భారత్‌లో ఆడి ఈ-ట్రోన్ ఎలక్ట్రిక్ లాంచ్ ఎప్పుడంటే?

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహన అమ్మకాలు రోజురోజుకి విపరీతముగా పెరుగుతున్నాయి. ఈ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో కేవలం మిడ్ సైజు కార్లు మాత్రమే కాకుండా, లగ్జరీ కార్ మోడల్స్ కూడా ఎలక్ట్రిక్ వెర్షన్లను విక్రయిస్తున్నాయి. యూరోపియన్ మార్కెట్లో ఈ-ట్రోన్ ఎస్‌యూవీ అమ్మకాలలో ఆడి కంపెనీ ఇప్పటికే కొత్త రికార్డును కైవసం చేసుకుంది.

భారత్‌లో ఆడి ఈ-ట్రోన్ ఎలక్ట్రిక్ లాంచ్ ఎప్పుడంటే?

ఆడి ఈ-ట్రోన్ ఎస్‌యూవీ ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందటం వల్ల, కంపెనీ ఇప్పడు భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఆడి ఇండియా తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఈ-ట్రోన్ ఎస్‌యూవీని భారత్‌లో విడుదల చేయడాన్ని అధికారికంగా ధ్రువీకరించింది.

భారత్‌లో ఆడి ఈ-ట్రోన్ ఎలక్ట్రిక్ లాంచ్ ఎప్పుడంటే?

కంపెనీ నివేదికల ప్రకారం ఆడి ఈ-ట్రోన్ ఈ ఏడాది ఆరంభంలో విడుదల కావాల్సి వుంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఈ-ట్రోన్ విడుదల కాస్త వాయిదా పడింది. కానీ ఇప్పుడు ఈ-ట్రోన్ ఎలక్ట్రిక్ కార్ వచ్చే నెల జులై 22 న దేశీయ మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది.

భారత్‌లో ఆడి ఈ-ట్రోన్ ఎలక్ట్రిక్ లాంచ్ ఎప్పుడంటే?

కొత్త ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ కారు మంచి అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుందని కంపెనీ ఇప్పటికే సమాచారాన్ని అందించింది. ఆడి ఇండియా, కొత్త కార్ టెస్ట్ మోడళ్లను ఎంపిక చేసిన డీలర్లలో ప్రదర్శించనుంది. దీనితోపాటు త్వరలో దీని కోసం అధికారిక బుకింగ్ ప్రక్రియను ప్రారంభిస్తుంది.

భారత్‌లో ఆడి ఈ-ట్రోన్ ఎలక్ట్రిక్ లాంచ్ ఎప్పుడంటే?

2019 ఆరంభంలో యూరప్‌లోని ప్రధాన మార్కెట్లను ఆడి ఈ-ట్రోన్ ప్రారంభించిన కొద్దిసేపటికే మంచి అమ్మకాలను నమోదు చేసింది. దీన్ని బట్టి చూస్తే ఈ ఆడి ఈ-ట్రోన్ ఎలక్ట్రిక్ కారుకి భారత మార్కెట్లో కూడా మంచి అమ్మకాలు జరిగే అవకాశం ఉంది. గత ఏడాది యూరప్ మార్కెట్లో మొత్తం 17,641 యూనిట్లను అమ్మినట్లు కంపెనీ నివేదించింది.

భారత్‌లో ఆడి ఈ-ట్రోన్ ఎలక్ట్రిక్ లాంచ్ ఎప్పుడంటే?

కొత్త టెక్నాలజీతో నడిచే ఈ-ట్రోన్ కారు అనేక కొత్త ఫీచర్స్ కలిగి ఉంది. ఇందులో 95 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీతో డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటారు గంటకు 200 కిమీ వేగంతో పనిచేస్తుంది. 95 కిలోవాట్ల బ్యాటరీని కేవలం 30 నిమిషాల్లో డిసి ఫాస్ట్ ఛార్జర్ లేదా 400 వోల్ట్స్ హోమ్ ఛార్జర్‌తో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఈ కార్ ఒక ఛార్జీతో 452 కిలోమీటర్ల గరిష్ట పరిధిని అందిస్తుంది.

భారత్‌లో ఆడి ఈ-ట్రోన్ ఎలక్ట్రిక్ లాంచ్ ఎప్పుడంటే?

డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటారుతో, ఈ ఎలక్ట్రిక్ కార్ కేవలం 5.7 సెకన్లలో గరిష్టంగా గంటకు 100 కిమీ వేగంతో చేరుకుంటుంది. దేశీయ మార్కెట్లో ఈ ఆడి ఈ-ట్రోన్ ఎలక్ట్రిక్ ఆర్, టెస్లా ఎక్స్, జాగ్వార్ ఐపిఎస్ మరియు మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

భారత్‌లో ఆడి ఈ-ట్రోన్ ఎలక్ట్రిక్ లాంచ్ ఎప్పుడంటే?

భారతదేశంలో లాంచ్ చేయబోయే ఈ-ట్రోన్ కారు ధర ఇంకా అధికారికంగా ద్రువీకరించబడలేదు, కానీ ఇది ఎక్కువ ధర కలిగి ఉంటుందని భావిస్తున్నాము. భారత మార్కెట్లో విడుదల కానున్న ఈ కారు యూరోపియన్ మార్కెట్లో ఉండే కారుకంటే కూడా కొంత భిన్నంగా ఉంటుంది. ఈ కొత్త కారు ధర రూ. 80 లక్షల నుంచి రూ. 90 లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుంది.

Most Read Articles

Read more on: #ఆడి #audi
English summary
Audi e-tron India launch on July 22. Read in Telugu.
Story first published: Wednesday, June 23, 2021, 16:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X