కొత్త తరం ఏ3 సెడాన్ మరియు క్యూ3 ఎస్‌యూవీలను లాంచ్ చేయనున్న ఆడి ఇండియా

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి, భారత మార్కెట్లో 2021 నాటికి ఆరు కొత్త మోడళ్లను విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసినదే. ఆడి ఇండియా ఇప్పటికే దేశీయ విపణిలో తమ కొత్త ఏ4 మరియు కొత్త ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ మోడళ్లను ప్రవేశపెట్టింది.

కొత్త తరం ఏ3 సెడాన్ మరియు క్యూ3 ఎస్‌యూవీలను లాంచ్ చేయనున్న ఆడి ఇండియా

అయితే, కొన్ని అనివార్య కారణాల వలన కంపెనీ ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ కార్ మరియు నెక్ట్స్ జనరేషన్ ఏ3 సెడాన్ మరియు క్యూ3 ఎస్‌యూవీల విడుదలను కంపెనీ వాయిదా వేసింది. కాగా, తాజా నివేదికల ప్రకారం, కంపెనీ తమ సెకండ్ జనరేషన్ ఏ3 సెడాన్ మరియు క్యూ3 ఎస్‌యూవీలను వచ్చే ఏడాది భారత మార్కెట్లో విడుదల చేయనుంది.

కొత్త తరం ఏ3 సెడాన్ మరియు క్యూ3 ఎస్‌యూవీలను లాంచ్ చేయనున్న ఆడి ఇండియా

ఈ రెండు మోడళ్లు ఫోక్స్‌వ్యాగన్ యొక్క ఎమ్‌క్యూబి ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఉంటాయని సమాచారం. మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఇటీవల మార్కెట్లో ప్రవేశపెట్టిన ఏ-క్లాస్ లిమోసిన్ మోడల్‌కు పోటీగా ఆడి ఇండియా తమ కొత్త 2022 ఆడి ఏ3 లీమోజైన్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. కాగా, ఇప్పుడు కొత్తగా రానున్న 2022 ఆడి క్యూ3 ఈ విభాగంలో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 నుండి గట్టి పోటీని ఎదుర్కోనుంది.

MOST READ:కస్టమైజ్ ఫోర్డ్ పిక్-అప్ ట్రక్కు డ్రైవ్ చేస్తూ కనిపించిన 'సద్గురు జగ్గీ వాసుదేవ్' [వీడియో]

కొత్త తరం ఏ3 సెడాన్ మరియు క్యూ3 ఎస్‌యూవీలను లాంచ్ చేయనున్న ఆడి ఇండియా

2022 ఆడి ఏ3

ఆడి ఇండియా తమ కొత్త ఎంట్రీ లెవల్ సెడాన్ లగ్జరీ కారును పూర్తిగా కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్‌తో విడుదల చేయనుంది. ఈ రెండవ తరం ఏ3 సెడాన్ సరికొత్త డిజైన్, ఫీచర్లు మరియు టెక్నాలజీతో మార్కెట్లోకి రానుంది. ఇందులో 1.5-లీటర్ (35 టిఎఫ్‌ఎస్‌ఐ) పెట్రోల్ ఇంజన్ ఉంటుంది.

కొత్త తరం ఏ3 సెడాన్ మరియు క్యూ3 ఎస్‌యూవీలను లాంచ్ చేయనున్న ఆడి ఇండియా

ఈ ఇంజన్ గరిష్టంగా 150 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సెవన్-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్ ద్వారా జతచేయబడి ఉంటుంది.

MOST READ:కరోనా ఎఫెక్ట్: 700 మందికి పైగా అరెస్ట్.. ఎక్కడో తెలుసా?

కొత్త తరం ఏ3 సెడాన్ మరియు క్యూ3 ఎస్‌యూవీలను లాంచ్ చేయనున్న ఆడి ఇండియా

గడచిన 2020 ప్రారంభంలో భారత మార్కెట్లోకి ప్రవేశించిన ఆడి ఏ3 సెడాన్, బ్రాండ్ యొక్క సిగ్నేచర్ న్యూ-ఏజ్ డిజైన్ శైలి మరియు పదునైన స్టైలింగ్ అంశాలను కలిగి ఉంటుంది. కాగా, కొత్తగా రానున్న 2022 ఆడి ఏ3 సెడాన్ మునుపటి కన్నా మరింత మెరుగ్గా ఉంటుందని సమాచారం.

కొత్త తరం ఏ3 సెడాన్ మరియు క్యూ3 ఎస్‌యూవీలను లాంచ్ చేయనున్న ఆడి ఇండియా

ఈ కొత్త తరం ఆడి ఏ3 సెడాన్‌లో డిజైన్, ఫీచర్ల పరంగా మార్పులు ఉన్నప్పటికీ, కొలతల పరంగా మాత్రం ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. క్యాబిన్ లోపల కూడా ముఖ్యమైన మార్పులను ఆశించవచ్చు. ఇందులో ముందు సీటు ప్రయాణీకుల కోసం మెరుగైన క్యాబిన్ స్థలం ఉంటుందని తెలుస్తోంది.

MOST READ:రైతులకు గుడ్ న్యూస్.. ట్రాక్టర్ కావాలంటే ఫ్రీగా వాడుకోవచ్చు.. ఎక్కడంటే?

కొత్త తరం ఏ3 సెడాన్ మరియు క్యూ3 ఎస్‌యూవీలను లాంచ్ చేయనున్న ఆడి ఇండియా

2022 ఆడి క్యూ3

పైన చెప్పినట్లుగా, కొత్త తరం 2022 ఆడి క్యూ3 ఎస్‌యూవీని కూడా ఫోక్స్‌వ్యాగన్ యొక్క ఎమ్‌క్యూబి ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించనున్నారు. ప్రస్తుత తరం ఆడి క్యూ3 ఎస్‌యూవీతో పోలిస్తే, ఈ కొత్త ఆడి క్యూ3 మోడల్ మరింత పెద్దదిగా కనిపిస్తుంది. దీని డిజైన్ మరియు స్టైలింగ్ ఆడి యొక్క అధిక నాణ్యత గల ఎస్‌యూవీల నుండి ప్రేరణ పొందినట్లు అనిపిస్తుంది.

కొత్త తరం ఏ3 సెడాన్ మరియు క్యూ3 ఎస్‌యూవీలను లాంచ్ చేయనున్న ఆడి ఇండియా

ప్రపంచవ్యాప్తంగా, ఆడి క్యూ3 ఎస్‌యూవీ 150 బిహెచ్‌పి 1.5 లీటర్ (35 టిఎఫ్‌ఎస్‌ఐ), 190 బిహెచ్‌పి 2.0 లీటర్ (40 టిఎఫ్‌ఎస్‌ఐ), 230 బిహెచ్‌పి 2.0 లీటర్ (45 టిఎఫ్‌ఎస్‌ఐ), 150 బిహెచ్‌పి 2.0 లీటర్ డీజిల్ మరియు 190 బిహెచ్‌పి 2.0 లీటర్ డీజిల్ ఇంజన్‌తో సహా పలు ఫార్మాట్లలో లభిస్తుంది.

MOST READ:భారత్‌లో విడుదలైన 2021 జిఎల్‌ఎ & ఎఎమ్‌జి జిఎల్‌ఎ 35; ధర & వివరాలు

కొత్త తరం ఏ3 సెడాన్ మరియు క్యూ3 ఎస్‌యూవీలను లాంచ్ చేయనున్న ఆడి ఇండియా

కాగా, ఈ జర్మన్ కార్ బ్రాండ్ ఇప్పటికే భారతదేశంలో ఈ శ్రేణి నుండి తమ డీజిల్ పవర్‌ట్రైన్‌లను తొలగించింది. ఈ నేపథ్యంలో, కొత్తగా రానున్న 2022 ఆడి క్యూ3 ఎస్‌యూవీలో తక్కువ పవర్‌తో కూడిన పెట్రోల్ ఇంజన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

Read more on: #ఆడి #audi
English summary
Audi India To Launch New Gen A3 Sedan And Q3 SUV By 2022, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X