బిఎమ్‌డబ్ల్యూ నుంచి రానున్న మరో కొత్త కార్; పూర్తి వివరాలు

ప్రపంచ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీలలో ఒకటి జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ 'బీఎండబ్ల్యూ'. ఈ కంపెనీ మార్కెట్లో ఇప్పటికే చాలా కార్లను విడుదల చేసి, ప్రముఖ కార్ల జాబితాలో స్థానం పొందింది. అయితే ఇటీవల కాలంలో కూడా కంపెనీ మరో కొత్త కారును ప్రపంచ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

బిఎమ్‌డబ్ల్యూ నుంచి రానున్న మరో కొత్త కార్; పూర్తి వివరాలు

బీఎండబ్ల్యూ ఆవిష్కరించిన ఈ కారు సెకండ్ జనరేషన్ 2 సిరీస్ కూపే, ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ కూపే వచ్చే ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకానికి రానున్నట్లు కంపెనీ నివేదించింది. ఈ 2 సిరీస్ కూపే మెక్సికోలోని బిఎండబ్ల్యు గ్రూప్ యొక్క శాన్ లూయిస్ పోటోసి ప్లాంట్లో తయారు చేయబడింది.

బిఎమ్‌డబ్ల్యూ నుంచి రానున్న మరో కొత్త కార్; పూర్తి వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ కూపే మూడు వేరియంట్లలో లభించనుంది. అవి 220 ఐ కూపే, 220 డి కూపే, మరియు టాప్-ఆఫ్-ది-లైన్ ఎమ్240 ఐఎక్స్ డ్రైవ్ కూపే వేరియంట్స్. కొత్త బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్‌లో కొత్త స్టైలింగ్ ఎలిమెంట్స్, మరింత శక్తివంతమైన ఇంజన్లు మరియు లేటెస్ట్ టెక్నాలజీ వంటి వున్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ నుంచి రానున్న మరో కొత్త కార్; పూర్తి వివరాలు

న్యూ జనరేషన్ బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ కూపేలో ట్రెడిషినల్ గ్రిల్ బార్‌లకు బదులుగా వర్టికల్లీ మౌంటెడ్ ఎయిర్ ఫ్లాప్‌లతో కొత్తగా రూపొందించిన కిడ్నీ గ్రిల్ ఉంది. అంతే కాకుండా, ఇందులో ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, పునఃరూపకల్పన చేయబడిన ఫ్రంట్ బంపర్ మరియు 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ వంటివి స్టాండర్డ్ గా లభిస్తాయి.

బిఎమ్‌డబ్ల్యూ నుంచి రానున్న మరో కొత్త కార్; పూర్తి వివరాలు

వీటితో పాటు అప్డేటెడ్ ఎల్ఈడీ టైల్ లైట్స్ కూడా ఇందులో చూడవచ్చు. 2 సిరీస్ కూపేలో టాప్-ఆఫ్-లైన్ ఎమ్240 ఐఎక్స్ డ్రైవ్ 19 ఇంచెస్ ఎమ్ లైట్-అల్లాయ్ వీల్స్ ఉంటాయి. మునుపటి మోడల్‌తో పోలిస్తే, కొత్త బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ కూపే మొత్తం 105 మిమీ పొడవు, 64 మిమీ వెడల్పు మరియు 51 మిమీ వీల్ బేస్ ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ నుంచి రానున్న మరో కొత్త కార్; పూర్తి వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ యొక్క ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో కాక్‌పిట్ డిజైన్‌తో ప్రీమియం క్యాబిన్ ఉంది. ఇది 8.8 ఇంచెస్ కంట్రోల్ డిస్ప్లే మరియు 5.1 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ స్టాండర్డ్ గా ఉంటాయి. మొత్తానికి ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ నుంచి రానున్న మరో కొత్త కార్; పూర్తి వివరాలు

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ కూపే సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ ట్విన్‌పవర్ టర్బో టెక్నాలజీ కలిగిన పవర్ పుల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ 2 సిరీస్ యొక్క 220 ఐ కూపే వేరియంట్లో 2.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 181.4 బిహెచ్‌పి శక్తి మరియు 300 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ వేరియంట్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 236 కి.మీ వరకు ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ నుంచి రానున్న మరో కొత్త కార్; పూర్తి వివరాలు

ఇక బిఎండబ్ల్యు యొక్క 220 డి వేరియంట్లో 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ ఉంది, ఇది 48-వి మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో జత చేయబడింది. ఇది 187.4 బిహెచ్‌పి మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ నుంచి రానున్న మరో కొత్త కార్; పూర్తి వివరాలు

టాప్-ఆఫ్-ది-లైన్ ఎమ్240 ఐఎక్స్ డ్రైవ్ కూపే వేరియంట్లో 3.0-లీటర్, 6-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 369 బిహెచ్‌పి శక్తిని మరియు 500 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ స్టెప్ట్రానిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది. ఈ కారు యొక్క గరిష్ట వేగం గంటకు 250 కిమీ వరకు ఉంటుంది.

Most Read Articles

English summary
Bmw Introduced New Gen 2 Series With Powerful Engine. Read in Telugu.
Story first published: Thursday, July 8, 2021, 13:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X