్ సోషల్ నెట్‌వర్కింగ్ తాను కొన్న మొదటి లగ్జరీ కార్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

MOST READ:రష్మిక మందన్న కార్స్ ఎప్పుడైనా చూసారా.. అయితే ఇది చూడండి

బిఎమ్‌డబ్ల్యూ లగ్జరీ కార్ కొనుగోలుచేసిన కన్నడ నటి కరుణ్య రామ్

తాను చేసిన ఈ పోస్ట్ లో కరుణ్య తండ్రి మరియు తల్లి మరియు సోదరితో కలిసి బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తుంది. సాధారణంగా కరుణ్య ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. కరుణ్య వజ్రకాయ,నరసింహ వంటి కన్నడ సినిమాలలో నటించింది.

బిఎమ్‌డబ్ల్యూ లగ్జరీ కార్ కొనుగోలుచేసిన కన్నడ నటి కరుణ్య రామ్

ఇక కరుణ్య కొనుగోలుచేసి కారు విషయానికి వస్తే, ఇది బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్ గ్రాన్ లిమోసిన్ 330 ఎల్‌ఐ. ఇండియన్ ఎక్స్-షోరూమ్ ప్రకారం ఈ లగ్జరీ కారు ప్రారంభ ధర రూ .51.50 లక్షలు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాకుండా మంచి పర్ఫామెన్స్ మరియు మంచి ఫీచర్స్ కలిగి ఉంది.

MOST READ:వాహన ధరలు పెంచిన హోండా మోటార్‌సైకిల్.. కానీ ఆ వెహికల్ ధర మాత్రం తగ్గింది

బిఎమ్‌డబ్ల్యూ లగ్జరీ కార్ కొనుగోలుచేసిన కన్నడ నటి కరుణ్య రామ్

బిఎమ్‌డబ్ల్యూ యొక్క 3-సిరీస్ గ్రాన్ లిమోసిన్ లో, ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్, ఎల్‌ఇడి డిఆర్‌ఎల్, టర్న్ ఇండికేటర్, ఆకర్షణీయమైన ఫ్రంట్ గ్రిల్, స్టైలిష్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్, 3 డి ఎల్‌ఇడి లైట్లు మరియు పనోరమిక్ సన్‌రూఫ్ వంటివి ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ లగ్జరీ కార్ కొనుగోలుచేసిన కన్నడ నటి కరుణ్య రామ్

ఈ కొత్త కారు లోపలి భాగం కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. లాంగ్ వీల్‌బేస్ ఎఫెక్ట్‌లో ఫ్రంట్ అండ్ రియర్ ప్యాసింజర్ కంఫర్ట్ క్యాబిన్, ప్రీమియం లెదర్ సీట్లు, 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఐడ్రైవ్ టెక్నాలజీతో ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో ఉన్నాయి.

MOST READ:కొండెక్కిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ధరలు.. దేనిపై ఎంతంటే?

బిఎమ్‌డబ్ల్యూ లగ్జరీ కార్ కొనుగోలుచేసిన కన్నడ నటి కరుణ్య రామ్

అంతే కాకుండా ఇందులో, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్, క్రూయిస్ కంట్రోల్ మరియు స్ట్రింగ్ మౌండ్ కంట్రోల్‌తో సహా, మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ యొక్క 3-సిరీస్ గ్రాన్ లిమోసిన్ 2.0-లీటర్ ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు 320-ఎల్డి లగ్జరీ లైన్ మోడల్‌తో 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ ఎంపికతో అందించబడుతుంది. 2.0-లీటర్ ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజన్ 258-బిహెచ్‌పి పవర్ మరియు 400-ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ 188-బిహెచ్‌పి పవర్ మరియు 400-ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా; థార్ ఎస్‌యూవీ పొందిన మహ్మద్ సిరాజ్

బిఎమ్‌డబ్ల్యూ లగ్జరీ కార్ కొనుగోలుచేసిన కన్నడ నటి కరుణ్య రామ్

ఈ లగ్జరీ బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్ గ్రాన్ లిమోసిన్ భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ మరియు వోల్వో ఎస్ 60 వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది. ఏది ఏమైనా ఈ కారు నిజంగా చాలా అద్భుతమైన ఇంటీరియర్స్ కలిగి ఉండి వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది.

Most Read Articles

English summary
Actress Karunyaram Buys New Bmw Car. Read in Telugu.
Story first published: Tuesday, April 6, 2021, 19:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X