కొత్త సంవత్సరానికి ముందే మరో షోరూమ్ ప్రారంభిచిన Audi: వివరాలు

జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ ఆడి (Audi) భారతదేశంలో ఆధునిక కార్లను ప్రవేశపెట్టి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అయితే భారతీయ మార్కెట్లో మరిన్ని అమ్మకాలను పొందటానికి మరియు తన ఉనికి విస్తరించుకోటానికి నిరంతరం పాటుపడుతూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పుడు భారతీయ మార్కెట్లో కొత్త డీలర్‌షిప్‌ ప్రారంభించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కొత్త సంవత్సరానికి ముందే మరో షోరూమ్ ప్రారంభిచిన Audi: వివరాలు

నివేదికల ప్రకారం, ఆడి ఇండియా గుజరాత్ రాష్ట్రంలో ఒక కొత్త డీలర్‌షిప్‌ ప్రారంభించింది. ఇది ప్రస్తుతం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆడి ఇండియా యొక్క మూడవ షోరూమ్‌. కంపెనీ ప్రీ-ఓన్డ్ కార్ల అమ్మకాల కోసం ఈ కొత్త షోరూమ్‌ ప్రారంభించింది. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

కొత్త సంవత్సరానికి ముందే మరో షోరూమ్ ప్రారంభిచిన Audi: వివరాలు

ఆడి కంపెనీ ప్రారంభించిన ఈ కొత్త షోరూమ్ 2,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఇందులో నాలుగు కార్లను ప్రదర్శించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కొత్తగా ప్రారంభించబడిన డీలర్‌షిప్‌లు గాంధీనగర్ వంటి సమీప ప్రాంతాలను కవర్ చేస్తాయి. కావున అక్కరి కస్టమర్లకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

కొత్త సంవత్సరానికి ముందే మరో షోరూమ్ ప్రారంభిచిన Audi: వివరాలు

ఇందులో ప్రీ-ఓన్డ్ అవుట్‌లెట్ ద్వారా రిటైల్ చేయబడిన అన్ని ఆడి వాహనాలు 300 కంటే ఎక్కువ మల్టి పాయింట్ తనిఖీలకు లోనవుతాయి. అంతే కాకుండా.. రెండు సంవత్సరాల అపరిమిత కిలోమీటర్ల వారంటీ, సర్వీస్ హిస్టరీ మరియు 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వంటి ప్రయోజనాలను అందించే 'ఆడి అప్రూవ్డ్: ప్లస్ ప్రోగ్రామ్'ని కూడా అందిస్తుంది.

కొత్త సంవత్సరానికి ముందే మరో షోరూమ్ ప్రారంభిచిన Audi: వివరాలు

కొనుగోలుదారులకు కారు కొనుగోలు అనుభవాన్ని మరింత సులభతరం చేసేందుకు ఈ కార్యక్రమం ఫైనాన్స్ మరియు బీమా సేవలను కూడా అందిస్తుంది. మొత్తానికి కంపెనీ తన వినియోగదారులకు కావలసిన సౌకర్యాలను అందిస్తుంది.

కొత్త సంవత్సరానికి ముందే మరో షోరూమ్ ప్రారంభిచిన Audi: వివరాలు

కొత్త డీలర్‌షిప్‌ ప్రారంభించిన సందర్భంలో ఆడి ఇండియా హెడ్, బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ.. గుజరాత్ తలసరి ఆదాయం జాతీయ సంఖ్య కంటే దాదాపు రెండింతలు ఎక్కువ, అంతే కాకుండా అహ్మదాబాద్ భారతదేశంలో ఒక ముఖ్యమైన ఆర్థిక మరియు పారిశ్రామిక కేంద్రంగా ఉద్భవించింది.

కొత్త సంవత్సరానికి ముందే మరో షోరూమ్ ప్రారంభిచిన Audi: వివరాలు

గుజరాత్ మరియు ఆ పరిసర ప్రాంతాల్లో చాలా సంవత్సరాల నుంచి లగ్జరీ కార్లకు మంచి డిమాండ్ ఉంది, కావున కంపెనీ తన అమ్మకాలను పెంచుకోవడానికి మరియు కస్టమర్లకు మరింత చేరువలో ఉండటానికి నిరంతరం తన పరిధిని విస్తరిస్తూనే ఉంది. ఈ కారణంగానే ఇప్పుడు మరొక కొత్త డీలర్‌షిప్‌ కూడా ప్రారభించబడింది.

కొత్త సంవత్సరానికి ముందే మరో షోరూమ్ ప్రారంభిచిన Audi: వివరాలు

అంతే కాకుండా ఆడి కంపెనీ యొక్క వాహన వినియోగదారులకు ఎప్పటికప్పుడు నాణ్యమైన సౌకర్యాలను అందించడానికి మరియు బ్రాండ్ వాహనాలకు సరైన సర్వీస్ వంటివి అందించడానికి కంపెనీ అనునిత్యం పాటు పడుతూనే ఉంది. రాబోయే రోజుల్లో కూడా కంపెనీ ఉత్తమమైన సేవలు అందించడానికి ముందడుగు వేస్తోంది.

కొత్త సంవత్సరానికి ముందే మరో షోరూమ్ ప్రారంభిచిన Audi: వివరాలు

ఇదిలా ఉండగా ఆడి కంపెనీ దేశీయ మార్కెట్లో రానున్న 2022 సంవత్సరంలో క్యూ7 ఫేస్‌లిఫ్ట్‌ విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇది 2022 లో కంపెనీ ప్రవేశపెట్టనున్న మొదటి మోడల్ కానుంది. ఇప్పుడు కంపెనీ ఈ మోడల్ ఉత్పత్తిని ప్రారంభించింది. దీనిని కంపెనీ యొక్క ఔరంగాబాద్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తుంది. అయితే రాబోయే రోజుల్లో ఈ కారు బుకింగ్‌లను ప్రారంభిస్తుంది.

కొత్త సంవత్సరానికి ముందే మరో షోరూమ్ ప్రారంభిచిన Audi: వివరాలు

ఆడి క్యూ7 యొక్క డిజైన్ మరియు అప్‌డేట్‌ల విషయానికి వస్తే, ఇందులో పెద్దగా చెప్పుకోవాల్సిన అప్డేట్స్ లేవనే చెప్పాలి. కానీ ఇందులో ఆకర్షణీయమైన ఫ్రంట్ గ్రిల్, 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, స్లిమ్ మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌లైట్ యూనిట్, పెద్ద ఎయిర్ ఇన్‌టేక్ గ్రిల్, విండోస్‌పై క్రోమ్ గార్నిష్ మరియు క్రోమ్ లైన్డ్ డోర్‌లను పొందుతుంది. అంతే కాకూండా ఇందులో మ్యాట్రిక్స్ ఎల్‌ఈడీ టెయిల్‌లైట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. వెనుక బంపర్‌కు క్రోమ్-టిప్డ్ ఎగ్జాస్ట్ మరియు స్కిడ్ ప్లేట్ కూడా ఉన్నాయి.

కొత్త సంవత్సరానికి ముందే మరో షోరూమ్ ప్రారంభిచిన Audi: వివరాలు

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఆడి క్యూ7 ఫేస్‌లిఫ్ట్ ప్రీమియమ్ ప్లస్ మరియు టెక్నాలజీతో సహా రెండు వేరియంట్‌లలో అందించబడుతుంది. ఈ రెండు వేరియంట్‌లు 55 టిఎఫ్ఎస్ఐ ఇంజిన్‌ను కలిగి ఉంటాయి. ఇందులోని 3.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 335 బిహెచ్‌పి పవర్ మరియు 500 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జత చేయబడి ఉంటుంది.దేశీయ మార్కెట్లో ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ మంచి అమ్మకాలను పొందే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము.

Most Read Articles

Read more on: #ఆడి #audi
English summary
Audi india inaugurates new pre owned cars showroom in gujarat details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X