ఫెరారీ 296 జిటిబి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు ఆవిష్కరణ: ధర రూ.2.38 కోట్లు!

అందమైన, అధ్భుతమైన మరియు శక్తివంతమైన కార్లకు ఫెరారీ బ్రాండ్ పెట్టింది పేరు. ఈ ఇటాలియన్ కార్ బ్రాండ్ అందించే స్పోర్ట్స్ కార్లకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నాయి. ఫెరారీ తాజాగా తమ సరికొత్త స్పోర్ట్స్ కార్ '296 జిటిబి'ని ఆవిష్కరించింది. ఇదొక ప్లగ్-ఇన్ హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు.

ఫెరారీ 296 జిటిబి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు ఆవిష్కరణ: ధర రూ.2.38 కోట్లు!

ఫెరారీ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో 1970ల సందడి చేసిన డినో 246 జిటి తరువాత వి6 ఇంజన్‌ను ఉపయోగించిన మొదటి స్పోర్ట్స్ కారు ఫెరారీ 296 జిటిబి. ఇది పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్‌తో పనిచేసే ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్. ఇందులోని ఆరు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్లు రెండూ కలిసి గరిష్టంగా 809 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తాయి.

ఫెరారీ 296 జిటిబి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు ఆవిష్కరణ: ధర రూ.2.38 కోట్లు!

ఫెరారీ కార్ బ్రాండ్ చాలా కాలం నుండి కొత్త వాహనాన్ని విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో, అధిక-పనితీరు గల ఎసిటో ఫియోరానో ప్యాకేజీ మరియు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వ్యవస్థను ఉపయోగించి రూపొందించిన ఈ కొత్త మోడల్, కారు వినియోగం మరియు డ్రైవింగ్ ఆనందాన్ని పెంచుతుందని ఇటాలియన్ కంపెనీ పేర్కొంది.

ఫెరారీ 296 జిటిబి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు ఆవిష్కరణ: ధర రూ.2.38 కోట్లు!

కొత్తగా ప్రవేశపెట్టిన ఫెరారీ 296 జిటిబి హైపర్ కారులో 2.9 లీటర్ వి6 పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 645 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులో 164 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉంటుంది, ఇది 7.54 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 809 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తాయి.

ఫెరారీ 296 జిటిబి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు ఆవిష్కరణ: ధర రూ.2.38 కోట్లు!

టార్క్ విషయానికి వస్తే, పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ రెండూ కలిసి గరిష్టంగా 741 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తాయి. ఈ ఇంజన్ 8-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ హైపర్‌కార్ కేవలం 2.9 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వరకు వేగాన్ని చేరుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 330 కిలోమీటర్లుగా ఉంటుంది.

ఫెరారీ 296 జిటిబి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు ఆవిష్కరణ: ధర రూ.2.38 కోట్లు!

ఫెరారీ 296 జిటిబి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారు కేవలం విద్యుత్ శక్తితో (బ్యాటరీ పవర్‌తో) గంటకు 42 కిమీ రేంజ్‌ను ఆఫఱ్ చేస్తుంది మరియు ఈ మోడ్‌లో గంటకు 135 కిమీ వేగంతో పరుగులు తీస్తుంది. డ్రైవింగ్ అనుభవాన్ని వ్యక్తిగతీకరించడానికి ఇందులో ఇడ్రైవ్, హైబ్రిడ్, పెర్ఫార్మెన్స్ మరియు క్వాలిఫై అనే నాలుగు డ్రైవింగ్ మోడ్‌లు కూడా ఉంటాయి.

ఫెరారీ 296 జిటిబి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు ఆవిష్కరణ: ధర రూ.2.38 కోట్లు!

కొత్త ఫెరారీ 296 జిటిబి మిడ్-రియర్ ఇంజన్ రెండు సీట్ల బెర్లినెట్టా యొక్క గుర్తింపును పునర్నిర్వచించిందని ఫెరారీ పేర్కొంది. మెరుగైన డ్రైవింగ్ అనుభవం కోసం వాహనం దూకుడుగా ఉండే బాడీ లైన్స్ మరియు మెరుగైన ఏరోడైనమిక్స్‌ను కలిగి ఉంటుంది.

ఫెరారీ 296 జిటిబి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు ఆవిష్కరణ: ధర రూ.2.38 కోట్లు!

బెర్లినెట్టా స్టైలింగ్, మజిక్యులర్ వింగ్స్, వైజర్-స్టైల్ విండ్‌స్క్రీన్ మరియు వెర్టికల్ రియర్స్ స్క్రీన్‌లు ఈ స్పోర్ట్స్ కారుకు శుభ్రమైన సిల్హౌట్‌ను అందిస్తాయి. ఫ్రంట్ బంపర్‌లో విలీనం చేసినట్లుగా ఉండే బోనెట్, ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లతో సొగసైన టియర్‌డ్రాప్ ఆకారంలో ఉన్న ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు మరియు పెద్ద ఎయిర్ ఇంటెక్స్‌తో ఇది అద్భుతమైన ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంటుంది.

ఫెరారీ 296 జిటిబి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు ఆవిష్కరణ: ధర రూ.2.38 కోట్లు!

వెనుక భాగంలో ఇరువైపులా ట్విన్ స్క్వేర్ టెయిల్ లైట్స్ మరియు వాటి మధ్యలో ఎల్ఈడి స్ట్రిప్ ఉంటాయి. సింగిల్ సెంట్రల్ ఎగ్జాస్ట్ పైప్, రియర్ డిఫ్యూజర్ మరియు లాఫెరారీ-ప్రేరేపిత యాక్టివ్ స్పాయిలర్‌లు ఈ ఫెరారీ 296 జిటిబి యొక్క రియర్-ఎండ్ డిజైన్ బంపర్‌లో కలిసిపోయినట్లుగా అనిపిస్తాయి.

ఫెరారీ 296 జిటిబి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు ఆవిష్కరణ: ధర రూ.2.38 కోట్లు!

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఫెరారీ 296 జిటిబిలో మినిమలిస్ట్ కాక్‌పిట్ డిజైన్ ఉంటుంది. ఇందులో సెంట్రల్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఉండదు. కేవలం పెద్ద టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారానే మొత్తం సమాచారం డ్రైవర్‌కు అందించబడుతుంది. స్టీరింగ్ వీల్, ఇతర ఫెరారీ స్పోర్ట్స్ కార్ల మాదిరిగా, స్టార్ట్-స్టాప్ స్విచ్ మరియు డ్రైవింగ్ మోడ్స్‌ను ఎంచుకోవడానికి ఈ-మనేటినో బటన్‌లు ఉంటాయి.

ఫెరారీ 296 జిటిబి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు ఆవిష్కరణ: ధర రూ.2.38 కోట్లు!

యూరోపియన్ మార్కెట్లో ఫెరారీ 296 జిటిబి స్టాండర్డ్ మోడల్ ధర 269,000 యూరోలు (సుమారు 2.38 కోట్లు), కాగా, ఇందులో ఎసిటో ఫియోరానో ప్యాకేజీ కలిగిన వేరియంట్ ధర 302,000 యూరోలు (సుమారు 2.67 కోట్లు)గా ఉంటుంది. ఇది ఈ విభాగంలో మెక్‌లారెన్ అర్తురా (హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు) వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
All New Ferrari 296 GTB Plug In Hybrid Hyper Car Unveiled Globally, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X