డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త స్పోర్ట్స్ కార్ 'ఆడి ఎస్5' స్పోర్ట్‌బ్యాక్ ఇప్పుడు డీలర్‌షిప్‌లను చేరుకోవటం ప్రారంభించింది. మార్కెట్లో ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.79.06 లక్షలుగా ఉంది.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్

తాజాగా, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న ఓ ఆడి డీలర్‌షిప్‌లో గ్రీన్ మెటాలిక్ కలర్‌లో ఉన్న ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ కారును ప్రదర్శనకు ఉంచారు. ఇప్పటికే, దేశవ్యాప్తంగా ఈ కారు బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. త్వరలోనే ఈ మోడల్ డెలివరీలు కూడా ప్రారంభం కానున్నాయి.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్

ఈ కొత్త 2021 ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ మోడల్‌ను కంపెనీ సిబియు (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్‌లో పూర్తిగా విదేశాల్లో తయారు చేసి, భారత్‌కు దిగుమతి చేసుకొని విక్రయిస్తోంది. మునుపటి తరం మోడల్‌తో పోల్చుకుంటే, ఈ కొత్త తరం మోడల్‌లో అనేక డిజైన్, ఫీచర్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి.

MOST READ:స్పాట్ టెస్ట్‌లో కనిపించిన సుజుకి బర్గ్‌మన్ ఎలక్ట్రిక్ స్కూటర్; వివరాలు

డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్

ఈ పెర్ఫార్మెన్స్ వెర్షన్ కారులో పవర్‌ఫుల్ 3.0-లీటర్ వి6 టిఎఫ్‌ఎస్‌ఐ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 354 బిహెచ్‌పి పవర్‌ను మరియు 500 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ టిప్ట్రోనిక్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ యూనిట్‌తో జతచేయబడి ఉంటుంది.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్

ఈ కారు ఆడి బ్రాండ్ యొక్క సిగ్నేచర్ ‘క్వాట్రో' ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఇది ఇంజన్ నుండి వెలువడే శక్తిని నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేస్తుంది. ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ కారు కేవలం 5 సెకన్లలోనే గంటకు 0 - 100 కి.మీ వేగాన్ని చేరుకుంటుందని కంపెనీ పేర్కొంది.

MOST READ:వాహనదారులకు గుడ్ న్యూస్.. మళ్ళీ పెరిగిన డ్రైవింగ్ లైసెన్స్ గడువు, లాస్ట్ డేట్ ఎప్పుడంటే

డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్

ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ మోడల్‌లో ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లతో కూడిన ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు మరియు ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, ‘ఎస్ 5' బ్యాడ్జింగ్‌తో కూడిన పెద్ద సిగ్నేచర్ హనీకోంబ్ ఫ్రంట్ గ్రిల్, 19 ఇంచ్ అల్లాయ్ వీల్స్, బ్లాకవుట్ సైడ్ మిర్రర్స్, స్లైడింగ్ రూఫ్‌లైన్ మరియు షార్క్ ఫిన్ యాంటెన్నా వంటి డిజైన్ ఫీచర్లను గమనించవచ్చు.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్

కొత్త ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ ఇంటీరియర్ ఫీచర్లలో వర్చువల్ కాక్‌పిట్, ఆల్-బ్లాక్ ఇంటీరియర్ థీమ్, 10 ఇంచ్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 12.2 ఇంచ్ డిజిటల్ ఎమ్ఐడి స్క్రీన్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పానోరమిక్ గ్లాస్ రూఫ్, 3డి సరౌండ్ సిస్టమ్‌తో కూడిన 19-స్పీకర్ ఆడియో సిస్టమ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:ట్రాఫిక్ సిగ్నెల్‌లో డాన్స్ చేసిన కెటిఎమ్ బైక్ రైడర్ [వీడియో]

డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్

ఆడి తమ లేటెస్ట్ వెర్షన్ ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ మోడల్‌ను తొలిసారిగా 2019 ఫ్రాంక్‌ఫర్ట్ ఆటో షోలో ఆవిష్కరించబడింది. ఆ తర్వాత, గత ఏడాది చివర్లో ఈ మోడల్‌ను అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసింది. ఇప్పుడు ఇది మన దేశంలో కూడా లభిస్తుంది.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్

ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ ఈ విభాగంలో మెర్సిడెస్-ఏఎమ్‌జి సి43 మరియు రాబోయే బిఎమ్‌డబ్ల్యూ ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

MOST READ:మీకు తెలుసా.. మారుతి సుజుకి బాలెనోతో 22 గంటల్లో 1,850 కిమీ ప్రయాణం.. కొత్త రికార్డ్ కైవసం

Source: Supercars & Superbikes In Ahmedabad

Most Read Articles

Read more on: #ఆడి #audi
English summary
Audi S5 Sportback Started Arriving To Dealerships In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X