విడుదలకు ముందే భారత్‌కు చేరుకున్న మొట్టమొదటి టెస్లా మోడల్ 3 కారు

అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా, భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసినదే. భారతదేశంలో తమ ఎలక్ట్రిక్ కార్ల వ్యాపారాన్ని ప్రారంభించేందుకు టెస్లా బెంగుళూరులో ఓ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ కార్ బ్రాండ్ భారత ఎంట్రీకి సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరుగుతోంది.

విడుదలకు ముందే భారత్‌కు చేరుకున్న మొట్టమొదటి టెస్లా మోడల్ 3 కారు

ఇదిలా ఉంటే, టెస్లా బ్రాండ్ కార్లు అధికారికంగా భారతదేశంలోకి ప్రవేశించకముందే కొందరు ధనవంతులు వీటిని కొనుగోలు కూడా చేసేస్తున్నారు. టెస్లా ఇండియా సంస్థ నుండి కాకుండా, కార్ ఇంపోర్ట్ కంపెనీల సాయంతో, విదేశాల్లో తయారైన టెస్లా కార్లను అక్కడే కొనుగోలు చేసి, ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నారు.

విడుదలకు ముందే భారత్‌కు చేరుకున్న మొట్టమొదటి టెస్లా మోడల్ 3 కారు

తాజాగా, భారతదేశంలోనే మొట్టమొదటి 'టెస్లా మోడల్ 3' ఎలక్ట్రిక్ కారు బెంగుళూరులో ప్రత్యక్షమైంది. ఈ మేరకు ఆటోమొబిలి ఆర్డెంట్ అనే కంపెనీ కొన్ని ఫొటోలను తమ ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే, బెంగుళూరులో ఈ టెస్లా మోడల్ 3 కారును ఎవరు కొనుగోలు చేశానే విషయాన్ని మాత్రం సదరు కంపెనీ వెల్లడించలేదు.

విడుదలకు ముందే భారత్‌కు చేరుకున్న మొట్టమొదటి టెస్లా మోడల్ 3 కారు

ఆ పోస్టులో "భారతదేశం యొక్క మొట్టమొదటి టెస్లా మోడల్ బెంగళూరుకు చేరుకుంది. బెంట్లీ ముల్సాన్ ఈడబ్ల్యుబి సెంటెనరీ ఎడిషన్ మరియు పోర్స్చే 911 జిటి3 ఆర్ఎస్ వంటి కార్లతో ఇది గ్యారేజీని పంచుకోనున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్‌పై పెట్టే ఖర్చును ఆదాయ చేయడానికి ఇదొక చక్కని మార్గం!" అని ఆటోమొబిలి ఆర్డెంట్ పేర్కొంది.

విడుదలకు ముందే భారత్‌కు చేరుకున్న మొట్టమొదటి టెస్లా మోడల్ 3 కారు

బెంగుళూరుకి చెందిన ధనిక వ్యాపరవేత్తలలో ఒకరు ఈ కారును విదేశాల నుండి కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. టెస్లా సంస్థ భారతదేశంలోకి అధికారికంగా ప్రవేశించిన తర్వాత, ఆ సంస్థ విడుదల చేయబోయే మొట్టమొదటి కారు మోడల్ 3. ఇది టెస్లా నుండి లభిస్తున్న ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కారు.

విడుదలకు ముందే భారత్‌కు చేరుకున్న మొట్టమొదటి టెస్లా మోడల్ 3 కారు

అమెరికా మార్కెట్లో టెస్లా మోడల్ 3 కారు ప్రారంభ ధర 39,990 డాలర్లు. అంటే, మనదేశ కరెన్సీలో సుమారు రూ.30 లక్షల రూపాయలు. ఆరంభంలో టెస్లా ఈ కార్లను విదేశాల నుండి ఇండియాకు దిగుమతి చేసుకుని విక్రయించే అవకాశం ఉంది. కాబట్టి, అధిక దిగుమతి సుంకాల కారణంగా ఈ కారు ధర సుమారు రూ.70-80 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండొచ్చని అంచనా.

విడుదలకు ముందే భారత్‌కు చేరుకున్న మొట్టమొదటి టెస్లా మోడల్ 3 కారు

టెస్లా మోడల్ 3 కారును కస్టమర్లు తమకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. కస్టమర్ ఎంచుకునే విధానాన్ని బట్టి ఈ ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ, రేంజ్, అటానమస్ డ్రైవింగ్ వంటి ఫీచర్లు మారుతూ ఉంటాయి. ఇది రియర్ వీల్ డ్రైవ్ మరియు ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్లతో లభ్యమవుతుంది.

విడుదలకు ముందే భారత్‌కు చేరుకున్న మొట్టమొదటి టెస్లా మోడల్ 3 కారు

రియర్ వీల్ డ్రైవ్ టెస్లా మోడల్ 3 ఎలక్ట్రిక్ కారులోని బ్యాటరీలు పూర్తి చార్జ్‌పై 423 కి.మీ రేంజ్‌ను ఆఫర్ చేస్తాయి. ఇది కేవలం 6 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. అలాగే, రెండు మోటార్లు కలిగిన టెస్లా మోడల్ 3 వేరియంట్ పూర్తి చార్జీపై 568 కి.మీ డ్రైవింగ్ రేంజ్‌ను కలిగి ఉంటుంది.

విడుదలకు ముందే భారత్‌కు చేరుకున్న మొట్టమొదటి టెస్లా మోడల్ 3 కారు

టెస్లా మోడల్ 3 కారులో 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, 15.4 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వై-ఫై ఇంటర్నెట్ కనెక్టివిటి, స్మార్ట్ ఫోన్ లేదా కార్డ్ స్టైల్ కీ ద్వారా కీ లెస్ ఎంట్రీ, వాయిస్ ఆధారిత కంట్రోల్స్, 360 డిగ్రీ కెమెరా మరియు సెన్సార్లతో కూడిన అటానమస్ డ్రైవింగ్ సిస్టమ్ (ఆటో పైలట్) వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఫొటో మూలం: AutomobiliArdent

Most Read Articles

Read more on: #టెస్లా #tesla
English summary
Bangalorean Brought First Tesla Model 3 In India, Ahead Of Official Launch. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X