బిఎమ్‌డబ్ల్యూ 2-సిరీస్‌లో కొత్త పెట్రోల్ వేరియంట్ విడుదల: ధర, వివరాలు

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ, భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ లగ్జరీ కార్ 2-సిరీస్ మోడల్‌లో ఓ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే మోడల్‌లో '220ఐ ఎమ్ స్పోర్ట్' వేరియంట్‌గా ఈ కొత్త కారును ప్రవేశపెట్టారు.

బిఎమ్‌డబ్ల్యూ 2-సిరీస్‌లో కొత్త పెట్రోల్ వేరియంట్ విడుదల: ధర, వివరాలు

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ 220ఐ బ్రాండ్ యొక్క ‘ఎమ్ స్పోర్ట్' ప్యాకేజీతో వస్తుంది. ఈ కారును స్థానికంగా తమిళనాడులోని చెన్నైలో ఉన్న బిఎమ్‌డబ్ల్యూ ప్లాంట్‌లోనే అసెంబుల్ చేశారు. బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే 220ఐ ఇప్పుడు దాని రెండు డీజిల్ వేరియంట్‌లతో పాటుగా విక్రయించబడుతుంది మరియు దేశవ్యాప్తంగా అన్ని డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ 2-సిరీస్‌లో కొత్త పెట్రోల్ వేరియంట్ విడుదల: ధర, వివరాలు

పెట్రోల్ ఇంజన్‌తో పనిచేసే ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే 220ఐ ఎమ్ స్పోర్ట్ వేరియంట్ కోసం బుకింగ్స్ కూడా నేటి నుండే ప్రారంభమవుతాయని, ఈ కారు డెలివరీలను కూడా అతి త్వరలోనే ప్రారంభిస్తామని కంపెనీ పేర్కొంది. మార్కెట్లో దీని పరిచయ ధరను రూ.41.90 లక్షలు, ఎక్స్‌షోరూమ్ (ఇండియా)గా నిర్ణయించారు.

MOST READ:లోయలో పడిన లారీని బయటకు లాగేందుకు ఏకమైన ఊరు వాడ..

బిఎమ్‌డబ్ల్యూ 2-సిరీస్‌లో కొత్త పెట్రోల్ వేరియంట్ విడుదల: ధర, వివరాలు

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ 220ఐ ఎమ్ స్పోర్ట్ వేరియంట్‌లో శక్తివంతమైన 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ ట్విన్‌పవర్ టర్బో ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 190 బిహెచ్‌పి పవర్‌ను మరియు 280 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది 8-స్పీడ్ స్టెప్‌ట్రానిక్ స్పోర్ట్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది కేవలం 7.1 సెకండ్ల వ్యవధిలోనే గరిష్టంగా గంటకు 0 - 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ 2-సిరీస్‌లో కొత్త పెట్రోల్ వేరియంట్ విడుదల: ధర, వివరాలు

ఇకపోతే, ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ పెట్రోల్ పవర్డ్ వేరియంట్ దాని ఇతర డీజిల్ వెర్షన్ల మాదిరిగానే అన్ని రకాల ఫీచర్లను మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇందులో ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడి టెయిల్ లైట్లు, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, స్టైలిష్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ మరియు ముందు భాగంలో బిఎమ్‌డబ్ల్యూ సిగ్నేచర్ కిడ్నీ గ్రిల్ మొదలైన ఫీచర్లు ఉంటాయి.

MOST READ:రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ 2-సిరీస్‌లో కొత్త పెట్రోల్ వేరియంట్ విడుదల: ధర, వివరాలు

ఇంటీరియర్స్‌లో రెండు పెద్ద డిస్‌ప్లే స్క్రీన్లు ఉంటాయి. ఇందులో ఒకటి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ (12.3 ఇంచెస్) మరియు మరొకటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (10.25 ఇంచెస్). ఇంకా ఇందులో యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్, రియర్ ఎసి వెంట్స్, ఎలక్ట్రిక్ మెమరీ ఫంక్షన్‌తో కూడిన స్పోర్ట్స్ సీట్స్, పానోరమిక్ గ్లాస్ రూఫ్, 40:20:40 స్ప్లిట్ రియర్ సీట్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ 2-సిరీస్‌లో కొత్త పెట్రోల్ వేరియంట్ విడుదల: ధర, వివరాలు

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే మొత్తం నాలుగు ఎక్స్టీరియర్ పెయింట్ స్కీమ్స్‌తో లభిస్తుంది. అవి: ఆల్పైన్ వైట్, బ్లాక్ సఫైర్, మెల్బోర్న్ రెడ్ మరియు స్టార్మ్ బే. కాగా, ఎమ్ స్పోర్ట్ వేరియంట్లను ప్రత్యేకంగా మిసానో బ్లూ మరియు స్నాపర్ రాక్స్ అనే రెండు అదనపు పెయింట్ స్కీమ్స్‌తో ఆఫర్ చేస్తున్నారు.

MOST READL:ఒక ఛార్జ్‌తో 240 కి.మీ అందించగల సింపుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ; వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ 2-సిరీస్‌లో కొత్త పెట్రోల్ వేరియంట్ విడుదల: ధర, వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ తన 2 సిరీస్‌లో కొత్త 220ఐ ఎమ్ స్పోర్ట్ పెట్రోల్ వేరియంట్‌ను చేర్చడం ద్వారా కంపెనీ ఈ మోడల్ లైనప్‌ను మరింత విస్తరించింది. ఈ కారు 220డి స్పోర్ట్ లైన్ మరియు 220డి ఎమ్ స్పోర్ట్ అనే రెండు డీజిల్ వేరియంట్లలో కూడా అందుబాటులో ఉంది. కొత్త బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే, ఈ విభాగంలో మెర్సిడెస్ బెంజ్ నుండి వస్తున్న సరికొత్త 2021 ఏ-క్లాస్ లగ్జరీ సెడాన్‌కి పోటీగా నిలుస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ 2-సిరీస్‌లో కొత్త పెట్రోల్ వేరియంట్ విడుదల: ధర, వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ బ్రాండ్‌కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, ఈ బ్రాండ్ తమ సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లీమోసిన్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ లేటెస్ట్ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ యొక్క కొత్త లాంగ్-వీల్‌బేస్ వెర్షన్‌ను జనవరి 21, 2021వ తేదీన భారత మార్కెట్లో విడుదల కానుంది.

MOST READ:గుడ్ న్యూస్.. రెనాల్ట్ కార్లపై అదిరిపోయే డిస్కౌంట్స్.. ఏ వేరియంట్‌పై ఎంతో చూడండి

బిఎమ్‌డబ్ల్యూ 2-సిరీస్‌లో కొత్త పెట్రోల్ వేరియంట్ విడుదల: ధర, వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లీమోసిన్‌ ఈ విభాగంలో కొత్త 2021 ఆడి ఏ4 మోడల్‌కు పోటీగా నిలుస్తుంది. ఇది దేశీయ విపణిలో లభ్యం కానున్న పొడవైన మరియు విశాలమైన ఎంట్రీ లెవల్ లగ్జరీ సెడాన్‌గా ఉంటుంది. ఈ మోడల్ కోసం కంపెనీ ఇప్పుడు అధికారికంగా బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
BMW 2 Series Gran Coupe 220i M Sport Petrol Variant Launched In India. Price, Specs and Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X