సెప్టెంబర్ 22వ తేదీన Audi e-Tron GT విడుదల; బుకింగ్స్ ఓపెన్..

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా (Audi India) గడచిన జులై నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఇ-ట్రోన్ (e-Tron) లో కంపెనీ ఇప్పుడు GT వేరియంట్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. తాజా సమాచారం ప్రకారం, కొత్త Audi e-Tron GT సెప్టెంబర్ 22 న మార్కెట్లో విడుదల కానుంది.

సెప్టెంబర్ 22వ తేదీన Audi e-Tron GT విడుదల; బుకింగ్స్ ఓపెన్..

ఆసక్తిగల కస్టమర్లు రూ. 10 లక్షల టోకెన్ అడ్వాన్స్ చెల్లించి కొత్త Audi e-Tron GT ఎలక్ట్రిక్ కారు బుక్ చేసుకోవచ్చు. ఈ హై-పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ కారును కంపెనీ వెబ్‌సైట్ నుండి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు లేదా అధీకృత ఆడి డీలర్‌షిప్‌ను సంప్రదించి కానీ బుక్ చేసుకోవచ్చు. కొన్ని నెలల క్రితమే, ఆడి ఇండియా తమ ఇ-ట్రోన్ యొక్క స్టాండర్డ్ ఎస్‌యూవీ మరియు స్పోర్ట్‌బ్యాక్ వేరియంట్లను భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే.

సెప్టెంబర్ 22వ తేదీన Audi e-Tron GT విడుదల; బుకింగ్స్ ఓపెన్..

ఇప్పటికే ఈ రెండు ఎస్‌యూవీలు భారత మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. కాగా, కొత్త వస్తున్న Audi e-Tron GT స్టాండర్డ్ e-Tron కన్నా ఎక్కువ శక్తిని కలిగిన పెర్ఫార్మెన్స్ వేరియంట్ గా ఉంటుంది. సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్ లో ఈ కారును పూర్తిగా విదేశాల్లో తయారు చేసి భారత మార్కెట్ కు దిగుమతి చేసుకోనున్నారు.

సెప్టెంబర్ 22వ తేదీన Audi e-Tron GT విడుదల; బుకింగ్స్ ఓపెన్..

గ్లోబల్ మార్కెట్లలో కంపెనీ ఇప్పటికే ఆడి ఇ-ట్రోన్ జిటిని విక్రయిస్తోంది. ఇది అంతర్జాతీయ మార్కెట్లో రెండు వేరియంట్లలో అమ్ముడవుతోంది. ఈ వేరియంట్‌లలో స్టాండర్డ్ మరియు RS (పెర్ఫార్మెన్స్ వేరియంట్) ఉన్నాయి. అయితే, భారత మార్కెట్లో ఇ-ట్రోన్ జిటి సెడాన్ ఏ వేరియంట్ లాంచ్ చేయబడుతుందనే సమాచారాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

సెప్టెంబర్ 22వ తేదీన Audi e-Tron GT విడుదల; బుకింగ్స్ ఓపెన్..

కొత్త Audi e-Tron GT ఎలక్ట్రిక్ కారులో 85 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్లు స్టాండర్డ్ మోడల్ 469 hp శక్తిని మరియు 630 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే, RS వేరియంట్ 590 hp శక్తిని మరియు 830 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. సమాచారం ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ కారు పోర్షే టేకాన్‌తో దాని అండర్‌పిన్నింగ్‌లను పంచుకుంటుంది.

సెప్టెంబర్ 22వ తేదీన Audi e-Tron GT విడుదల; బుకింగ్స్ ఓపెన్..

స్టాండర్డ్ ఫోర్-డోర్ కూప్ మోడల్ పూర్తి ఛార్జ్‌ పై 487 కిమీ డ్రైవింగ్ రేంజ్ ను ఆఫర్ చేస్తుండగా RS ట్రిమ్ పూర్తి చార్జ్ పై 471 కిమీ రేంజ్ ను ఆఫర్ చేస్తుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, Audi e-Tron GT కేవలం 4.1 సెకన్లలో సున్నా నుండి గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. స్టాండర్డ్ వేరియంట్ గరిష్ట వేగం గంటకు 245 కిమీ గా ఉంటుంది.

సెప్టెంబర్ 22వ తేదీన Audi e-Tron GT విడుదల; బుకింగ్స్ ఓపెన్..

కాగా, ఇందులోని ఆర్ఎస్ వెర్షన్ కేవలం 3.3 సెకన్లలో ఈ వేగాన్ని సాధించగలదు. అలాగే, ఈ స్పోర్టీయర్ వెర్షన్ గరిష్ట వేగం గంటకు 250 కిమీ గా ఉంటుంది. ఆడి ఇ-ట్రోన్ జిటిలో లభించే ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే మరియు ఆడి యొక్క తాజా ఎమ్ఎమ్ఐ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి.

సెప్టెంబర్ 22వ తేదీన Audi e-Tron GT విడుదల; బుకింగ్స్ ఓపెన్..

ఇదేరకమైన టచ్‌స్క్రీన్ సిస్టమ్‌ను Audi A6, A8L మరియు Q8 వంటి మోడళ్లలో కూడా చూడొచ్చు. ఈ ఎలక్ట్రిక్ కూప్ లో 2 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది మరియు ఇది బ్యాటరీ నుండి వచ్చే శక్తిని వెనుక యాక్సిల్ లో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్‌ కు శక్తిని అందిస్తుంది. అధిక రేంజ్ మరియు వేగవంతమైన పనితీరును అందిచడానికి ఈ గేర్‌బాక్స్ మొదటి కారక నిష్పత్తి మరియు దీర్ఘ కారక నిష్పత్తి అని రెండు గేర్లను కలిగి ఉంటుంది.

సెప్టెంబర్ 22వ తేదీన Audi e-Tron GT విడుదల; బుకింగ్స్ ఓపెన్..

ఈ కారు ఆడి యొక్క క్వాట్రో ఆల్ -వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభించనున్నట్లు సమాచారం. ఈ కారులో లభించబోయే ప్రధాన ఫీచర్ల గమనిస్తే, ఇందులో 12.3 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, లేటెస్ట్ కార్ కనెక్టింగ్ టెక్నాలజీ, మల్టిపుల్ అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ మరియు 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి.

సెప్టెంబర్ 22వ తేదీన Audi e-Tron GT విడుదల; బుకింగ్స్ ఓపెన్..

అంతేకాకుండా, Audi e-Tron GT ఎలక్ట్రిక్ కారులో వివిధ రకాల డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు మరియు అధునాతన భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. మొదటి చూపులోనే ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ కారు ఓ ఫోర్డ డోర్ వెర్షన్ కూప్ మాదిరిగా కనిపిస్తుంది. ఆడి సింగిల్ ఫ్రేమ్ గ్రిల్ లో ఇ-ట్రోన్ జిటి యొక్క డీటేలింగ్స్ నూ కూడా గమనించవచ్చు.

సెప్టెంబర్ 22వ తేదీన Audi e-Tron GT విడుదల; బుకింగ్స్ ఓపెన్..

ఈ కారులోని ఇతర డిజైన్ ఎలిమెంట్స్ ను గమనిస్తే, వాలుగా ఉండే పైకప్పు, వైడ్ ట్రాక్, బ్రాడ్ షోల్డర్ లైన్ మరియు తక్కువ ఎత్తులో ఉన్న బోనెట్ వంటి అంశాలు ఉన్నాయి. ఇంకా ఇందులో పూర్తిగా ఎల్‌ఈడి లైట్లు (హెడ్‌లైట్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఫాగ్ ల్యాంప్స్ మరియు టెయిల్ ల్యాంప్స్ అన్నీ కూడా) ఉపయోగించబడ్డాయి. భారత మార్కెట్లో Audi e-Tron GT ఎలక్ట్రిక్ కారు ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 1.6 కోట్లు ఉంటుందని అంచనా.

Most Read Articles

Read more on: #ఆడి #audi
English summary
Audi e tron gt electric sedan india launch on 22nd september
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X