భారత్‌లో అడుగుపెట్టిన కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్; ధర & వివరాలు

ప్రముఖ లగ్జరీ కార్ తయారీ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ తమ కొత్త 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ యొక్క ప్రారంభ ధర ఇప్పుడు రూ. 51.50 లక్షలు (ఎక్స్‌షోరూమ్,ఇండియా). లిమోసిన్ వెర్షన్ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న స్టాండర్డ్ 3 సిరీస్ యొక్క లాంగ్-వీల్ బేస్ వెర్షన్. ఈ కొత్త కార్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

భారత్‌లో అడుగుపెట్టిన కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్; ధర & వివరాలు

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ మూడు వేరియంట్లలో అందించబడుతుంది. ఇందులో టాప్-స్పెక్ మోడల్ ధర 53.90 లక్షలు. కొత్త 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ యొక్క బుకింగ్ ఈ నెల ప్రారంభంలో ప్రారంభమైంది. సెడాన్ బుక్ చేసుకునే కస్టమర్ల కోసం కంపెనీ ప్రత్యేక ప్రయోజనాలను ప్రకటించింది.

భారత్‌లో అడుగుపెట్టిన కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్; ధర & వివరాలు

విడుదలకు ముందు 3 సిరీస్ లిమోసిన్ బుక్ చేసుకున్న మొదటి 50 మంది వినియోగదారులకు లక్ష రూపాయల విలువైన కాంప్లిమెంటరీ ‘కంఫర్ట్ ప్యాకేజీ' అందుతుందని బిఎమ్‌డబ్ల్యూ పేర్కొంది. కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ లిమోసిన్ డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.

MOST READ:అమెరికా కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్ ఉపయోగించే 'దెయ్యం' కారు గురించి తెలుసా?

భారత్‌లో అడుగుపెట్టిన కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్; ధర & వివరాలు

కొత్త బీఎండబ్ల్యూ కొలతల విషయానికి వస్తే, ఈ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ మోడల్ 4,819 మిమీ పొడవు ఉంటుంది. ఇది స్టాండర్డ్ మోడల్ కంటే 110 మిమీ పొడవు ఎక్కువగా ఉంటుంది. 1827 మిమీ వెడల్పు మరియు 1,463 మిమీ ఎత్తు కలిగి ఉంటుంది.లిమోసిన్ వెర్షన్‌ 2961 మిమీ వీల్‌బేస్ కలిగి ఉంటుంది.

భారత్‌లో అడుగుపెట్టిన కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్; ధర & వివరాలు

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ భారతదేశంలో అమ్మకానికి ఉన్న స్టాండర్డ్ సెడాన్ నుండి అదే డిజైన్ మరియు స్టైలింగ్ అంశాలను ముందుకు తీసుకువెళుతుంది. ఇందులో ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, టర్న్ ఇండికేటర్లతో కూడిన ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, మధ్యలో పెద్ద కిడ్నీ షేప్ గ్రిల్, స్టైలిష్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, వెనుకవైపు 3 డీఈడీ టెయిల్ లైట్లు ఉన్నాయి. కొత్త లిమోసిన్ వెర్షన్ పనోరమిక్ సన్‌రూఫ్ మరియు అనేక ఇతర ఫీచర్స్ కూడా అందుకుంటుంది.

MOST READ:బైక్ మ్యూజియంలో అగ్నికి ఆహుతైన అరుదైన వాహనాలు

భారత్‌లో అడుగుపెట్టిన కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్; ధర & వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ యొక్క క్యాబిన్ స్టాండర్డ్స్ మోడల్ కి సమానంగా ఉంటుంది. అయితే ఇది ఇప్పుడు ఎక్కువ స్థలంతో వస్తుంది. ముందు మరియు వెనుక వైపున ప్రయాణీకులకు ఇప్పుడు మరింత విశాలమైన మరియు సౌకర్యవంతమైన క్యాబిన్‌ లభిస్తుంది. ఇది మునుపటికంటే మరింత ప్రీమియం అనుభూతిని ఇస్తుంది.

భారత్‌లో అడుగుపెట్టిన కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్; ధర & వివరాలు

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ కూడా ఇంటీరియర్ ఫీచర్స్ కూడా స్టాండర్డ్ మోడల్ నుండి ముందుకు తీసుకువెళుతుంది. ఇందులో ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు బ్రాండ్ యొక్క సరికొత్త ఐడ్రైవ్ టెక్నాలజీ, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్ మరియు 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది.

MOST READ:బువ్వ తిను, బుల్లెట్ బైక్ పట్టుకెళ్లు: రాయల్ ఎన్‌ఫీల్డ్ 'బుల్లెట్' థాలి ఛాలెంజ్

భారత్‌లో అడుగుపెట్టిన కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్; ధర & వివరాలు

కొత్త లిమోసిన్ వెర్షన్ స్టాండర్డ్ సెడాన్ మాదిరిగానే పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలతో వస్తుంది. ఇది 2.0 లీటర్ ట్విన్‌పవర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 258 బిహెచ్‌పి మరియు 400 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 6.2 సెకన్లలో పెట్రోల్ మోడల్ కేవలం 6.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ వేగవంతం అవుతుందని బిఎమ్‌డబ్ల్యూ పేర్కొంది.

భారత్‌లో అడుగుపెట్టిన కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్; ధర & వివరాలు

ఇందులో ఉన్న 2.0-లీటర్ డీజిల్ యూనిట్ 188 బిహెచ్‌పి మరియు 400 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను అందిస్తుంది. డీజిల్ మోడల్ కేవలం 7.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ / గం నుండి వేగవంతం అవుతుంది. రెండు ఇంజన్లు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కి స్టాండర్డ్ గా జతచేయబడతాయి.

MOST READ:వామ్మో.. ఆరుగురు పర్యాటకులున్న కారుని నోటితో లాగేసిన పులి [వీడియో]

భారత్‌లో అడుగుపెట్టిన కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్; ధర & వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ లిమోసిన్ ఇప్పుడు దాని విభాగంలో పొడవైన కారు. భారత మార్కెట్లో కొత్త 3 సిరీస్ లిమోసిన్ ఆడి ఎ 4 ఫేస్‌లిఫ్ట్, మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ మరియు ఇటీవల ప్రవేశపెట్టిన 2021 వోల్వో ఎస్ 60 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కొత్త కారు మునుపటికంటే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

Most Read Articles

English summary
BMW 3 Series Gran Limousine Launched In India. Read in Telugu.
Story first published: Thursday, January 21, 2021, 13:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X