భారత మార్కెట్లో BMW 220i బ్లాక్ షాడో ఎడిషన్ విడుదల.. ధర రూ. 43.40 లక్షలు మాత్రమే..!!

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ (BMW) భారత మార్కెట్లో విక్రయిస్తున్న 2-సిరీస్ (2 Series) లో కొత్తగా 220ఐ బ్లాక్ షాడో ఎడిషన్ (220i Black Shadow Edition) అనే ఓ స్పెషల్ ఎడిషన్ ను విడుదల చేసింది. దేశీయ విపణిలో బిఎమ్‌డబ్ల్యూ 2-సిరీస్ 220ఐ బ్లాక్ షాడో లిమిటెడ్ ఎడిషన్ ధర రూ. 43.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది.

గమనించాల్సిన విషయం ఏంటంటే, కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్ మోడళ్లను కేవలం 24 యూనిట్లు మాత్రమే విక్రయిస్తుంది. ఆ తర్వాత వీటి అమ్మకాలు నిలిపివేస్తుంది. స్టాండర్డ్ బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ (BMW 2 Series) మోడల్ ను ఆధారంగా చేసుకొని, ఈ జర్మన్ కంపెనీ తమ కొత్త లిమిటెడ్ ఎడిషన్ బ్లాక్ షాడో మోడల్ ను ప్రవేశపెట్టింది. కొత్త బిఎమ్‌డబ్ల్యూ 220ఐ బ్లాక్ షాడో ఎడిషన్ (BMW 220i Black Shadow Edition) రూ. 3.25 లక్షల విలువైన వివిధ రకాల M పెర్ఫార్మెన్స్ భాగాలతో వస్తుంది.

భారత మార్కెట్లో BMW 220i బ్లాక్ షాడో ఎడిషన్ విడుదల.. ధర రూ. 43.40 లక్షలు మాత్రమే..!!

బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ఈ కొత్త కారును చెన్నై ప్లాంట్‌లో స్థానికంగా అసెంబుల్ చేస్తోంది మరియు ఇది కేవలం బ్రాండ్ యొక్క ఆన్‌లైన్ పోర్టల్‌లో మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. ఈ కారుని డీలర్‌షిప్ వద్ద కొనుగోలు చేయలేదు. ధర విషయానికి వస్తే, ఇది ఈ లైనప్ లో M స్పోర్ట్ లైన్ వేరియంట్ కంటే రూ. 1.6 లక్షలు ఎక్కువ ధరను కలిగి ఉంటుంది. కేవలం 24 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడిన ఈ కారు ఆల్పైన్ వైట్ మరియు బ్లాక్ సఫైర్ కలర్ ఆప్షన్లలో మాత్రమే లభిస్తుంది.

భారత మార్కెట్లో BMW 220i బ్లాక్ షాడో ఎడిషన్ విడుదల.. ధర రూ. 43.40 లక్షలు మాత్రమే..!!

గతేడాది డిసెంబర్ నెలలో కూడా కంపెనీ ఇదే మోడల్‌ను 220డి (200d) వేరియంట్లో ప్రవేశపెట్టింది మరియు అప్పట్లో ఇది డీజిల్ ఇంజన్ ఆప్షన్ తో మాత్రమే లభ్యమయ్యేది. కాగా, ప్రస్తుతం, ఇందులోని పెట్రోల్ వెర్షన్ (220ఐ) లో బ్లాక్ షాడో ఎడిషన్ ను ప్రవేశపెట్టారు. ఇది ఆల్పైన్ వైట్ మరియు బ్లాక్ సఫైర్ ఎక్స్టీరియర్ రంగులతో సెన్సాటెక్ ఆయిస్టర్ అండ్ బ్లాక్ మరియు సెన్సాటెక్ బ్లాక్ అప్‌హోలెస్ట్రీ ఆప్షన్లతో లభిస్తుంది.

భారత మార్కెట్లో BMW 220i బ్లాక్ షాడో ఎడిషన్ విడుదల.. ధర రూ. 43.40 లక్షలు మాత్రమే..!!

స్టాండర్డ్ బిఎమ్‌డబ్ల్యూ 220ఐ తో పోల్చుకుంటే, ఈ బ్లాక్ షాడో ఎడిషన్ లో కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్స్ ఉంటాయి. ఈ బిఎమ్‌డబ్ల్యూ ఇండివిజువల్ హై-గ్లోస్ షాడో లైన్ ప్యాకేజీ కారు యొక్క బాహ్య భాగాన్ని మరింత అందంగా మార్చుతుంది. ఈ బ్లాక్ షాడో ఎడిషన్ ఎక్ట్సీరియర్ హైలైట్స్ ను గమనిస్తే, ఇందులో బ్లాక్ మెష్-స్టైల్ M ఫ్రంట్ గ్రిల్, బ్లాక్ సైడ్ మిర్రర్స్, M పెర్ఫార్మెన్స్ రియర్ స్పాయిలర్, బ్లాక్ క్రోమ్ ఎగ్జాస్ట్ టిప్స్, ఫ్లోటింగ్ హబ్ క్యాప్స్‌తో జెట్ బ్లాక్ మ్యాట్‌లో ఫినిష్ చేయబడిన 18 ఇంచ్ M పెర్ఫార్మెన్స్ Y-స్పోక్ ఫోర్జ్డ్ అల్లాయ్ వీల్స్ వంటి మార్పులు ఉన్నాయి.

భారత మార్కెట్లో BMW 220i బ్లాక్ షాడో ఎడిషన్ విడుదల.. ధర రూ. 43.40 లక్షలు మాత్రమే..!!

ఇంటీరియర్లలో చేసిన మార్పుల విషయానికి వస్తే, ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ 220ఐ బ్లాక్ షాడో ఎడిషన్ లో ఎలక్ట్రికల్ మెమరీ ఫంక్షన్ తో కూడిన స్పోర్ట్ సీట్లు, పానోరమిక్ సన్‌రూఫ్, ఇల్యూమినేటెడ్ ట్రిమ్ మరియు యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు సంజ్ఞ నియంత్రణ (గెశ్చర్ కంట్రోల్) తో కూడిన 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రియర్ వ్యూ కెమెరాతో కూడిన పార్కింగ్ అసిస్టెంట్‌ మరియు రివర్సింగ్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

భారత మార్కెట్లో BMW 220i బ్లాక్ షాడో ఎడిషన్ విడుదల.. ధర రూ. 43.40 లక్షలు మాత్రమే..!!

బిఎమ్‌డబ్ల్యూ 220ఐ బ్లాక్ షాడో ఎడిషన్ కారులో 2.0 లీటర్, 4 సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 5000 ఆర్‌పిఎమ్ వద్ద 189 బిహెచ్‌పి శక్తిని మరియు 1350-4600 ఆర్‌పిఎమ్ వద్ద 280 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7 స్పీడ్ స్టెప్‌ట్రానిక్ స్పోర్ట్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తో జత చేయబడి ఉంటుంది.

భారత మార్కెట్లో BMW 220i బ్లాక్ షాడో ఎడిషన్ విడుదల.. ధర రూ. 43.40 లక్షలు మాత్రమే..!!

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ కారు కేవలం 7.1 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. ఈ కారులో లాంచ్ కంట్రోల్, షిఫ్ట్ ప్యాడిల్స్, బ్రేకింగ్ ఫంక్షన్‌తో కూడిన క్రూయిజ్ కంట్రోల్‌ మరియు మూడు డ్రైవింగ్ మోడ్‌లు (ఎకో ప్రో కంఫర్ట్ మరియు స్పోర్ట్) మొదలైన ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో 3డి నావిగేషన్, వర్చువల్ అసిస్టెంట్, స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

భారత మార్కెట్లో BMW 220i బ్లాక్ షాడో ఎడిషన్ విడుదల.. ధర రూ. 43.40 లక్షలు మాత్రమే..!!

సేఫ్టీ పరంగా చూస్తే, ఇతర లేటెస్ట్ బిఎమ్‌డబ్ల్యూ డి-సెగ్మెంట్ కార్ల మాదిరిగానే ఈ కారులో కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, DSC, DTC, CBC, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు మరియు ఇతర డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లతో పాటుగా అనేక భద్రతా పరికరాలను కలిగి ఉంటుంది.

భారత మార్కెట్లో BMW 220i బ్లాక్ షాడో ఎడిషన్ విడుదల.. ధర రూ. 43.40 లక్షలు మాత్రమే..!!

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 220ఐ బ్లాక్ షాడో ఎడిషన్ కారును మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా, బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవా మాట్లాడుతూ, బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే యొక్క లిమిటెడ్ ఎడిషన్ ఈ పండుగ సీజన్‌లో వేడుకలను మరింత ముందుకు తీసుకువెళుతుందని, విజయవంతమైన 'బ్లాక్ షాడో' ఎడిషన్ ఇప్పుడు దాని పెట్రోల్ అవతార్‌లో మరింత ఎదురులేనిదిగా ఉంటుందని అన్నారు.

భారత మార్కెట్లో BMW 220i బ్లాక్ షాడో ఎడిషన్ విడుదల.. ధర రూ. 43.40 లక్షలు మాత్రమే..!!

ఏరోడైనమిక్స్‌పై స్పష్టమైన దృష్టితో రూపొందించబడిన ఈ సరికొత్త మోడల్ మోటార్‌స్పోర్ట్ ఔత్సాహికుల అవసరాలకు అనుగుణంగా రూపొందించబడిందని, ఇంకా, ఇందులోని BMW యొక్క సిగ్నేచర్ 'M' పెర్ఫార్మెన్స్ భాగాలు అద్భుతమైన అథ్లెటిక్ ఎడ్జ్‌ను అందిస్తాయని మరియు ఇది అన్ని అంశాలలో దాని స్పోర్టీ క్యారెక్టర్‌ను మరింత మెరుగుపరుస్తుందని ఆయన చెప్పారు. కొత్త BMW 220i ‘బ్లాక్ షాడో' ఎడిషన్ తమ కస్టమర్ లకు స్టైల్ మరియు పెర్ఫార్మెన్స్‌ తో ఆనంద ప్రపంచంలోకి ప్రవేశించడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుందని ఆయన చెప్పారు.

Most Read Articles

English summary
Bmw 220i black shadow edition launched at rs 43 50 lak182552
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X