భారత్‌లో విడుదలైన కొత్త బిఎమ్‌డబ్ల్యూ M5 కాంపిటీషన్; ధర & వివరాలు

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ తన బ్రాండ్ నుంచి ఇటీవల కొత్త ఎమ్5 కాంపిటీషన్ ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త బిఎండబ్ల్యు ఎమ్5 కాంపిటీషన్ ధర ఇండియన్ ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ. 1.62 కోట్లు. ఇది చాలా వరకు అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఈ కొత్త ఎమ్5 కాంపిటీషన్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

భారత్‌లో విడుదలైన కొత్త బిఎమ్‌డబ్ల్యూ M5 కాంపిటీషన్; ధర & వివరాలు

కొత్త బీఎండబ్ల్యూ ఎమ్5 కారు అప్డేటెడ్ డిజైన్ కలిగి ఉండటమే కాకుండా మెరుగైన పనితీరుని కూడా అందించేలా తయారుచేయబడింది. ఇవన్నీ కలిగి ఉండటం వల్ల కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 కాంపిటీషన్ కారు చూడటానికి చాలా ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంది. ఈ కారులో కొత్త లేజర్ లైట్ హెడ్‌ల్యాంప్‌లు మరియు రివైజ్డ్ టెయిల్ లాంప్స్‌తో ఎల్-ఆకారపు డిఆర్‌ఎల్‌లు ఉన్నాయి.

భారత్‌లో విడుదలైన కొత్త బిఎమ్‌డబ్ల్యూ M5 కాంపిటీషన్; ధర & వివరాలు

ఈ కొత్త కారులో అప్డేటెడ్ బంపర్‌ ఉంటుంది. వెనుక భాగంలో కూడా అప్డేటెడ్ ఎగ్జాస్ట్ టిప్స్ తో పాటుకొత్త ఆప్రాన్ మరియు డిఫ్యూజర్ డిజైన్ కలిగి ఉంది. అంతే కాకుండా ఇది 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కూడా పొందుతుంది. మొత్తానికి ఇది దాని మునుపటి మోడల్స్ అంటే కూడా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

భారత్‌లో విడుదలైన కొత్త బిఎమ్‌డబ్ల్యూ M5 కాంపిటీషన్; ధర & వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 కాంపిటీషన్ కారు యొక్క క్యాబిన్ లోపల, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో పెద్ద మార్పు జరిగింది. కావున ఇప్పుడు సరికొత్త ఐడ్రైవ్ సిస్టమ్‌తో 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్‌ను పొందుతోంది మరియు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు కార్ప్లే కనెక్టివిటీని వంటివాటిని కూడా కలిగి ఉంది

భారత్‌లో విడుదలైన కొత్త బిఎమ్‌డబ్ల్యూ M5 కాంపిటీషన్; ధర & వివరాలు

ఈ లగ్జరీ కారులోని ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో అడాప్టివ్ డంపర్స్, ట్రాక్ మోడ్, యాంబియంట్ లైటింగ్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీతో టచ్ స్క్రీన్, సిగ్నెల్స్ కంట్రోల్స్ మరియు వాయిస్ అసిస్ట్, 12.3 అంగుళాల డిజిటల్ డిస్ప్లే వంటివి ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి.వీటితో పాటు క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, హ్యాండ్స్ ఫ్రీ పార్కింగ్ మరియు 16-స్పీకర్ హర్మన్ కోర్డాన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంటాయి.

భారత్‌లో విడుదలైన కొత్త బిఎమ్‌డబ్ల్యూ M5 కాంపిటీషన్; ధర & వివరాలు

ఈ కొత్త ఎమ్ 5 కాంపిటీషన్ కారులో సన్‌రూఫ్, కార్బన్ సిరామిక్ బ్రేక్‌లు, సాఫ్ట్-క్లోజ్ డోర్స్, వెంటిలేటెడ్ సీట్లు, మసాజ్ ఫంక్షన్‌తో ముందు సీట్లు, రియర్ సీట్ ఎంటర్టైన్మెంట్ మరియు 360-డిగ్రీ కెమెరాలు వంటి అదనపు ఫీచర్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ వాహనదారులకు చాలా అనుకూలంగా మరియు దూర ప్రయాణాల్లో ఏ మాత్రం అలసట రానివ్వకుండా చేస్తాయి.

భారత్‌లో విడుదలైన కొత్త బిఎమ్‌డబ్ల్యూ M5 కాంపిటీషన్; ధర & వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్ 5 కాంపిటీషన్ కారులోని ఆరు ఎయిర్‌బ్యాగులు, అటెన్టివ్‌నెస్ అసిస్టెన్స్, బ్రేక్ అసిస్ట్‌తో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబిఎస్), డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ (డిటిసి) మరియు ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ కంట్రోల్ (ఇడిఎల్‌సి), కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ (సిబిసి) ఉన్నాయి.

అంతే కాకుండా ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్, ఎలక్ట్రానిక్ వెహికల్ ఇమ్మొబిలైజర్ మరియు క్రాష్ సెన్సార్లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటు మరియు ఎమర్జెన్సీ స్పేర్ వీల్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

భారత్‌లో విడుదలైన కొత్త బిఎమ్‌డబ్ల్యూ M5 కాంపిటీషన్; ధర & వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్ 5 కాంపిటీషన్ ఫేస్‌లిఫ్ట్‌లోని ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 4.4-లీటర్, ట్విన్-టర్బో వి 8 ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 625 బిహెచ్‌పి పవర్ మరియు 750 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ఇది కేవలం 3.3 సెకన్లలో గంటకు 0 నుచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

Most Read Articles

English summary
BMW M5 Competition Launched In India. Read in Telugu.
Story first published: Friday, July 2, 2021, 9:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X