2021 A7 L కారుని ఆవిష్కరించిన ఆడి; వివరాలు

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ అయిన ఆడి కంపెనీ యొక్క ఉత్పత్తులకు భారత మార్కెట్లో మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగా కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఆడి కంపెనీ మరో కొత్త కారుని ఆవిష్కరించింది.

2021 A7 L కారుని ఆవిష్కరించిన ఆడి; వివరాలు

ఆడి కంపెనీ తన కొత్త ఎ7 ఎల్ కారును ఇటీవల 2021 షాంఘై ఆటో షోలో ఆవిష్కరించింది. ఈ కొత్త ఆడి ఎ 7 ఎల్ కారుని బ్రాండ్ యొక్క చైనీస్ భాగస్వామి ఎస్ఐసి సహకారంతో అభివృద్ధి చేశారు. షాంఘై ఆటో షోలో ఆవిష్కరించిన ఈ కొత్త ఆడి ఎ 7 ఎల్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

2021 A7 L కారుని ఆవిష్కరించిన ఆడి; వివరాలు

ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రధాన కార్ల తయారీదారులు చైనాపై ఆధిపత్యం చెలాయించడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంటాయి. ఇప్పడు ఈ నేపథ్యంలో భాగంగానే ఆడి కంపెనీ తన ఎ7 ఎల్ కారుని చైనాలో ఆవిష్కరించబడింది. ఈ కొత్త 2021 ఆడి ఎ7 ఎల్ కేవలం ఎక్స్‌టెండెడ్-వీల్‌బేస్ మోడల్ కాదు ఎందుకంటే దీనికి కొన్ని స్పెషల్ ఫీచర్స్ కలిగి ఉంటుంది.

MOST READ:కొత్త కారు కొన్న కన్నడ సీరియల్ యాక్టర్ భరత్ బోపన్న.. పూర్తి వివరాలు

2021 A7 L కారుని ఆవిష్కరించిన ఆడి; వివరాలు

ఈ కొత్త ఆడి ఎ7 ఎల్ లిఫ్ట్ బ్యాక్ డిజైన్‌కు విరుద్ధంగా నార్మల్ సెడాన్ బాడీ స్టైల్ కలిగి ఉంటుంది. ఇది చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఈ కారు యొక్క మొత్తం పొడవు 5,076 మిమీ. అయితే ఇందులో ఉన్న వీల్‌బేస్ స్టాండర్డ్ మోడల్ కంటే 98 మి.మీ ఎక్కువ పొడవు కలిగి ఉంటుంది.

2021 A7 L కారుని ఆవిష్కరించిన ఆడి; వివరాలు

ఆడి ఏ8 తో పోలిస్తే ఎ7 ఎల్ చూడటానికి చిన్నదిగా ఉన్నప్పటికీ వీల్‌బేస్ పొడవు కొంత ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా ఆడి ఎ7 స్పోర్ట్‌బ్యాక్ మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త ఆడి ఎ7 ఎల్ డిజైన్ లో పెద్దగా మార్పు లేదని అనిపిస్తుంది. ఈ కొత్త కారు లోపలి భాగం దాదాపుగా అదేవిధంగా ఉంటుంది.

MOST READ:సమంత మనసు ఆకాశమంత.. దీనికి ఇదే నిలువెత్తు నిదర్శనం

2021 A7 L కారుని ఆవిష్కరించిన ఆడి; వివరాలు

2021 ఆడి ఎ 7 ఎల్ కారు 3.0-లీటర్ టర్బోచార్జ్డ్ వి 6 ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 335 బిహెచ్‌పి పవర్ మరియు 500 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. నాలుగు చక్రాలకు శక్తిని దాని క్వాట్రో ఏడబ్ల్యుడి సిస్టం ద్వారా పంపబడుతుంది. ఇంజిన్ 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

2021 A7 L కారుని ఆవిష్కరించిన ఆడి; వివరాలు

2021 ఆడి ఎ7 ఎల్ కారులో ఎయిర్ సస్పెన్షన్ సెటప్ ఉంది. ఆడి ఎ7 ఎల్ యొక్క మొదటి వెర్షన్ యొక్క ఉత్పత్తిని కేవలం 1,000 యూనిట్లకు పరిమితం చేసింది. 2021 ఆడి ఎ7 ఎల్ త్వరలో చైనాలో విడుదల కానుంది. ఈ కొత్త కారు సాధారణ A7 స్పోర్ట్‌బ్యాక్‌తో పాటు అమ్మబడుతుంది. 2025 నాటికి ఏటా ఒక మిలియన్ యూనిట్లను చేరుకోవాలని ఆడి లక్ష్యంగా పెట్టుకుంది.

MOST READ:2021 షాంఘై ఆటో షోలో టెస్లా కంపెనీపై విరుచుకుపడ్డ యువతి [వీడియో]

2021 A7 L కారుని ఆవిష్కరించిన ఆడి; వివరాలు

ఈ కొత్త ఆడి ఎ 7 ఎల్ కారు చాలావరకు అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉండి వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది, అంతే కాకుండా ఇది మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. కావున అంతర్జాతీయ మార్కెట్లో ఈ కారు మంచి అమ్మకాలను కొనసాగించే అవకాశం ఉంటుంది. అయితే భారత మార్కెట్లో ఈ కారు యొక్క విడుదల గురించి కంపెనీ ఎటువంటి అధికారిక సమాచారం అందివ్వలేదు.

Most Read Articles

Read more on: #ఆడి #audi
English summary
Audi Unveils 2021 A7 L Sedan In Shanghai Auto Show. Read in Telugu.
Story first published: Wednesday, April 21, 2021, 12:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X