భారత్‌లో విడుదలైన బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి ఫేస్‌లిఫ్ట్; ధర & వివరాలు

ప్రముఖ లగ్జరీ వాహన తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా తన 6 సిరీస్ జిటి ఫేస్‌లిఫ్ట్‌ను భారతదేశంలో విడుదల చేసింది. కొత్త బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి ప్రారంభ ధర రూ. 67.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ లగ్జరీ-సెడాన్ యొక్క డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి.

భారత్‌లో విడుదలైన బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి ఫేస్‌లిఫ్ట్; ధర & వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్‌ను ఒక పెట్రోల్, రెండు డీజిల్‌తో సహా మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంచారు. బిఎమ్‌డబ్ల్యూ 630 ఐ ఎమ్ స్పోర్ట్ ధర రూ. 67.90 లక్షలు, 620 డి లగ్జరీ లైన్ ధర రూ .68.90 లక్షలు, 630 డి ఎమ్ స్పోర్ట్‌ ధర రూ. 77.90 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) వరకు ఉన్నాయి.

భారత్‌లో విడుదలైన బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి ఫేస్‌లిఫ్ట్; ధర & వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఇది కొత్త డిజైన్ బంపర్, కొత్త ఎల్-ఆకారపు డ్యూయల్ డిఆర్‌ఎల్, ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్స్ మరియు వైడ్ కిడ్నీ గ్రిల్ ఉన్నాయి. వెనుక భాగంలో డ్యూయల్ కలర్ బంపర్ మరియు కొత్త 3 డి ఎల్ఈడి టెయిల్ లాంప్ వంటి వాటిని కలిగి ఉంది.

భారత్‌లో విడుదలైన బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి ఫేస్‌లిఫ్ట్; ధర & వివరాలు

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ అధునాతన ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే, బిఎమ్‌డబ్ల్యూ లైవ్ కాక్‌పిట్, బిఎమ్‌డబ్ల్యూ వర్చువల్ అసిస్టెంట్ కలిగి ఉంది.

భారత్‌లో విడుదలైన బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి ఫేస్‌లిఫ్ట్; ధర & వివరాలు

ఇవి మాత్రమే కాకుండా, ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్, రియర్ సీట్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్, 360 డిగ్రీస్ పార్కింగ్ కెమెరా, ఆటోమేటిక్ పార్కింగ్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ రియర్ సీట్, పనోరమిక్ సన్‌రూఫ్, ఎయిర్ సస్పెన్షన్ వంటివి కూడా ఉన్నాయి.

భారత్‌లో విడుదలైన బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి ఫేస్‌లిఫ్ట్; ధర & వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ మూడు ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 630 ఐ ​​లో 2.0 లీటర్ ఇంజన్ ఉంది, ఇది 258 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 6.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

భారత్‌లో విడుదలైన బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి ఫేస్‌లిఫ్ట్; ధర & వివరాలు

620 డి వేరియంట్ లో 2.0-లీటర్ ఇంజన్ ఉంటుంది. ఇది 190 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 7.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అదే విధంగా 630 డి యొక్క 3.0 లీటర్ ఇంజన్ 265 బిహెచ్‌పి మరియు 620 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. ఇది 6.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

భారత్‌లో విడుదలైన బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి ఫేస్‌లిఫ్ట్; ధర & వివరాలు

ఇప్పుడు వినియోగదారులు వ్యవధి మరియు మైలేజ్ ప్రకారం వివిధ రకాల సేవా ప్రణాళికలను ఎంచుకోవచ్చు. ప్యాకేజీలు కండిషన్ బేస్డ్ సర్వీస్ (సిబిఎస్) మరియు నిర్వహణ పనులను 3 సంవత్సరాల / 40,000 కిలోమీటర్ల నుండి 10 సంవత్సరాల / 2,00,000 కిలోమీటర్ల వరకు ప్రణాళికలతో కవర్ చేస్తాయి. అంతే కాకుండా కంపెనీ నెలవారీ రూ .69,999 ఇఎంఐ వద్ద కూడా దీనిని కొనుగోలు చేసే సదుపాయాన్ని కల్పించింది. దేశీయ మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్, మెర్సిడెస్ ఇ-క్లాస్ ఎల్‌డబ్ల్యుబి కి ప్రత్యర్థిగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, April 8, 2021, 13:54 [IST]
English summary
BMW 6 Series Launched In India. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+