సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకున్న BMW కొత్త కార్.. ఇదే

ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ బిఎండబ్యూ (BMW) భారతదేశంలో తన కొత్త ఐఎక్స్ (iX) ఎలక్ట్రిక్ SUV ని 2021 డిసెంబర్ 13 న అధికారికంగా విడుదల చేయనుంది. అయితే విడుదలకు ముందే కంపెనీ యొక్క ఈ కొత్త ఎలక్ట్రిక్ SUV యొక్క సేఫ్టీ రేటింగ్ వెల్లడయ్యింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

సేఫ్టీలో కింగ్ BMW iX.. ఏకంగా 5 స్టార్ రేటింగ్ సొంతం

నివేదికల ప్రకారం, యూరో NCAP క్రాష్ టెస్ట్‌లో వెల్లడైన ఫలితాలలో BMW iX ఎలక్ట్రిక్ SUV 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సొంతం చేసుకుంది. కంపెనీ యొక్క ఈ కారు సేఫ్టీ విషయంలో సాధించిన అత్యధిక స్కోరు ఇది. ఈ కారు పెద్దలు మరియు పిల్లలకు అనుకూలంగా ఉండే సేఫ్టీ ఫీచర్స్ ఇందులో అందించింది.

సేఫ్టీలో కింగ్ BMW iX.. ఏకంగా 5 స్టార్ రేటింగ్ సొంతం

ఇందులో డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ల మధ్య కొత్త ఇంటరాక్టివ్ ఎయిర్‌బ్యాగ్ యొక్క ప్రభావాన్ని పరీక్షించడం జరిగింది. అంతే కాకుండా ప్రక్క నుండి ప్రక్కకు ఢీకొన్న సందర్భంలో గాయాన్ని తగ్గించడానికి కూడా దీనికి కావాల్సిన ఏర్పాట్లు జరిగాయి. దీనితో పాటు పిల్లలను రక్షించడానికి కూడా ఇందులో కావాల్సిన సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ కారణంగానే ఇది మంచి రేటింగ్ కైవసం చేసుకోగలిగింది.

సేఫ్టీలో కింగ్ BMW iX.. ఏకంగా 5 స్టార్ రేటింగ్ సొంతం

BMW iX అనేక అధునాతన సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉండటం మాత్రమే కాకుండా పాదచారులు మరియు సైక్లిస్టులు అలాగే వాహనాలను గుర్తించగల బ్రేక్ ఇంటర్వెన్షన్‌తో ఫ్రంట్ కొలిషన్ వార్నింగ్ సిస్టమ్‌ వంటి వాటిని కూడా కలిగి ఉంటుంది. ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ మళ్లింపు పరిస్థితుల్లో కూడా హెచ్చరికలను అందిస్తుంది. ఇది పాదచారులకు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

సేఫ్టీలో కింగ్ BMW iX.. ఏకంగా 5 స్టార్ రేటింగ్ సొంతం

BMW iX ఎలక్ట్రిక్ SUV ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయబడింది. అయితే ఇది భారతీయ మార్కెట్లోకి కంప్లీట్ బిల్ట్ యూనిట్ (CBU) మార్గంలో వస్తుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ SUV దేశీయ మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న Mercedes-Benz EQC మరియు Audi e-tron వంటి లగ్జరీ ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యర్థిగా ఉంటుంది.

సేఫ్టీలో కింగ్ BMW iX.. ఏకంగా 5 స్టార్ రేటింగ్ సొంతం

BMW iX రెండు వేరియంట్‌లలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో ఒకటి xDrive 40 మరియు xDrive 50. ఇందులో BMW xDrive 40 వేరియంట్ 326 బిహెచ్‌పి పవర్ మరియు 630 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒకఫుల్ ఛార్జ్‌పై 414 కిమీ పరిధిని అందిస్తుంది.

ఇక రెండవ వేరియంట్ BMW xDrive 50 విషయానికి వస్తే, ఇది 523 బిహెచ్‌పి పవర్ మరియు 765 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒకసారి ఫుల్ ఛార్జ్తో ఏకంగా 611 కి.మీ పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ రెండు వేరియంట్లు అత్యధిక పరిధిని అందిస్తాయి, కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

సేఫ్టీలో కింగ్ BMW iX.. ఏకంగా 5 స్టార్ రేటింగ్ సొంతం

BMW iX యొక్క ఫ్రంట్ అండ్ రియర్ యాక్సెంట్స్ లో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఇవ్వబడ్డాయి. ఇది కేవలం 6.1 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకోగలదు. కారు వినియోగాన్ని సులభతరం చేయడానికి, కంపెనీ కారుతో పాటు హోమ్ ఛార్జర్ కిట్‌ను కూడా అందిస్తుంది. ఇది 11 కిలోవాట్ AC ఛార్జర్, ఇది కారు బ్యాటరీని సుమారు 7 గంటల్లో 100 శాతానికి ఛార్జ్ చేస్తుంది.

సేఫ్టీలో కింగ్ BMW iX.. ఏకంగా 5 స్టార్ రేటింగ్ సొంతం

అంతే కాకుండా కేవలం 2.5 గంటల ఛార్జింగ్ తో ఏకంగా 100 కిలోమీటర్లు ప్రయాణించడానికి సరిపడా ఛార్జింగ్ చేసుకోగలదు. కంపెనీ అందించే హోమ్ ఛార్జర్ ని ఇంటిలో లేదా ఆఫీసులో ఎక్కడైనా కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

సేఫ్టీలో కింగ్ BMW iX.. ఏకంగా 5 స్టార్ రేటింగ్ సొంతం

BMW కంపెనీ భారతదేశంలోని 35 నగరాల్లో విస్తరించి ఉన్న తన డీలర్‌షిప్ మరియు సర్వీస్ నెట్‌వర్క్‌లో ఛార్జింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. కంపెనీ డీలర్‌షిప్‌లలో వినియోగదారులకు 50 కిలోవాట్ DC ఫాస్ట్ ఛార్జర్ అందుబాటులో ఉంచబడుతుంది. దేశంలోని ప్రతి నగరంలో BMW యొక్క ఎలక్ట్రిక్ కార్ల వినియోగదారులకు ఛార్జింగ్ సౌకర్యాలను అందించడానికి భారతదేశంలోని ఛార్జింగ్ సర్వీస్ ప్రొవైడర్లతో BMW భాగస్వామ్యం కలిగి ఉంది.

నివేదికల ప్రకారం, త్వరలో రానున్న కొత్త BMW iX ఎలక్ట్రిక్ SUV యొక్క అంచనా ధర సుమారు రూ. 1 కోటి (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు. అయితే ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండి, వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

BMW ఇప్పటికే i4 సెడాన్ ఉత్పత్తిని ప్రారంభించింది. కంపెనీ గత నెల చివరి వారం నుండి జర్మనీలోని మ్యూనిచ్ ప్లాంట్‌లో i4 సెడాన్‌ను ఉత్పత్తి చేస్తోంది. BMW కంపెనీ యొక్క ఈ ప్లాంట్ 100 సంవత్సరాల కంటే పాతది మరియు ఇది 3 సిరీస్ సెడాన్ మరియు టూరింగ్, M3 మరియు 4 సిరీస్ గ్రాన్ కూపేలను కూడా ఉత్పత్తి చేస్తుంది. మొత్తానికి బిఎండబ్ల్యు దేశీయ మార్కెట్లో తన ఉనికిని మరింత విస్తరించడానికి ఎప్పటికప్పుడు సన్నాహాలు సిద్ధం చేస్తోంది.

సేఫ్టీలో కింగ్ BMW iX.. ఏకంగా 5 స్టార్ రేటింగ్ సొంతం

కంపెనీ ఇప్పటికే అందించిన సమాచారం ప్రకారం, ఈ ఏడాది భారతదేశంలో ఏకంగా 25 కార్లను విడుదల చేసే ప్రణాళికలో భాగంగా కంపెనీ ఈ నెలలో BMW 220i M స్పోర్ట్ బ్లాక్ షాడో ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ పెర్ఫార్మెన్స్ సెడాన్ భారతదేశంలో రూ. 43.50 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేయబడింది. ఇది అధునాతన ఫీచర్స్ మరియు సాంకేతికతలను కలిగి ఉంటుంది.

Most Read Articles

English summary
Bmw ix electric suv euro ncap crash test 5 star rating details
Story first published: Thursday, December 9, 2021, 12:39 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X