ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన ఆడి ఈ-ట్రాన్; ధర & పూర్తి వివరాలు

జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ 'ఆడి' భారతదేశంలో తన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'ఈ-ట్రాన్' విడుదల చేసింది. ఇది మూడు (ఈ-ట్రాన్50, ఈ-ట్రాన్55 మరియు ఈ ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్‌) వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఆడి ఈ-ట్రాన్ యొక్క ప్రారంభ ధర రూ. 99.99 లక్షలు.

దేశీయ మార్కెట్లో ఈ మోడల్స్ యొక్క బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా ఆడి అధికారిక డీలర్‌షిప్ నుండి బుక్ చేసుకోవచ్చు. డెలివరీ త్వరలో ప్రారంభమవుతాయి.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన ఆడి ఈ-ట్రాన్; ధర & పూర్తి వివరాలు

ఆడి ఈ-ట్రాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలో ఈ-ట్రాన్50 మరియు ఈ-ట్రాన్55 ఉన్నాయి. వీటి ధరల విషయానికి వస్తే ఈ-ట్రాన్50 ధర 99,99,000 రూపాయలు కాగా, ఈ-ట్రాన్ ధర రూ. 1,16,15,000 వరకు ఉంటుంది. ఇక ఈ ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్‌ ధర అక్షరాలా రూ. 1,17,66,000.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన ఆడి ఈ-ట్రాన్; ధర & పూర్తి వివరాలు

కొత్త ఆడి ఈ-ట్రాన్ శ్రేణి యొక్క కలర్ ఆప్సన్ విషయానికి వస్తే, ఇది 9 కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి 'టైఫూన్ గ్రే, సియామ్ బీజ్, మిథోస్ బ్లాక్, గ్లాసియర్ వైట్, గెలాక్సీ బ్లూ, ఫ్లోరెట్ సిల్వర్, కాటలున్యా రెడ్, నవరా బ్లూ కలర్స్. ఇందులో ప్లాస్మా బ్లూ కలర్ కేవలం స్పోర్ట్‌బ్యాక్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన ఆడి ఈ-ట్రాన్; ధర & పూర్తి వివరాలు

కొత్త ఆడి ఈ-ట్రాన్ ఎస్‌యూవీ & స్పోర్ట్‌బ్యాక్ యొక్క డిజైన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. అయితే ఇందులో స్వల్ప తేడాలను కూడా గమనించవచ్చు. అవి రూప్ మరియు బ్లాక్-అవుట్ విండో లైన్‌. ఇవి కాకూండా మిగిలిన ఫీచర్స్ అన్ని దాదాపు ఒకేవిధంగా ఉంటాయి. ఇందులో మ్యాట్రిక్స్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, బూట్-లిడ్ పై ఎల్‌ఈడీ బార్, ఎల్‌ఈడీ టైల్ లాంప్స్, 20-ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ఇరువైపులా ఛార్జింగ్ పోర్ట్ వంటివి ఉన్నాయి.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన ఆడి ఈ-ట్రాన్; ధర & పూర్తి వివరాలు

ఆడి ఈ-ట్రాన్ యొక్క ఇంటీరియర్ కూడా చాలా వరకు అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ మరియు క్లైమేట్ కంట్రోల్ కోసం మూడు స్క్రీన్‌లను కలిగి ఉంది. ఇందులో ఎంటర్టైన్మెంట్ కోసం అనుకూలంగా ఉండే ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా ఇందులో ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వాయిస్-అసిస్టెంట్, మై ఆడి కనెక్ట్, పనోరమిక్ సన్‌రూఫ్, హెడ్-అప్ డిస్ప్లే, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే మరియు మౌంటెడ్ కంట్రోల్స్‌తో ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన ఆడి ఈ-ట్రాన్; ధర & పూర్తి వివరాలు

కొత్త ఆడి ఈ-ట్రాన్ యొక్క రెండు వేరియంట్లు రెండు ఎలక్ట్రిక్ మోటార్లను కలిగి ఉంటాయి. దీనితోపాటు ఆడి యొక్క క్వాట్రో ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్, రీజనరేటివ్ బ్రేకింగ్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వంటి వాటిని కూడా ఇది కలిగి ఉంటుంది.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన ఆడి ఈ-ట్రాన్; ధర & పూర్తి వివరాలు

మొదట ఆడి ఈ-ట్రాన్50 విషయానికి వస్తే, ఇది 71kWh కెపాసిటీ కలిగిన బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 308 బిహెచ్‌పి పవర్ మరియు 540 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 6.8 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఆడి ఈ-ట్రాన్50 యొక్క గరిష్ట వేగం గంటకు 190 కిమీ.

అదేవిధంగా ఆడి ఈ-ట్రాన్55 95kWh కెపాసిటీ కలిగిన బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 402 బిహెచ్‌పి పవర్ మరియు 664 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 5.7 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఆడి ఈ-ట్రాన్55 యొక్క గరిష్ట వేగం గంటకు 200 కిమీ వరకు ఉంటుంది.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన ఆడి ఈ-ట్రాన్; ధర & పూర్తి వివరాలు

ఆడి ఈ-ట్రాన్ 7 వేర్వేరు డ్రైవ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. అవి డైనమిక్, స్పోర్ట్, ఎఫిషియెన్సీ, కంఫర్ట్, ఆల్-రోడ్, ఆఫ్-రోడ్ & ఇండివిజువల్ మోడ్స్. ఇందులో ఉన్న ప్రతి మోడ్ వాహనదారునికి డ్రైవింగ్ విషయంలో చాలా అనుకూలంగా ఉండి, మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన ఆడి ఈ-ట్రాన్; ధర & పూర్తి వివరాలు

కొత్త ఆడి అధునాతన సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో 8 ఎయిర్‌బ్యాగులు, బ్రేక్ అసిస్ట్, ఎబిఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటర్ మరియు ప్రీ-సెన్స్ బేసిక్ వంటివి ఉన్నాయి. ఇది ప్రయాణికుల భద్రతకు చాలా ప్రాముఖ్యతను ఇస్తాయి.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన ఆడి ఈ-ట్రాన్; ధర & పూర్తి వివరాలు

ఆడి ఈ-ట్రాన్50 గరిష్టంగా 370 కిలోమీటర్ల డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. అదేవిధంగా ఈ-ట్రాన్55 యొక్క పరిధి గరిష్టంగా 480 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అయితే ఈ పరిధి వాస్తవ శ్రేణి గణాంకాల ఆధారంగా కొంత మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. ఈ-ట్రాన్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కలిగి ఉండటం వల్ల, దీనికి 150 కిలోవాట్ల డిసి ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగించి కేవలం 30 నిమిషాల్లో బ్యాటరీని 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన ఆడి ఈ-ట్రాన్; ధర & పూర్తి వివరాలు

ఆడి ఇండియా దశలవారీగా 50 కిలోవాట్ల ఫాస్ట్ ఛార్జర్ అమర్చడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తోంది. దీనికోసం దేశంలోని 75 ముఖ్య నగరాల్లో 100 కి పైగా ఛార్జర్‌లను ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. అంతే కాకుండా ఆడి ఈ-ట్రాన్ ని ఆన్‌బోర్డ్ 11 కిలోవాట్ల ఎసి ఛార్జర్‌తో 8.5 గంటల సమయంలో బ్యాటరీ ప్యాక్‌ను 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన ఆడి ఈ-ట్రాన్; ధర & పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లో లగ్జరీ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో లేటెస్ట్ బ్రాండ్స్ విడుదల చేసిన కంపెనీ ఆడి. ఆడి కంపెనీ విడుదల చేసిన ఈ ఎలక్ట్రిక్ కార్లు చాలా వరకు మంచి ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా మంచి పనితీరుని కూడా అందిస్తాయి. ఆడి ఈ-ట్రాన్ భారతీయ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి మరియు జాగ్వార్ ఐ-పేస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

Read more on: #ఆడి #audi
English summary
Audi e-Tron Launched In India. Read in Telugu.
Story first published: Thursday, July 22, 2021, 12:07 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X