ఆడి ఇండియా వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ కార్; త్వరలోనే విడుదల!

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి, భారత మార్కెట్లో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే, ఆడి ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కంపెనీ తమ ఇండియన్ వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసింది.

ఆడి ఇండియా వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ కార్; త్వరలోనే విడుదల!

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, ఆడి ఇండియా ఈ సరికొత్త ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ కారును ఇక్కడి మార్కెట్లో అందుబాటులోకి తీసుకురానుంది. కంపెనీ తమ వెబ్‌సైట్‌లో ఈ కొత్త మోడల్‌ను లిస్టింగ్ చేయటాన్ని చూస్తుంటే, త్వరలోనే ఈ ఎలక్ట్రిక్ కార్ దేశీయ విపణిలో విడుల కావచ్చని తెలుస్తోంది.

ఆడి ఇండియా వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ కార్; త్వరలోనే విడుదల!

ఈ లగ్జరీ కార్ బ్రాండ్ నుండి వస్తున్న ఆడి ఇ-ట్రోన్ భారతదేశంలోనే మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ కారు అవుతుంది. గడచిన 2019లో కంపెనీ తమ ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ప్రదర్శించింది. వాస్తవానికి ఇది 2020లో మార్కెట్లో వస్తుందని అందరూ ఊహించారు. అయితే, దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఇది ఆలస్యమైంది.

ఆడి ఇండియా వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ కార్; త్వరలోనే విడుదల!

భారతదేశంలో ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని అధికారికంగా విడుదల చేయడాని ముందే కంపెనీ ఇందుకు సంబంధించిన ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది. ఆడి ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లాంచ్ తర్వాత కంపెనీ ఇందులో మరో కొత్త స్పోర్ట్‌బ్యాక్ వెర్షన్‌ను కూడా ఇక్కడి మార్కెట్లో విడుదల చేయనుంది.

ఆడి ఇండియా వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ కార్; త్వరలోనే విడుదల!

ఆడి ఇ-ట్రోన్ ఎస్‌యూవీ మరియు స్పోర్ట్‌బ్యాక్ రెండు మోడళ్లు కూడా వేర్వేరు డిజైన్‌ను కలిగి ఉన్నప్పటికీ, ఒకేరకమైన అండర్‌పిన్నింగ్స్‌ను కలిగి ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, ఇందుంలో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. వీటిలో ఒకటి ముందు భాగంలో (125 కిలోవాట్ల మోటారు) ఉంటే, మరొకటి వెనుక భాగంలో (140 కిలోవాట్ల మోటారు) ఉంటుంది.

ఆడి ఇండియా వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ కార్; త్వరలోనే విడుదల!

ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్లు కలిసి గరిష్టంగా 408 బిహెచ్‌పి శక్తిని మరియు 664 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తాయి. ఈ శక్తి మొత్తం నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ అవుతుంది. ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్లు కారులో ఉన్న 95 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో నడుస్తాయి.

ఆడి ఇండియా వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ కార్; త్వరలోనే విడుదల!

కారులోని ఈ బ్యాటరీ ప్యాక్‌ను డిసి ఫాస్ట్ ఛార్జర్ సాయంతో కేవలం 30 నిమిషాల్లో 80 శాతం వరకూ ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. అదే, సాధారణ హోమ్ ఛార్జర్ ద్వారా అయితే, ఈ బ్యాటరీని పూర్తిగా 100 శాతం ఛార్జ్ చేయడానికి సుమారు 10 గంటల సమయం పడుతుంది.

ఆడి ఇండియా వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ కార్; త్వరలోనే విడుదల!

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఆడి ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కేవలం 5.7 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు మరియు దీని గరిష్టం వేగం గంటకు 200 కిలోమీటర్లుగా ఉంటుంది. ఇది ఈ విభాగంలో మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి, జాగ్వార్ ఐ-పేస్ మరియు రాబోయే వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ మరియు టెస్లా మోడల్ 3 వంటి మోడళ్లకు పోటీగా ఉంటుంది.

ఆడి ఇండియా వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ కార్; త్వరలోనే విడుదల!

ఈ ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో ఆక్టాగన్ ఆకారంలో ఉండే ఫ్రంట్ గ్రిల్, ఎయిర్ కూలింగ్ కోసం ఫ్లాప్స్, వాలుగా ఉండే రూఫ్-లైన్, బూట్ డోరుపై అడ్డంగా ఉన్న ఎల్‌ఈడీ లైట్ బార్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ఆడి మ్యాట్రిక్స్ టెక్నాలజీతో కూడిన ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్ మరియు 20 ఇంచ్ ఫైవ్-స్పోక్ అల్లాయ్ వీల్స్ వంటి ఎక్స్టీరియర్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఆడి ఇండియా వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ కార్; త్వరలోనే విడుదల!

ఇంటీరియర్ ఫీచర్లను గమనిస్తే, ఇందులో వివిధ రకాల ప్రయోజనాల కోసం మల్టిపుల్ టచ్‌స్క్రీన్లు, ప్రీమియం బ్యాంగ్ అండ్ ఓలుఫ్సేన్ సౌండ్ సిస్టమ్, విభిన్న పవర్ మోడ్స్, రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్, మల్టిపుల్ క్లైమేట్ కంట్రోల్, వాయిస్-అసిస్టెడ్ కనెక్ట్ టెక్నాలజీ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ మొదలైన ఫీచర్లను కలిగి ఉంటుంది.

ఆడి ఇండియా వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ కార్; త్వరలోనే విడుదల!

అంతేకాకుండా, పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లతో కూడిన

వర్చువల్ కాక్‌పిట్, మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్, స్టెబిలిటీ కంట్రోల్ వంటి మరిన్నో ఇతర ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. ఇంకా ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో మరికొన్ని యాక్టివ్ సేఫ్టీ ఫీచర్లు కూడా లభిస్తాయని భావిస్తున్నారు.

ఆడి ఇండియా వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ కార్; త్వరలోనే విడుదల!

ఆడి ఇ-ట్రోన్ మొత్తం పొడవు 4.9 మీటర్లు మరియు ఇదొక 5-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. ఇది బ్రాండ్ లైనప్‌లో కంపెనీ విక్రయిస్తున్న పెట్రోల్ పవర్డ్ క్యూ5 ఎస్‌యూవీ కంటే పెద్దదిగా ఉంటుంది. ఈ ఎస్‌యూవీలో 660-లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. రెండవ వరుస సీట్లను మడతపెట్టడం ద్వారా ఈ స్థలాన్ని 1,725-లీటర్లకు పెంచుకోవచ్చు.

Most Read Articles

Read more on: #ఆడి #audi
English summary
Audi India Lists e-Tron Electric SUV In Their Website; Launch Expected Very Soon, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X