టెస్లాకి పోటీగా వచ్చిన బిఎమ్‌డబ్ల్యూ ఐ4 ఎలక్ట్రిక్ స్పోర్ట్ సెడాన్

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ తమ సరికొత్త ఐ4 ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ సెడాన్ కారును ఆవిష్కరించింది. బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ వార్షిక సదస్సులో, కంపెనీ ఉత్పత్తికి సమీపంలో ఉన్న తమ మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ బిఎమ్‌డబ్ల్యూ ఐ4 ఫోర్-డోర్ గ్రాన్ కూప మోడల్‌ను ప్రదర్శించింది. మరికొద్ది నెలల్లోనే ఈ ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో అందుబాటులోకి రానుంది.

టెస్లాకి పోటీగా వచ్చిన బిఎమ్‌డబ్ల్యూ ఐ4 ఎలక్ట్రిక్ స్పోర్ట్ సెడాన్

బిఎమ్‌డబ్ల్యూ 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా 12 ఆల్-ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించాలనే లక్ష్యంతో ఉంది. బిఎమ్‌బ్ల్యూ ఎలక్ట్రిక్ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో స్పోర్ట్ సెడాన్ రూపంలో వస్తున్న మొదటి కార్ ఈ సరికొత్త 2022 బిఎమ్‌డబ్ల్యూ ఐ4 సెడాన్. అంతేకాకుండా, బ్రాండ్ యొక్క ఐడ్రైవ్ 8 టెక్నాలజీని కలిగిన మొట్టమొదటి కారు కూడా ఇదే.

టెస్లాకి పోటీగా వచ్చిన బిఎమ్‌డబ్ల్యూ ఐ4 ఎలక్ట్రిక్ స్పోర్ట్ సెడాన్

బిఎమ్‌డబ్ల్యూ ఐ4 వివిధ రేంజ్ ఆప్షన్లతో లభ్యం కానుంది. వరల్డ్‌వైడ్ హార్మోనైజ్డ్ లైట్ వెహికల్స్ టెస్ట్ ప్రొసీజర్ (డబ్ల్యుఎల్‌టిపి) ధృవీకరించిన దాని ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ కారు పూర్తి చార్జ్‌పై 590 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. అలాగే, యునైటెడ్ స్టేట్స్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (ఇపిఎ) ప్రకారం, ఇది పూర్తి చార్జ్‌పై 482 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.

MOST READ:ఏప్రిల్ 7 న భారత మార్కెట్లో విడుదల కానున్న 'సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్' ; పూర్తి వివరాలు

టెస్లాకి పోటీగా వచ్చిన బిఎమ్‌డబ్ల్యూ ఐ4 ఎలక్ట్రిక్ స్పోర్ట్ సెడాన్

ఈ ఎలక్ట్రిక్ కారులో కంపెనీ 390 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగించనున్నారు. ఇది గరిష్టంగా 530 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా, ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ కేవలం 4 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. దీని గరిష్ట వేగాన్ని గంటకు 200 కిలోమీటర్లకు పరిమితం చేసినట్లు సమాచారం.

టెస్లాకి పోటీగా వచ్చిన బిఎమ్‌డబ్ల్యూ ఐ4 ఎలక్ట్రిక్ స్పోర్ట్ సెడాన్

బిఎమ్‌డబ్ల్యూ ఐ4 ఎలక్ట్రిక్ గ్రాన్ కూపే కారు కంపెనీ యొక్క క్లార్ (CLAR) ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేస్తున్నారు. ఇదే ప్లాట్‌ఫామ్‌పై ప్రస్తుత తరం 3 సిరీస్ మరియు 4 సిరీస్ మోడళ్లను తయారు చేస్తున్నారు. ఈ కారులో చిన్న బ్యాటరీ ప్యాక్స్‌తో రియర్-వీల్-డ్రైవ్ ఆప్షన్ కలిగిన ఎంట్రీ లెవల్ వేరియంట్లను కూడా ఆఫర్ చేయనున్నట్లు తెలుస్తోంది.

MOST READ:కదిలే కారుపై షాకింగ్ స్టంట్స్ చేసిన పొలిటికల్ లీడర్ కొడుకుపై చర్యలు తీసుకున్న పోలీసులు

టెస్లాకి పోటీగా వచ్చిన బిఎమ్‌డబ్ల్యూ ఐ4 ఎలక్ట్రిక్ స్పోర్ట్ సెడాన్

బిఎమ్‌డబ్ల్యూ గతంలో ప్రదర్శించిన కాన్సెప్ట్ వెర్షన్ ఐ4లోని అనేక డిజైన్ అంశాలు ఈ ప్రొడక్షన్ వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ ఐ4లో కూడా కనిపించనున్నాయి. కాన్సెప్ట్ వెర్షన్‌లో లాంగ్ వీల్‌బేస్, ఫాస్ట్‌బ్యాక్ రూఫ్‌లైన్ మరియు షార్ట్ ఓవర్‌హాంగ్‌లతో ఇది చాలా ఆధునికంగా కనిపించింది. ప్రొడక్షన్ వెర్షన్ కూడా ఇదే తరహా డిజైన్ క్యూలను ముందుకు తీసుకువెళ్తుందని భావిస్తున్నారు.

టెస్లాకి పోటీగా వచ్చిన బిఎమ్‌డబ్ల్యూ ఐ4 ఎలక్ట్రిక్ స్పోర్ట్ సెడాన్

బిఎమ్‌డబ్ల్యూ ఆవిష్కరించిన ఈ కొత్త ఐ4 మోడల్‌లో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్ ఉంటుంది, ఇది చూడటానికి బక్‌టూత్ (కుందేలు ముందు రెండు పళ్లు) మాదిరిగా కనిపిస్తుంది. ఇది సాధారణ బిఎమ్‌డబ్ల్యూ కార్లలో కనిపించే సిగ్నేచర్ కిడ్నీ గ్రిల్‌కు విరుద్ధంగా ఉంటుంది. ఈ గ్రిల్‌పై ఇప్పటికే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

MOST READ:ఈ బుజ్జి కారుకి 4 రోజుల్లో రూ.7.5 కోట్ల ఆర్డర్లు; ఇది ఎక్కడో కాదు మనదేశంలోనే..!

టెస్లాకి పోటీగా వచ్చిన బిఎమ్‌డబ్ల్యూ ఐ4 ఎలక్ట్రిక్ స్పోర్ట్ సెడాన్

కాగా, ఈ కొత్త 2022 బిఎమ్‌డబ్ల్యూ ఐ4 ఎలక్ట్రిక్ స్పోర్ట్ సెడాన్ కోర్, స్పోర్ట్ మరియు ఎఫిషియంట్ అనే మూడు వేర్వేరు డ్రైవింగ్ మోడ్‌లతో వచ్చే అవకాశం ఉంది. ఇందులోని కొత్త కర్వ్డ్ డిస్‌ప్లేలో, 12.3 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే మరియు 14.9 ఇంచ్ కంట్రోల్ డిస్‌ప్లే స్క్రీన్‌లు రెండూ ఒకే యూనిట్‌లో కలిసి ఉంటాయి.

టెస్లాకి పోటీగా వచ్చిన బిఎమ్‌డబ్ల్యూ ఐ4 ఎలక్ట్రిక్ స్పోర్ట్ సెడాన్

బిఎమ్‌డబ్ల్యూ ఐ4 ఎలక్ట్రిక్ కారు ఈ విభాగంలో టెస్లా మోడల్ 3 పెర్ఫార్మెన్స్ మరియు ఆడి ఇ-ట్రోన్ జిటి వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుందని అంచనా.

MOST READ:ఒకరిపై ఒకరు కూర్చుని ప్రమాదకరమైన బైక్ స్టంట్స్ చేసిన యువతులు [వీడియో]

Most Read Articles

English summary
BMW i4 Electric Sport Sedan Revealed, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X