2020లో కరోనాతో దెబ్బతిన్న బిఎమ్‌డబ్ల్యూ; అయినా ధైర్యంగా ముందుకు..

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా, గడచిన సంవత్సరానికి (2020) సంబంధించిన అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. గతేడాది బిఎమ్‌డబ్ల్యూ, మినీ బ్రాండ్ల కింద మొత్తం 6,604 కార్లు విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది.

2020లో కరోనాతో దెబ్బతిన్న బిఎమ్‌డబ్ల్యూ; అయినా ధైర్యంగా ముందుకు..

ఇవే కాకుండా బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ బ్రాండ్ క్రింద 2,563 మోటార్‌సైకిళ్లను కూడా విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, బిఎమ్‌డబ్ల్యూ ఇండియా గతేడాది బిఎమ్‌డబ్ల్యూ బ్రాండ్ కింద 6,092 కార్లను విక్రయించగా, మినీ బ్రాండ్ కింద 512 కార్లను విక్రయించింది.

2020లో కరోనాతో దెబ్బతిన్న బిఎమ్‌డబ్ల్యూ; అయినా ధైర్యంగా ముందుకు..

ఈ సమయంలో, కంపెనీ కొత్తగా మార్కెట్లోకి విడుదల చేసిన బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 కోసం మంచి డిమాండ్ నెలకొంది. కంపెనీ మొత్తం అమ్మకాలలో 50 శాతం స్థానికంగా తయారైన మోడళ్ల నుండే వచ్చాయి. ఇందులో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 వంటి స్పోర్ట్స్ యాక్టివిటీ వెహికల్స్ ఉన్నాయి. బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ మరియు బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ సెడాన్ మోడళ్లు కంపెనీ అమ్మకాల్లో కీలక పాత్ర పోషించాయి.

MOST READ:నాలుగు గంటల ఛేజింగ్ తర్వాత పట్టుబడ్డ దొంగలు.. విచారణలో తేలిన అసలైన నిజాలు

2020లో కరోనాతో దెబ్బతిన్న బిఎమ్‌డబ్ల్యూ; అయినా ధైర్యంగా ముందుకు..

ఇకపోతే, బిఎమ్‌డబ్ల్యూ స్థానికంగా ఉత్పత్తి చేసిన మినీ కంట్రీమాన్ కంపెనీ మొత్తం అమ్మకాలలో 40 శాతానికి పైగా వాటాను దక్కించుకుంది. ఐకానిక్ మినీ హ్యాచ్‌బ్యాక్ మరియు పాపులర్ మినీ కన్వర్టిబుల్ కార్లు రెండూ ఒక్కొక్కటి 23 శాతానికి పైగా అమ్మకాలకు సహకరించాయి.

2020లో కరోనాతో దెబ్బతిన్న బిఎమ్‌డబ్ల్యూ; అయినా ధైర్యంగా ముందుకు..

అలాగే, టూవీలర్ విభాగంలో బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ ఇండియా కొత్త బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్, బిఎమ్‌డబ్ల్యూ జి 310 జిఎస్ మోడళ్లను మార్కెట్లో విడుదల చేయడం ద్వారా కంపెనీ అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ రెండు మోటార్‌సైకిళ్ళు కలిసి సంవత్సర అమ్మకాలలో 80 శాతానికి పైగా వాటాను పొందాయి. ఇంకా బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్ మరియు జిఎస్ఏ, బిఎమ్‌డబ్ల్యూ ఎఫ్ 750 మరియు 850 జిఎస్, బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్ మోడళ్లు కూడా కంపెనీ అమ్మకాల పెరుగదలకు సహకరించాయి.

MOST READ:భారతదేశంలోనే అతి పిన్న వయసులో బస్ స్టీరింగ్ పట్టిన అమ్మాయి.. ఎందుకో మరి మీరే చూడండి

2020లో కరోనాతో దెబ్బతిన్న బిఎమ్‌డబ్ల్యూ; అయినా ధైర్యంగా ముందుకు..

ఇదిలా ఉంటే, బిఎమ్‌డబ్ల్యూ ఇండియా తన కొత్త 3 సిరీస్ గ్రాన్ లీమోసిన్‌ను జనవరి 21న మార్కట్లో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ మేరకు జనవరి 11వ తేదీ నుండి ఈ మోడల్ కోసం బుకింగ్‌లను ప్రారంభించనున్నట్లు కంపెనీ పేర్కొంది.

2020లో కరోనాతో దెబ్బతిన్న బిఎమ్‌డబ్ల్యూ; అయినా ధైర్యంగా ముందుకు..

ఆసక్తిగల కస్టమర్లు బిఎమ్‌డబ్ల్యూ అధీకృత డీలర్‌షిప్ ద్వారా కానీ లేదా ఆన్‌లైన్‌లో కానీ రూ.50,000 అడ్వాన్స్ మొత్తాన్ని చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. జనవరి 21న మధ్యాహ్నం 12 గంటలకు ముందు వరకూ వచ్చిన మొదటి 50 బుకింగ్‌ల కోసం కంపెనీ ప్రత్యేక ఆఫర్‌ను అందించనుంది.

MOST READ:11 బోయింగ్ 767-300 జంబో జెట్లను కొనుగోలు చేసిన అమెజాన్.. కారణం ఇదే

2020లో కరోనాతో దెబ్బతిన్న బిఎమ్‌డబ్ల్యూ; అయినా ధైర్యంగా ముందుకు..

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ 50 కార్లలో రియర్ సీట్ కంఫర్ట్ ప్యాకేజీని ఉచితంగా అందించనున్నారు. ఈ ప్యాకేజీలో ఐప్యాడ్, ఐప్యాడ్ హోల్డర్ మరియు కోట్ హ్యాంగర్ ఉంటాయి. బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఈ విభాగంలోనే అత్యంత పొడవైన సెడాన్ కారుగా నిలుస్తుంది. ఇందులో ఈ ఒక్క మార్పు మినహా, వేరే ఏ ఇతర మార్పులు ఉండబోవు.

2020లో కరోనాతో దెబ్బతిన్న బిఎమ్‌డబ్ల్యూ; అయినా ధైర్యంగా ముందుకు..

స్టాండర్డ్ బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్‌లో లభించే అన్ని ఫీచర్లు, పరికరాలు ఈ గ్రాన్ లీమోసిన్ వేరియంట్లో కూడా లభ్యం కానున్నాయి. గ్రాన్ లీమోసిన్ బ్రాండ్ యొక్క క్లార్ అర్కిటెక్చర్‌లో భాగంగా నిర్మించారు. ఇందులో ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:డొనాల్డ్ ట్రంప్ వాడిన రోల్స్ రాయిస్ కారు వేలం; వెల ఎంతంటే..?

2020లో కరోనాతో దెబ్బతిన్న బిఎమ్‌డబ్ల్యూ; అయినా ధైర్యంగా ముందుకు..

ఇంటీరియర్స్‌లో 12.3 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 10.25 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 3డి నావిగేషన్, రియర్ పార్క్ అసిస్ట్, బిఎమ్‌డబ్ల్యూ కార్ కనెక్టింగ్ టెక్నాలజీ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి అనేక ఫీచర్లు కూడా ఉన్నాయి.

2020లో కరోనాతో దెబ్బతిన్న బిఎమ్‌డబ్ల్యూ; అయినా ధైర్యంగా ముందుకు..

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లీమోసిన్‌లో స్టాండర్డ్ వెర్షన్‌లోని అదే 2.0-లీటర్ ఫోర్ సిలిండర్ల టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌నే ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 255 బిహెచ్‌పి పవర్‌ను మరియు 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

Most Read Articles

English summary
BMW India Sold 6604 Units In 2020, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X