ఆడి ఆర్ఎస్5 స్పోర్ట్‌బ్యాక్‌ వచ్చేసింది; ధర & వివరాలు ఇక్కడున్నాయ్

ప్రముఖ జర్మనీ లగ్జరీ కార్ బ్రాండ్ 'ఆడి' భారత మార్కెట్లో తన ఆర్ఎస్5 స్పోర్ట్‌బ్యాక్‌ను విడుదల చేసింది. కొత్త ఆడి ఆర్ఎస్5 ధర దేశీయ మార్కెట్లో రూ. 1.04 కోట్లు. కంపెనీ ఈ కొత్త వేరియంట్ యొక్క బుకింగ్స్ ప్రారంభించింది. కొనుగోలుచేయాలనుకునే కస్టమర్లు ఆన్లైన్ లో లేదా కంపెనీ డీలర్షిప్ లో గాని బుక్ చేసుకోవచ్చు. ఆర్ఎస్5 స్పోర్ట్‌బ్యాక్‌ డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.

ఆడి ఆర్ఎస్5 స్పోర్ట్‌బ్యాక్‌ వచ్చేసింది; ధర & వివరాలు ఇక్కడున్నాయ్

కొత్త ఆడి ఆర్ఎస్5 స్పోర్ట్‌బ్యాక్‌ వివిధ కలర్ అప్సన్లలో అందుబాటులో ఉంటుంది. అవి నార్డో గ్రే, టర్బో బ్లూ, టాంగో రెడ్, మిథోస్ బ్లాక్, గ్లేసియర్ వైట్, నవర్రా బ్లూ, సోనోమా గ్రీన్ మరియు డేటోనా గ్రే కలర్స్.

ఆడి ఆర్ఎస్5 స్పోర్ట్‌బ్యాక్‌ వచ్చేసింది; ధర & వివరాలు ఇక్కడున్నాయ్

ఆర్ఎస్5 స్పోర్ట్‌బ్యాక్‌ వి6 2.9-లీటర్ టిఎఫ్ఎస్ఐ ట్విన్-టర్బో ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 6,700 ఆర్‌పిఎమ్ వద్ద 443 బిహెచ్‌పి పవర్ మరియు 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 600 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 8 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

ఆడి ఆర్ఎస్5 స్పోర్ట్‌బ్యాక్‌ వచ్చేసింది; ధర & వివరాలు ఇక్కడున్నాయ్

సెల్ఫ్-లాకింగ్ సెంటర్ డిఫరెన్షియల్‌తో బ్రాండ్ యొక్క క్వాట్రో పర్మినెంట్ ఆల్-వీల్ డ్రైవ్ ద్వారా పవర్ నాలుగు చక్రాలకు సెట్ చేయబడింది. మెరుగైన పనితీరు కోసం ఆడి డ్రైవ్ సెలెక్ట్, ఆర్ఎస్ స్పోర్ట్స్ సస్పెన్షన్ మరియు ఆర్ఎస్ స్టీల్ బ్రేక్‌లతో కూడా ఈ సెడాన్ అందించబడుతుంది.

ఆడి ఆర్ఎస్5 స్పోర్ట్‌బ్యాక్‌ వచ్చేసింది; ధర & వివరాలు ఇక్కడున్నాయ్

కొత్త ఆర్ఎస్5 స్పోర్ట్ బ్యాక్ హానీకూంబ్ గ్రిల్‌తో మంచి దూకుడు వైఖరిని కలిగి ఉంటుంది. అంతే కాకూండా ఈ సెడాన్ యొక్క దూకుడు రూపాన్ని పెంచడానికి యాక్టివ్ ఏరో మరియు ఫ్రంట్ లిప్‌తో అగ్రెసివ్ బంపర్‌ను కూడా కలిగి ఉంది. అంతే కాకుండా ఇందులో ఎల్ఈడీ మాట్రిక్స్ హెడ్ లాంప్ విత్ డిఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు, 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, రియర్ స్పాయిలర్, ఫ్రేమ్‌లెస్ డోర్స్ మరియు బాడీ-కలర్ ఎక్స్‌టీరియర్ మిర్రర్ హౌసింగ్‌ వంటివి ఉన్నాయి.

ఆడి ఆర్ఎస్5 స్పోర్ట్‌బ్యాక్‌ వచ్చేసింది; ధర & వివరాలు ఇక్కడున్నాయ్

ఆర్ఎస్5 స్పోర్ట్ బ్యాక్ లోని ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో పెర్ఫార్మెన్స్ సెలూన్ అల్కాంటారా మరియు లెదర్‌తో పాటు డ్యాష్‌బోర్డ్ మరియు క్యాబిన్ అంతటా అల్యూమినియం ఉంటుంది. ఇందులో స్పోర్ట్ సీట్లు, త్రీ-స్పోక్ లెదర్ స్టీరింగ్ వీల్, పాడిల్ షిఫ్టర్లు, స్టెయిన్‌లెస్ స్టీల్ పెడల్స్ & ఫుట్‌రెస్ట్ మరియు ఆర్ఎస్ స్కఫ్ ప్లేట్లు ఉన్నాయి.

ఆడి ఆర్ఎస్5 స్పోర్ట్‌బ్యాక్‌ వచ్చేసింది; ధర & వివరాలు ఇక్కడున్నాయ్

స్పోర్టీ ఇంటీరియర్‌లతో పాటు, ఆర్ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ 12.3 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో బ్రాండ్ యొక్క వర్చువల్ కాక్‌పిట్ ప్లస్‌తో సహా అనేక ఫీచర్స్ తో లోడ్ చేయబడి ఉంటుంది. వీటితో పాటు 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, ఆపిల్ కార్ప్లే & ఆండ్రాయిడ్ ఆటో, 3-జోన్ ఎయిర్ కండిషనింగ్, యాంబియంట్ లైటింగ్, క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్, పవర్డ్ టెయిల్‌గేట్, పనోరమిక్ సన్‌రూఫ్, 10-స్పీకర్ ఆడియో సిస్టమ్ మరియు ఎమ్ఎమ్ఐ నావిగేషన్ ప్లస్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

ఆడి ఆర్ఎస్5 స్పోర్ట్‌బ్యాక్‌ వచ్చేసింది; ధర & వివరాలు ఇక్కడున్నాయ్

కొత్త ఆడి ఆర్ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ 465 లీటర్ల బూట్ స్పేస్ కలిగి ఉంటుంది. ఇందులో అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, యాంటీ-థెఫ్ట్ వీల్ బోల్ట్‌లు, హోల్డ్ అసిస్ట్, ఆటో-డిమ్మింగ్ రియర్-వ్యూ మిర్రర్, స్టెబిలిటీ కంట్రోల్ మరియు ఏబీఎస్ విత్ ఈబిడి వంటివి ఉన్నాయి.

ఆడి ఆర్ఎస్5 స్పోర్ట్‌బ్యాక్‌ వచ్చేసింది; ధర & వివరాలు ఇక్కడున్నాయ్

దేశీయ మార్కెట్లో ఆడి కంపెనీ తన ఆర్ఎస్5 స్పోర్ట్‌బ్యాక్‌ను ప్రారంభించడం ద్వారా తన పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. మంచి పర్ఫామెన్స్ మరియు ప్రాక్టికాలిటీని కలిగి ఉన్న ఫోర్ డోర్స్ సెడాన్ కోసం వేచి చూస్తున్న కొనుగోలుదారులకు ఈ కొత్త ఆర్ఎస్5 చాలా నమ్మదగినదిగా ఉంటుంది. కొత్త ఆడి ఆర్ఎస్5 స్పోర్ట్‌బ్యాక్‌ దేశీయ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ ఎఎమ్‌జి మరియు బీఎండబ్ల్యూ ఎమ్3 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

Read more on: #ఆడి #audi
English summary
Audi rs5 sportback launched at rs 1 04 crore features engine performance details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X